Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-29 01:46 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 29 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | త్రయోదశి: రా.10-21వరకు తదుపరి చతుర్దశి | శతభిష నక్షత్రం రా.1-41వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: ఉ.7-55 నుంచి 9-36 వరకు | అమృత ఘడియలు: సా.6-04 నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా.10-39 నుంచి 11-27 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-29 12:31 GMT

వికారాబాద్.. 

-దీపికా స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు...

-మరికాసేపట్లో మీడియా ముందుకు దీపికా, అఖిల్ ను తీసుకువచ్చే అవకాశం...

2020-09-29 12:28 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-26 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 117.00 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 6.63 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,90,000 క్యూసెక్కులు

2020-09-29 12:22 GMT

చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

-కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలు ఒకవైపు రైతులను, మరోవైపు వినిమయ దారుల నడ్డి విడగొట్టే పరిస్థితికి   నెట్టబడింది....

-టోకు వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచేస్తున్నారు. మంచి నూనె లీటర్ 95 రూపాయలకు బదులుగా ఇప్పుడు 130 రూపాయలకు పెంచడం   అంటే దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగడం జరిగింది...

-అంతేకాకుండా నిత్యం ఉపయోగించే కూరగాయల ధరలు కూడా దాదాపు 100% రేట్లు పెరిగాయి...

-రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధరలను పెంచుతున్న వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం చేకూర్చాలని సిపిఐ కోరుతుంది.

2020-09-29 12:04 GMT

జిహెచ్ఎంసి..

రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ పై అధికారులతో పాటు ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి

#పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ కు టి పోల్ (TE poll) ప అవగాహణ కార్యక్రమం

#హాజరైన రాష్ట్ర ఎన్నికల అధికారులు.. జీహెచ్ఎంసీ అధికారులు

#కరోనా నేపథ్యంలో ఎన్నికల ను శాంతియుత వాతావరణం లో నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాం

#ఓటర్ లిస్ట్.. పోలింగ్ కేంద్రంను ఆన్ లైన్ లో పొందుపరుస్తాం.

#నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తాం

#టీ పోల్ ధ్వారా పోటీ చేసే స్వాతంత్ర్య అభ్యర్థులు.. పార్టీ అభ్యర్దుల వివరాలు తెలుసుకోవచ్చు

#సాంకేతిక పరిజ్ఞానం వల్ల తక్కువ సమయంలో... తక్కువ సిబ్బంది తో ఎన్నికల ను నిర్వహించ వచ్చు

#త్వరలోనే జీహెచ్ఎంసీ జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ పై సమావేశం

#150 పోలింగ్ కేంద్రం లో వార్డు ఒక్క ఫేస్ రికగ్నేషన్ యాప్ ను వాడుతాం

#ఫేస్ రికగ్నేషన్ యాప్ తో ఓటరు పూర్తి వివరాలు తెలుస్తాయి

#రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీనియర్ సిటిజన్.. దివ్యాంగు లకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్(E-voting) విధానం అమలు చేయబోతోంది.

#వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ ఓటింగ్ (E-voting) విధానం అమలు చేసేలా ఐటీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం

# ఈ ఓటింగ్ (E voting) విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది

#టీ పోల్ సాఫ్ట్ వేర్ తో పాటు సాంకేతిక అంశాలపై వచ్చే నెల 23 నుంచి 29 వరకు జోన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం

2020-09-29 12:01 GMT

హైదరాబాద్..

-విజయవాడ - విశాఖపట్నం మధ్య యూపీఎస్సీ పరీక్షల కోసం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు....

-అక్టోబర్ 3 - 4 తేదీలలో నడవనున్న ఈ రెండు ప్రత్యక రైళ్లు...

-ఈ రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ,రాజమండ్రి ,సమైకోట్, తుని ,అనకాపల్లి ,దువ్వాడ రైల్వే స్టేషన్లు ఆగ నున్నాయి

2020-09-29 11:59 GMT

సైబరాబాద్ సిపి...

-ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసాము...

-నిందితులు లక్ష్మణ్ రెడ్డి,యుగేంద్రర్ రెడ్డిన ఇద్దరిని 6 రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు..

-ఈ రోజు నిందితులను కస్టడీకి తీసుకుంటాము..

-ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరుపుతున్నాము..

-వీలయినంత త్వరగా చార్జీషీట్ పూర్తి చేసి హత్య కేసులో ప్రణయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాము...

2020-09-29 11:52 GMT

సైబరాబాద్ సీపీ సజ్జనార్...

-వీరంతా భారత్ పూర్ కి చెందిన వాళ్ళు .వీరిపై 40 కేసుల్లో నిందితులు.

-ప్రస్తుతం olx నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా కృషి చేసారు.

-ప్రత్యేక బృందం భరత్ పూర్ కి వెళ్లి నెల పాటు కష్టపడి 5గురిని పట్టుకున్నారు.ప్రధాన నిందితుడు రుక్మిన్ అతని స్నేహితులతో కలిసి olx నేరాలకు పాలడ్డారు.

-నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాము

-రుక్మిన్ తో పాటు ముర్ఫీద్, సైకుల్ ఖాన్, షారుక్, రాఖామ్ ఖాన్ లు ముఠా గా ఏర్పడి ఈ మోసాలు చేస్తున్నారు.

-క్యూ ఆర్ కోడ్ లు పంపి వస్తువులు కోసం రిక్వెస్ట్ పెట్టిన వారిని డబ్బులు పంపమని డబ్బులు గుంజేవారు

-ఆర్మీ అధికారి పేరుతో ...తనకి ట్రాన్స్ఫర్ కావడంతో విలువైన వస్తువులు తక్కువ రేటుకు ఇచ్చేస్తానని సంప్రదించిన వారి నుంచి డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్   ఆఫ్ చేస్తారు.

-ప్రజలు అందరూ olx లో వస్తువులు కొనేటపుడు జాగ్రత్తలు పాటించాలి. వస్తువును చూసి నమ్మకం వచ్చిన తర్వాతే కొనాలి.

-నిందితులు అందరూ రాజస్థాన్ భరత్ పూర్ కి చెందిన వారు.

-వీరి నుంచి లక్ష రూపాయల నగదు 12 ఏటీఎం కార్డులు, 21 సిమ్ కార్డులు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

2020-09-29 11:34 GMT

సైబరాబాద్ సీపీ సజ్జనార్...

-నాగరాజు రఘువర్మ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు..

-ఇతని తో పాటు రాజేష్, రామకృష్ణ,జోరె సింగ్ నలుగురు కలిసి డమ్మీ తుపాకులతో బెదిరించి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు....

-మియాపూర్ ఆర్మీ అధికారి లాగా వెళ్లి ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ ను కూడా ప్రారంభించాడు..

-వీరిపై ఆర్సీపురం, పంజాగుట్టు సనత్ నగర్, పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి..

2020-09-29 11:26 GMT

వరంగల్ అర్బన్:

-కాజీపేట రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం పైకి వస్తుండగా రైలుడబ్బ డోర్ తెరుచుకోని ఉండడంతో ఫ్లాట్ ఫాం మధ్యలో ఉన్న రైల్ వాషింగ్ వాటర్ పైప్ లైన్ పోల్స్   కు తగలడంతో ఒక్కసారిగా వాటర్ పైప్ లైన కిలోమీటర్ మేర కుప్పకూలాయి.

-సమాచారం తెలిసిన స్టేషన్ ఆధికారులు సంఘటన స్థలంకు చేరుకుని రైలును ఆపి తెరుచుకున్న గూడ్స్ బోగీ డోరు తొలగించి రైల్ ను పంపిచేశారు.

-డోర్ తగిలి సుమారు 55 వాటర్ వాషింగ్ పోల్స్ దెబ్బతిన్నాయి.

-ఈ సమస్య వల్ల పలు రైల్లకు అంతరాయం...

2020-09-29 11:19 GMT

నిజామాబాద్..

-నిజామాబాద్ శివారు బోర్గాం పి గ్రామం వద్ద భారీగా గంజాయి పట్టుకున్న నాలుగో టౌన్ పోలీసులు ..

-ఒక i20 కారు, బొలెరో ట్రక్ లో తరలిస్తున్న 152 కిలోల గంజాయి స్వాధీనం

-ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నాందేడ్ కు తరలిస్తుండగా పట్టివేత

-తవుడు సంచుల మాటున 35 సంచుల నడుమ గంజాయి స్మగ్లింగ్

-ఆరుగురు ఒరిస్సా వాసుల అరెస్టు, తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం

Tags:    

Similar News