Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
అమరావతి..
-ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
-నందమూరి హరికృష్ణగారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం.
-హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు
Amaravati updates: టిడిపి దళిత నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
అమరావతి..
-టిడిపి దళిత నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
-పాల్గొన్న టిడిపి ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు
-చిత్తూరు టిడిపి నాయకుల గృహ నిర్బంధాన్ని ఖండించిన చంద్రబాబు.
-టిడిపి పట్టుబట్టడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిపారు.
-హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు.
-రహస్యంగా పోస్ట్ మార్టమ్ జరపడం ఇంకో తప్పు
-మృతుడి సెల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం మరో తప్పు.
-కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లారు..?
-ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ కీలకం.
-ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ను బైట పెట్టాలి.
-అప్పుడే బెదిరింపులన్నీ బైటకు వస్తాయి.
-బెదిరించి, ప్రలోభాలు పెట్టి జరిగిన నేరాన్ని కప్పి పెట్టలేరు.
-చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు తీశారు.
-ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని నమ్మించారు.
-ట్రాక్టర్ బోల్తాపడి చనిపోతే ఒళ్లంతా కాలిన గాయాలు ఎలా ఉన్నాయి..?
-గతంలో ట్రిపుల్ మర్డర్ ను మించిన నేరాలు చిత్తూరులో జరుగుతున్నాయి.
-చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణం.
-చిత్తూరు జిల్లాలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
-3నెలల్లో వరుసగా 2జిల్లాలలో శిరో ముండనాలు మానవత్వానికే సిగ్గుచేటు.
-తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరో ముండనం, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం.. వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు.
Amaravati updates: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి..
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-*వాడుక భాషలో పుస్తకాలు రాయడానికి ఒక ఉద్యమమే చేసారు మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తిగారు.
-ఆ ఫలితంగానే ఈరోజు తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి అందింది.
-అటువంటి తెలుగు భాషను రాష్ట్రంలో కనుమరుగు చేయాలని కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం.
-ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
-గిడుగు రామమూర్తిగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
Hyderabad updates: గాంధీ హాస్పిటల్ నుండి పరార్ అయిన ఖైదీల కోసం గాలిస్తున్న పోలీసులు..
-గాంధీ హాస్పిటల్ నుండి పరార్ అయిన ఖైదీల కోసం గాలిస్తున్న పోలీసులు..
-రెండు స్పెషల్ టీం లను ఏర్పాటు చేసిన పోలీసులు..
-ఖైదీల ఆచూకీ తెలిపిన వారికి రీవార్డ్ ప్రకటించిన పోలీసులు..
-నలుగురు నిందితులు సోమ సుందర్, నర్సింహా,ఆర్భాజ్, జావీద్ కరోనా పాజిటివ్..
-కరోనా పాజిటివ్ ఉన్న నలుగురు బయట తిరగడం వలన ప్రమాదం అంటున్న పోలీసులు..
-ఇప్పటికే నలుగురు ఖైదీల ఫోటోలు విడుదల చేసిన పోలీసులు.
-ఖైదీల ఇంటి వద్ద తనిఖీలు చేసిన పోలీసులు.
Amaravati updates: విద్యార్థుల గురించి అనగాని సత్య ప్రసాద్ వ్యాఖ్యలు...
అమరావతి..
-అనగాని సత్య ప్రసాద్ టీడీపీ MLA
-మీ ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా?
-రాష్ట్రంలో స్కూళ్లు ఓపెన్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు.
-కరోనా కి భయపడి తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ముందుకు రావడం లేదు.
-రాష్ట్రంలో రోజుకి 10 వేల కు పైగా కరోనా కేసులు నమోదవుతుంటే ఈ సమయంలో స్కూళ్లు ఓపెన్ చేస్తారా?
-మీ ప్రచార అర్భాటం కోసం పిల్లల ప్రాణాల తో చెలగాటమాడుతారా?
-జగనన్న విద్యా కిట్స్ పంపిణీ చేయాలంటే వాలంటీర్ల చేత ఇంటిఇంటికి వెళ్ళివిద్యార్థులకు అందజేయాలి.
-అంతే తప్ప మీ రాజకీయ ప్రచారం కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దు.
-విద్యా శాఖ మంత్రి కరోనా బారిన ఇతర రాష్ట్రాల్లో ఉండి ఏపీలో మాత్రం స్కూళ్లు తెరుస్తామనటం వింతగా ఉంది.
Vizianagaram updates:నెల్లిమర్లలోని మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం..
విజయనగరం..
-నెల్లిమర్లలోని మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం..
-చనిపోయిన కరోనా బాధితుడిని తొలగించని వైనం..
-రాత్రి చనిపోగా బోడీని తరలించకుండా వార్డులో ఉంచిన హాస్పిటల్ సిబ్బంది.
-కరోనా రోగి చనిపోయిన 7గంటల వరకు వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందన్న కారణంగానే డేడ్ బాడిని మార్చురికి తరలించలేదని తెలుపుతున్న వైద్యులు
-పక్క బెడ్లో డెడ్బాడి ఉండటంతో ఆందోళనకు గురవుతున్న తోటి రోగులు..
Visakha updates: విశాఖ పెందుర్తి లో దళిత యువకుడు..
విశాఖ...
-విశాఖ పెందుర్తి లో దళిత యువకుడు
-శిరోముండనం కేసును ఎస్సీ ఎస్టీ ఏసీబీకి బదిలీ చేసిన పోలీసులు..
-శ్రీకాంత్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు.. ఈరోజు నూతన్ నాయుడు కుటుంబ సభ్యుల్ని సిబ్బందిని విచారించి అదుపులోకి తీసుకునే అవకాశం..
-దర్యాప్తు జరుగుతోంది....ఆరోపణలు రుజువు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం..
త్రినాధ్ ఏసిపి ఎస్సీ ఎస్టీ సెల్ విభాగం..
Amaravati latest news: మరికాసేపట్లో కౌంటర్ దాఖలుపై నేతలతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్
అమరావతి..
-మరికాసేపట్లో కౌంటర్ దాఖలుపై నేతలతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్...
-రాజధాని తరలింపు వాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మనోగతం తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ విర్చువల్ మీటింగ్...
-ఉదయం 11 గంటలకు ఈ సమావేశం...
-రాజధాని అంశంపై చోటు చేసుకొంటున్న పరిణామాలు,భూములు ఇచ్చిన రైతులకు న్యాయం అనే అంశాలే ప్రధాన చర్చ...
-మీటింగ్ లో పాల్గొనున్న జనసేన న్యాయవిభాగం,పీఏసీ సభ్యులు,మూడు ప్రాంతాల నాయకులు....
Rajamahendravaram updates: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని కోలుకున్న కోవిడ్ సోకిన ఖైదీలు
తూర్పుగోదావరి..
-రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని కోలుకున్న కోవిడ్ సోకిన ఖైదీలు
-ఇటీవల కరోనా బారినపడిన ఖైదీలలో 281 మందికి నెగిటీవ్
-జైలులోనే క్వారంటైన్ లో వుంచిన పాజిటీవ్ ఖైదీలకు రెండువారాలు దాటింది
-దీంతో రెండో దఫా పరీక్షలు నిర్వహించగా మొత్తం 281 మంది ఖైదీలకు నెగెటివ్ వచ్చింది సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
-ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన అయిదుగురు ఖైదీలు చికిత్స పొందుతున్నారు
-కోలుకున్న అయిదుగురు జైలు సిబ్బంది తిరిగి విధులకు హాజరయ్యారు...
Visakhapatnam updates: భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్సై షణ్ముక రావు తుపాకీ తో కాల్చుకొని మృతి..
విశాఖ..
-భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కాపులుప్పడా గ్రేహౌండ్స్ లో ఎస్సై షణ్ముక రావు తుపాకీ తో కాల్చుకొని మృతి..
-అనారోగ్యంతో ఇబ్బందిపడడం తో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం..
-కేసు నమోదు చేసిన భీమిలీ పోలీసులు..