Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు
ఈరోజు తాజా వార్తలు
అమరావతి: బుద్దా వెంకన్నని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు నాయుడు
బుద్దా వెంకన్న కరోనా సోకిందని తెలుసుకుని ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
హైదరాబాద్ ఎ ఐ జి హాస్పిటల్ లో మాట్లాడతాను హైదరాబాద్ కి రావలసిందిగా కోరారు...
నీ లాంటి వాళ్ళు పార్టి కి ఎంతో అవసరం అని తొందరగా కోలుకోవాలని ధైర్యం చెప్పడం జరిగింది.
మీకు ఎల్లవేళలా పార్టీ ఆఫీస్ నుండి ఒక టీమ్ అందుబాటులో ఉంటుందని ఏ అవసరమైన తెలియజేయవలసిందిగా కోరారు
శ్రీకాకుళం జిల్లా: జిల్లా కోవిడ్ ఆసుపత్రి వద్ద పేషంట్ ఆచూకీ తెలపాలంటూ బంధువులు ఆందోళన..
జులై 31 న కోవిడ్ ఆసుపత్రిలో చేరిన ధర్మాన గణపతి రావు..
గణపతి రావు స్వస్థలం నందిగాం మండలం దిమ్మిడిజోల..
అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి రావును పలాస ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..
కోవిడ్ అనుమతిని లక్షణాలు ఉండడంతో జెమ్స్ కు తరలించాలని చెప్పిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు..
పది రోజులుగా జెమ్స్ సిబ్బంది కనీస సమాచారం ఇవ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆవేదన..
రెండు రోజుల నుంచి గణపతి రావు కనిపించడం లేదని తెలిపిన ఆసుపత్రి సిబ్బంది..
పరిస్థితి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన గణపతి రావు కుటుంబీకులు..
గణపతి రావు ఆచూకీ తెలపాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా..
4.o గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
వచ్చే నెల 7వ తారీఖు నుండి ఇ దశలవారీగా మెట్రో రైల్ సర్వీసులకు అనుమతి
వచ్చే నెల 21 నుంచి సామాజిక క్రీడా సంబంధ ఎంటర్టైన్మెంట్ కల్చరల్ రిలీజియస్ పొలిటికల్ ఫంక్షన్స్ కు వంద మందితో అనుమతి
వచ్చే నెల 21 నుండి ఓపెన్ ఎయిర్ థియేటర్ లకు అనుమతి
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించిన తర్వాత పాఠశాలలు కళాశాలలు కోచింగ్ సెంటర్లకు వచ్చే నెల 30 వరకు ప్రారంభించడానికి అనుమతి లేదు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం మంది బోధన బోధనేతర సిబ్బంది పాఠశాలలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలి
మోత్కుపల్లి నర్సింహులు,మాజీమంత్రి
రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం..
రిజర్వేషన్ల సమీక్షను రాష్ట్ర లకు అప్పగించడాన్ని బీజేపీ తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం..
ఎమ్మార్పీఎస్ పోరాటం, అసెంబ్లీలో అనేక తీర్మానాల పలితమే ఈ తీర్పు
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి..
ఎస్పీ వర్గీకరణకు అన్ని పార్టీలు సపోర్టు చేశాయి..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాల్సి ఉంది..
రిజర్వేషన్ల వర్గీకరణ వలన ఎవరికి నష్టం జరగదు..
రాష్ట్రలకు ఈ అధికారులను అప్ప చెప్పడం ద్వారా స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది..
అమరావతి: సస్పెండ్ అయిన టీచర్ వెంకటేశ్వరరావుని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు
కృష్ణా జిల్లా ఉయ్యురు కు చెందిన నూకల వెంకటేశ్వరరావు ( nvr ) గార్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
మీకు, మీ కుటుంబానికి మేము, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు.
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఎప్పటికప్పుడు మీ సస్పెండ్ గూర్చి అన్ని విషయాలు నాకు తెలియజేసారని చెప్పిన చంద్రబాబు .
అనంతపురం:
- సర్వజన ఆసుపత్రి లో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
- కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని మండిపాటు
- ఆసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్ కారు ను అడ్డగించిన కార్మికులు.
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన
- ఆసుపత్రి అధికారులతో ఎఐటియుసి నాయకుల వాగ్వాదం
తూర్పుగోదావరి -రాజమండ్రి
సెప్టెంబర్ 14 నుంచి రాజమండ్రి ఆదికవి
నన్నయ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు
షెడ్యులు విడుదల చేసిన నన్నయ వీసీ మొక్కా జగన్నాథరావు
యూజీసీ మరియు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సెప్టెంబర్ 14వ తేది నుండి డిగ్రీ మరియు పీజీ పరీక్షలు నిర్వహణకు సిద్ధమోతున్న నన్నయ యూనివర్సిటీ
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ రూమ్ కి 12 మంది చొప్పున బెంచ్ కి ఒక్కరు చొప్పున పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మాస్క్ ఉన్న వారినే పరీక్ష గదిలోని అనుమతిస్తామని స్పష్టం చేసిన నన్నయ యూనివర్సిటీ
అమరావతి
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలా..? లేదా? అన్న అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ.
రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ కోరుకుంటున్న మెజార్టీ ప్రజలు.
6 రోజుల్లో అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్న మెజార్టీ ప్రజలు
"apwithamaravati.com" పేరుతో నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో...6 రోజుల వ్యవధిలోనే పాల్గొన్న సుమారు 3.76 లక్షల మంది ..
వారిలో 95శాతం మంది రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని ఆన్ లైన్ ఓట్లు వేసిన ప్రజలు.
కడప :
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
తులసిరెడ్డి కామెంట్స్
గిడుగు రామూర్తి జయంతి ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం...
తెలుగు అతి ప్రాచీనమయిన భాష...
పాఠశాలలో విద్యలో తెలుగు మద్యమాన్ని రద్దు చేయాలని రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక తప్పిదం...
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
శ్రీకాకుళం జిల్లా..
జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..
గడిచిన 24 గంటల్లో 522 కేసులు నమోదు..
దీంతో జిల్లాలో 22,381 కి చేరిన కరోనా కేసుల సంఖ్య..
ఈరోజు కరోనా నుంచి కోలుకుని 514 మంది డిశ్చార్..
ప్రస్తుతం జిల్లాలో 6,141 గా ఉన్న ఆక్టీవ్ కేసులు..