కరీంనగర్ : కరీంనగర్ లో మరోసారి ఉద్రిక్థత ...
కాషాయం రంగు మాస్క్ తో మఫ్టీ లో సంజయ్ దీక్ష శిబిరానికి వచ్చిన పోలీస్
పోలీస్ ను గుర్తుపట్టి తరిమిన బీజేపీ కార్యకర్తలు
పోలీస్ ల తీరుపై బిజెపి శ్రేణుల మండిపాటు
మంచిర్యాల జిల్లా//బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు దుబ్బాకలో అక్రమ అరెస్టు చేయడంతో నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పై కేసీఆర్ మరియు హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు.
సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణం లో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట.
సిద్దిపేటలో బండి సంజయ్ పై దాడి జరిగిందంటూ నిరసనగా కోదాడ రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించిన బిజెపి కార్యకర్తలు.. సీఎం కేసీఆర్ దృష్టి బొమ్మ ను దహనం చేస్తున్న బీజేపీ నాయకులను అడ్డుకున్న పట్టణ పోలీసులు.
బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత ...
నిన్న సిద్దిపేట లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడికి నిరసనగా కార్యకర్తల నిరసన...
ప్రగతి భవన్ వైపు దూసుకెళ్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు...
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు...
నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల అరెస్ట్..
స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు...
కరీంనగర్: బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కామెంట్స్
టీఆర్ఎస్ ఓటమి పాలు కాబోతోందని సర్వేల్లో తేలడంతో ఆ పార్టీ అరచకాలు చేసి గెలవాలనపకుంటోంది.
పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది.
ఎన్నికల కోడ్ లేని సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో అప్రజాస్వామికంగా సోదాలు
బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం.
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సొంత సీటును కాపాడుకునేందుకు దురాగతాలు చేస్తోంది.
అక్కడ ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా
ఉన్నారు.
ఓటు వేయకపోతే
సంక్షేమ పథకాలు ఇవ్వబోమని దుబ్బాక ప్రజలను బెదిరిస్తున్నారు.
ఓడిపోతామని తెలిసి సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నాడు.
దుబ్బాక ఫలితం 2023 ఫలితాలకు అద్దం పట్టబోతోంది.
ఎందుకోసం తెలంగాణ కోరుకున్నామో అవేవీ నెరవేరలేదు.
టీఆర్ఎస్ నియంతృత్వ పోకడను ప్రజలు అర్థం చేసుకున్నారు.
దుబ్బాకలో కనీస అభివృద్ధి ఎందుకు చేయలేదు.
కేంద్రం నుంచి డబ్బులు రాలేదని, వ్యవసాయ మీటర్లు పెడుతారని హరీశ్ అబద్దాలు చెబుతున్నాడు.
కేంద్ర నిధులు కాలేదని అర్థిక మంత్రి రాతపూర్వకంగా ఇవ్వాలి.
కేసీఆర్ కంటే హరీశ్ ఎక్కువ అబద్ధాలు చెబుతున్నాడు. అబద్దాల్లో వీళ్లకు డాక్టరేట్ ఇవ్వాలి.
సీటు పోతే పరువుపోయి ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
నిన్న బండి సంజయ్ పై దాడి సహించలేనిది. సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలి.
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఇప్పుడున్న అధికారులందరినీ మార్చాలి.
బీజేపీ శ్రేణులంతా దుబ్బాక కార్యక్షేత్రంలో ఉండాలి.
ఆరు ఏళ్లలో దుబ్బాక కోసం జరగని అభివృద్ధి ఇప్పుడెలా చేస్తారు.
అరెస్టు చేసిన బీజేపీ నేతలను, కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలి.
ఆదిలాబాద్‌జిల్లా కేంద్రం లో బిజెపి అందోళన..
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అరెస్ట్ ను నిరశిస్తూ బస్టాండ్ ముందు సీఎం కేసీఆర్ దిష్టి బోమ్మను దగ్దం చేసిన బిజెపి నాయకులు..
సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేసిన వారిపై చర్చలు తీసుకోవాలని డిమాండ్
సిద్దిపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ మీడియా సమావేశం.
జోయల్ డెవిస్ కామెంట్స్:
*దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో నిన్నటి ఘటనలో పోలీస్ పై మీడియా చానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం
*ఎన్నికల సిబ్బంది పకడ్బందీగా తమ విధులు నిర్వహిస్తుంది
*నిన్నటి సోదాల ఘటనలో ఎగ్జక్యూటివ్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే సర్చ్ వారెంట్ ఇచ్చారు
*అక్కడ జరిగిన ప్రతి విషయం సాక్షుల సంతకాలు తీసుకునే చేశారు
*సురభి జితేందర్ రావు సమక్షంలోనే అంతా జరిగింది
*ఎగ్జక్యూటివ్ అధికారి పంచనామా పూర్తి చేసి బయటకు వచ్చేముందు బీజేపీ కార్యకర్తలు దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు
*ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలి
*నిన్న నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేస్తే ఒక్కరి వద్దనే డబ్బులు దొరికాయ
*నిన్నటి ఘటనలో 5 గురిని గుర్తించాం, మరో ఇరవై మందిపై కేసులు నమోదు చేశాం
*అధికారులు సీజ్ చేసిన నగదును ఎత్తుకెళ్లాడం పెద్ద నేరం
*బండి సంజయ్ కి సిద్దిపేట జరిగిన ప్రతి విషయంను క్లుప్తంగా చెప్పిన సిద్దిపేట కు వస్తె లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని
*ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చే వారిని ఎవరిని కూడా అడ్డుకోవడం చేయడం లేదు
*ఉప ఎన్నికల కోసం అదనంగా పోలీస్ సిబ్బంది ఎర్పాటు చేశాం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనుల ప్రగతి, రైతు వేదికలు, పిఎంజిఎస్ వై రోడ్ల ఆన్ గోయింగ్ పనులపై సమీక్షిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిఆర్ ఇఎన్ సి సత్యానారాయణ రెడ్డి, పిఎంజిఎస్ వై సిఇ సంజీవరావు, తదితర అధికారులతో మినిష్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమైన మంత్రి
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
నిర్ణీత లక్ష్యాలకనుగుణంగా... ఆయా పనులు నిర్ణీత సమయంలో జరగాలి
రైతు వేదికలు, రోడ్లు, ఇతర పనులన్నీ నాణ్యత ప్రమాణాలకనుగుణంగా జరిగేలా చూడాలి
త్వరిత గతిన పనులు పూర్తి కావాలి
అభివృద్ధి పనుల్లో ఆలస్యం తగదు
ఆయా పనులు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి పర్యవేక్షించాలి
కరోనా నేపథ్యంలో కుంటుపడిన పనులన్నీ... రెట్టించిన వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
కరీంనగర్:. బిజెపి నేత ,నటుడు బాబూమోహన్ కామెంట్స్:
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిపై దాడి
హేయమైన చర్య
హరీశ్ రావు పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించాడు.
హరీశ్ రావు చిన్న పిల్లాడిలాగా ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడు.
ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారు.
సిద్ధిపేట, గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చేయలేదు?
రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయం
ప్రధాని కల్లెర్రజేస్తే మీరు జైల్లో ఉంటారు.
ఆడవాళ్లు, పిల్లలని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తీంచారు.
హుందాగా ఉండాల్సిన సీపీ అత్యుత్సాహం చూపించారు.
నిన్నటి ఘటనపై చర్యలు తప్పవు.
ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది.
మీ పునాదులు దుబ్బాక ఫలితంతో కదలబోతున్నాయి.
మంచిర్యాల జిల్లా:
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం, దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునందన్ ను పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో జె.ఎ.సీ శిబిరం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెస్తూ నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.