Mancherial: అల్ ఇండియా లో 330 ర్యాంక్ సాదించిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ అభినందన సభ..
మంచిర్యాల జిల్లా:
- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హల్ లో సివిల్స్ లో అల్ ఇండియా లో 330 ర్యాంక్ సాదించిన సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ అభినందన సభ..
- పాల్గొని సన్మానించిన గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల ముకేశ్ గౌడ్, గోప రాష్ట్ర అధ్యక్షులు డా.విజయ్ భాస్కర్
Pedapalli District: నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీకొని యువకుడు మృతి.
పెద్దపల్లి జిల్లా:
- మంథని మండలం నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీ కొని పుప్పాల నందు (24) అనే యువకుడు మృతి.
👉 మృతుడు ములుగు జిల్లా కు చెందిన వ్యక్తి.
Khammam: ఖమ్మంలో తితిదే కళ్యాణ మండపం భూవివాదంపై హైకోర్టులో విచారణ
- వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య పిల్ పై హైకోర్టు విచారణ
- తితిదేకు చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారన్న పిటిషనర్
- తితిదే ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని తెలిపిన ప్రభుత్వం
- పక్క భూమిని కూడా తితిదే ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్న ఖమ్మం కార్పొరేషన్
- ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు వ్యాఖ్య
- భూమి వెనక్కి తీసుకుంటే తితిదే ఎందుకు స్పందించడం లేదన్న హైకోర్టు
- ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనక తితిదే ఉండొచ్చునన్న హైకోర్టు
- ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్య
- దేవుడి పేరిట భూములు ఆక్రమించ రాదన్న హైకోర్టు
- దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్య
- భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశం
- విచారణ సెప్టెంబరు 8కి వాయిదా వేసిన హైకోర్టు
Keesara Tahsildar Case: కీసర కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు...
- కీసర కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నలుగురు నిందితులు...
- రేపు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరపనున్న ఏసీబీ కోర్ట్.
- ఇప్పటికే ముగిసిన నిందితుల ఏసీబీ కస్టడీ.
Telangana: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత
- తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ మోహన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత
- కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన మోహన్ రావు
- మోహన్ రావు ఇంటికి వెళ్ళి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని ప్రకటించారు మాజీ ఎంపీ కవిత.
- అసోసియేషన్ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్ రావు నిరంతరం కృషి చేసేవారని గుర్తుచేశారు.
- మోహన్ రావు మృతి తీరని లోటన్న మాజీ ఎంపీ కవిత, మోహన్ రావు కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు.
TS IPass: టీఎస్ ఐపాస్ కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
- టీఎస్ ఐపాస్ కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
- టియస్ ఐపాస్ పైన పూర్తి వివరాలు అందిస్తే అధ్యయనం చేస్తామన్న కేంద్ర మంత్రి
- భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ గా మారాలంటే భారీ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనే మార్గం అన్న మంత్రి కెటిఆర్.
- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్క్ లకు కేంద్రం సహాయం అందించాలని కోరిన మంత్రి కేటీఆర్
- హైదరాబాద్ ఫార్మా సిటీ, వరంగల్ మేగా టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్ మెడికల్ డివైసెస్ పార్క్ లకు కేంద్రం సహయం అందించాలన్న మంత్రి కేటీఆర్
- స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విషయంలో తెలంగాణ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది
- స్థానికంగా ఎంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తే అన్ని ఎక్కువ ప్రోత్సహకాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి
- వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంపైన జరిగిన రాష్ర్టా పరిశ్రమల మంత్రుల సమావేశంలో పాల్గోన్న
Karimnagar: Hmtv తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కరీంనగర్ :
- కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో సిటీ స్కానింగ్ లేకపోవడం సిగ్గుచేటు
- లోపాలని ప్రభుత్వానికి చెబుతున్న కూడా పట్టింపు లేకుండా ప్రజల జీవితాల తో చెలగాటం ఆడుతుంది
- చివరికి గవర్నర్ పై కూడా ఎదురుదాడి కి దిగారు....మరి ప్రభుత్వానికి ఎవరు చెబితే వింటారు
- అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం...
Karimnagar: వీణవంక మండల కేంద్రం లో విషాదం.
కరీంనగర్ జిల్లా:
- వీణవంక మండల కేంద్రం లో విషాదం.
- మూడేళ్ల కూతురుతో తల్లి ఆత్మహత్య...
- స్థానికంగా ఒక బావిలో తల్లి కూతుళ్ళ శవాలను గుర్తించిన స్థానికులు..
- కుటుంబ కలహాలే కారణమని అంటున్న స్థానికులు,విచారిస్తున్న పోలీసులు
TS High Court on Pensioners Petition: పెన్షనర్ల పిటీషన్ పై హైకోర్టు విచారణ...
హైదరాబాద్:
- పెన్షనర్ల పిటీషన్ పై హైకోర్టు విచారణ...
- లాక్ డౌన్ కారణంగా పెంఛనర్లకు 25 శాతం కోత విధించడం పై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు
- రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి పెన్షన్ లో 25 శాతం కోత విధించిన ప్రభుత్వం..
- వెంటనే ఆ డబ్బు చెల్లించాలని హైకోర్ట్ ను ఆశ్రయించిన బాధితులు.
- పెన్షనర్ల దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం..
- ఈరోజు ఉదయం కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.
-ఈరోజు ఉదయం కౌంటర్ ధాఖలు చేస్తే ఎలా విచారిస్తామని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
- ఈ పిటీషన్ ను రెగ్యులర్ కోర్ట్ లో విచారించాలని కోరిన ఏజీ..
- అభ్యంతరం వ్యక్తం చేసిన పిటీషనర్ తరపు న్యాయవాది..
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నే విచారిస్తామన్న హైకోర్టు..
- తదుపరి విచారణ ను సెప్టెంబర్ 8 వాయిదా వేసిన హైకోర్టు.
Narayanpet district updates: మక్తల్ కాటన్ మిల్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు....
నారాయణ పేట జిల్లా :
-మక్తల్ కాటన్ మిల్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు స్వల్ప గాయాలతో బయట పడ్డ డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులు సురక్షితం..