Khammam: ఖమ్మంలో తితిదే కళ్యాణ మండపం భూవివాదంపై హైకోర్టులో విచారణ

- వీహెచ్ పీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య పిల్ పై హైకోర్టు విచారణ

- తితిదేకు చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారన్న పిటిషనర్

- తితిదే ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని తెలిపిన ప్రభుత్వం

- పక్క భూమిని కూడా తితిదే ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్న ఖమ్మం కార్పొరేషన్

- ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని హైకోర్టు వ్యాఖ్య

- భూమి వెనక్కి తీసుకుంటే తితిదే ఎందుకు స్పందించడం లేదన్న హైకోర్టు

- ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనక తితిదే ఉండొచ్చునన్న హైకోర్టు

- ప్రభుత్వ భూమిని తితిదే ఆక్రమించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్య

- దేవుడి పేరిట భూములు ఆక్రమించ రాదన్న హైకోర్టు

- దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్య

- భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశం

- విచారణ సెప్టెంబరు 8కి వాయిదా వేసిన హైకోర్టు

Update: 2020-08-27 11:16 GMT

Linked news