Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-26 02:41 GMT
Live Updates - Page 2
2020-09-26 08:27 GMT

Hemanth Murder Case: హేమంత్ కేసులో సంచలన వాస్తవాలు

- నెల రోజుల ముందే హేమంత్ ని చంపేందుకు ప్లాన్ చేసిన లక్ష్మారెడ్డి, యుగంధర్,

- నెల రోజుల ముందే హేమంత ను చంపేందుకు చేసిన రెక్కి చేసినా యుగంధర్ సోదరులు..

- గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటున్న హేమంత్..

- హేమంత్ ఎలా చంపాలి ఎలా కిడ్నాప్ చేయాలన్నదానిపై స్కెచ్ వేసిన యుగంధర్ ..

- కిరాయి హంతకులు కృష్ణ, రాజు, pasha లతో పలుమార్లు డిస్కషన్ చేసిన యుగంధర్..

- మాయమాటలు చెప్పి Avanti ని తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ వేసిన లక్ష్మారెడ్డి.. కేసులో 

- నెల రోజులుగా అవినీతిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసినా లక్ష్మారెడ్డి. వాస్తవాలు 

- నెల రోజుల క్రితమే హేమంత్‌ను చంపడం కోసం

- లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో మీటింగ్‌

- జూన్‌ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతిరెడ్డి

- జూన్‌ 11న హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న అవంతి

- అవంతి, హేమంత్‌ వివాహంతో అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చన

- తన కూతురుడి వివాహంపై యుగంధర్‌రెడ్డితో గోడు వెళ్లదీసుకున్న అర్చన

- నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు

- తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని నిర్ణయించుకున్న యుగంధర్‌రెడ్డి

- నెల రోజుల క్రితం లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంంబ సభ్యుల సమావేశం

- ఎలాగైనా అవంతి, హేమంత్‌ను విడదీయాలని నిర్ణయం

- యుగేందర్‌రెడ్డి అన్న విజయేందర్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి కోసం రెక్కీ

- 24న మధ్యాహ్నం 2:30 ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ 12 మంది బంధువులు

- హేమంత్‌, అవంతిపై దాడిచేస్తూ కార్లోకి ఎక్కించిన బంధువులు

- లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లివైపు తీసుకెళ్లిన బంధువులు

- గోపన్‌పల్లిలో తప్పించుకున్న అవంతి, హేమంత్‌

- అవంతి పారిపోయిన హేమంత్‌ దొరికాడు

- రా.7:30కి కారులోనే హేమంత్‌ను చంపిన నిందితులు

- సీన్‌లో లేకుండా జాగ్రత్తపడ్డ లక్ష్మారెడ్డి, అర్చన

- బైక్‌పై గోపన్‌పల్లికి వచ్చిన లక్ష్మారెడ్డి

- కేసు మొత్తంలో 13 మంది బంధువులు ఇన్వాల్వ్

- అర్చన బాధ చూడలేకే హత్య చేశానంటున్న యుగంధర్‌రెడ్డి...

2020-09-26 08:10 GMT

నిబంధ‌న‌ల అనుకూనంగా విజయదశమి ఉత్సవాలు: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

తూర్పుగోదావరి:  రాజమహేంద్రవరం దేవిచౌక్ విజయదశమి ఉత్సవాలకు రాట ముహూర్తం

- ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ,రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వైఎస్సార్ పార్టీసిటి కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం

- కరోనా నిబంధనలు పాటించి ఉత్సవాలు నిర్వహించాలని, భక్తులు జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

2020-09-26 08:03 GMT

Weather Updates: వెదర్ అప్ డేట్

విశాఖ: 

తూర్పు బీహర్ పరిసర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనంకు అనుబధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ తీరమునకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వరకు ఈశాన్య జార్ఖండ్, ఒరిస్సా మీదగా ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 మద్య ఏర్పడింది.

దక్షిణ చత్తీష్ ఘడ్ నుండి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదగా3.1 కిలోమీటర్ల ఎత్త వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది.

వీటి ప్రభావంతో ఈరోజు ఉత్తర కోస్తాంద్రా, దక్షిణి కోస్తా ఆంధ్రా, రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు కురిసే అవకాశం.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనంతపూర్, చిత్తురు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం.

తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,కష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం

2020-09-26 08:00 GMT

దేశ సంపదను దోచి పెడుతున్నారు: సీపీఎం

విజయవాడ: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిలు రామకృష్ణ, మధు

నరేంద్రమోదీ కార్పొరేట్ రంగానికి దేశ సంపదను దోచి పెడుతున్నారు

ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం తక్షణం వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు(29,30,1 తేదీల్లో)అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలకు పిలుపునిస్టున్నాం

కేంద్రంలో ఉన్న పెద్దలకు సీఎం జగన్ వంగి వంగి దండాలు పెడుతున్నారు

4వేల కోట్ల అప్పు కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు

విద్యుత్ మీటర్లు బిగించిన రోజు నుండే జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం మొదలవుతుంది

టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఇక్కడ ఒకలా పార్లమెంట్ లో ఒకలా టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు

మూడు రోజుల నిరసన దీక్షలు తరువాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం

రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు

చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారు

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై మడమ తిప్పి బీజేపీతో కలిశాడు

అంతర్వేది ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి

ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఎరుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది

2020-09-26 06:28 GMT

AP D.Ed Exams: ఏపీలో డిఎడ్ పరిక్షల వాయిదా

అమరావతి: డిఎడ్ పరిక్షలు వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

సెప్టెంబరు 28 నుంచి జరగవలసిన డిఎడ్ పరిక్షలు కోవిడ్-19 కారణంగా వాయిదా 

2020-09-26 06:17 GMT

Agriculture Bill: వ్యవసాయ బిల్లుల పై ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్

కడప :  వ్యవసాయ బిల్లుల పై ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్..

మూజువాణి ఓటుతో అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదించుకున్నారు..

వ్యవసాయానికి సంభందించిన మూడు బిల్లులు తేనె పూసిన కత్తుల్లాంటివి..

రైతులు, వినియోగదారులు, రాష్ట్రాలకు ఈ బిల్లులు వ్యతిరేకం..

రిలయన్స్ లాంటి బడా వ్యక్తులకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ బిల్లులకు సంబంధించిన పత్రాలపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరబోతున్నాం..

బిల్లులను ఉపసంహరించుకునేంత వరకూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధంగా ఉంది..

2020-09-26 06:10 GMT

AP PGECET 2020: పీజీ ఈసెట్ పరీక్షలు

విశాఖ: ఈనెల 28 వ తేదీ నుంచి వచ్చె నెల 3 వ తేదీ వరకు ఏపీ పి జి ఈ సెట్  పరీక్షలు.

- ఇంజినీరింగ్ ,ఫార్మసీ పిజి కోర్స్ లో ప్రవేశాలకు ఏపీ పి జి ఈ సెట్.

- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ప్రేవేశ పరీక్ష.

- పరీక్షకు హాజరు కానున్న 28726 మంది అబ్యర్థులు.

- కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు.

- రోజుకు రెండు సెషన్ లలో పరీక్షలు.

- ఉదయం 10 గంటలు నుంచి 12 గంటలు వరకు ,మధ్యాహ్నం 3 గంటలు నుంచి 5 గంటలు వరకు పరీక్షలు.

- రాష్ట్ర వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.

- పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతి లేదు.

2020-09-26 04:39 GMT

Antarvedi temple chariot: నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముహూర్తం

తూర్పుగోదావరి

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముహూర్తం

ఆలయం వద్దకు చేరుకున్న రథం తయారీ కలప

ఈనెల 27వ తేదీ ఆదివారం నరసింహ హోమం చేసి 11.15 నిమిషాలకు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రథం నిర్మాణ పనుల బాధ్యతలను ఆలయ నిర్మాత కొపనాతి వంశీయులకు స్థానిక అగ్నికుల క్షత్రియులు, జనసేన పార్టీ డిమాండ్‌

ఈ సమస్యను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టిన ఆలయ అధికారులు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేటి నుంచి పునఃప్రారంభిస్తున్నాం

ఉ. 6 నుంచి సా. 6 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.

ఆలయ ఏసీ భద్రాజీ .



 



2020-09-26 03:05 GMT

Annavaram updates : భక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా అన్నవరం సత్యదేవుని వ్రత పూజ

- భక్తులు వ్రత రుసుం ఆన్‌లైన్‌లో చెల్లిస్తే వారికి అధికారులు ప్రత్యేకంగా యూట్యూబ్‌ లింక్‌ను పంపిస్తారు.

- పురోహితులు చేసే పూజకు అనుగుణంగా ఇంట్లో స్వామి వ్రతం చేసుకునే అవకాశంతోపాటు దేవస్థానంలో జరిగే వ్రత పూజను ఆన్‌లైన్‌ ద్వారా వీక్షించే అవకాశం భక్తులకు కల్పిస్తారు

- కరోనా నేపథ్యంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్న అధికారులు

- ఆన్‌లైన్‌ వ్రత పూజ కోసం అన్నవరం రత్నగిరిపై ప్రత్యేకంగా స్టూడియో

- ఇక్కడ స్వామికి వ్రత పురోహితులు చేసే పూజ విధానాన్ని కెమెరా యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

- ఆన్‌లైన్‌ వ్రతపూజ విధానం ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నవరం ఈవో త్రినాథరావు తెలియచేశారు.

2020-09-26 02:57 GMT

East Godavari Updates : 12 మంది పంచాయతీ కార్యదర్షులపై విచారణ

తూర్పుగోదావరి జిల్లా- లోని 12 మంది పంచాయతీ కార్యదర్శులపై విచారణ

- రాజమహేంద్రవరం రూరల్లో పిడింగొయ్యి, హుకుంపేట, బొమ్మూరు, కాకినాడ రూరల్లో రమణయ్యపేట, అనపర్తిలో అనధికార అపార్టుమెంట్ల నిర్మాణానికి సంబంధించిన అవకతవకలపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

- అప్పట్లో ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహించిన 12 మంది కార్యదర్శులపై విచారణ చేయాలని ఆదేశాలు

- జడ్పీ సీఈవో నారాయణమూర్తిని విచారణాధికారిగా నియమిస్తూ, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

Tags:    

Similar News