Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-26 02:11 GMT
Live Updates - Page 4
2020-10-26 10:39 GMT

Amaravati Updates: వ్యవసాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు..

అమరావతి....

-Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

-నేను 14 ఎకరాలు పంట వేసాను..

-5 ఎకరాల్లో 20 నుండి 25 సాతం ఈ నకిలీ విత్తనాలు వచ్చాయి..

-సాధారణంగా 1.5 శాతం మాత్రమే బెరుకు విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది..

-గుంటూర్ జిల్లా వ్యవసాయ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళా..

-పొలం పరిశీలించారు.. రిపోర్టు రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా..

-ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సీఎం దృష్టికి తీసుకువెళ్తా...

-ఏపీ సీడ్స్ కి సరఫరా చేసే విత్తనాల కంపిణీలపై విజిలెన్స్ జరుగుతుందా లేదా చూడాలి..

-ఇలాంటి విత్తనాలు సరఫరా చేసిన మంజీరా కంపిణీ పై చర్యలు తీసుకోవాలి..

-విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా..

2020-10-26 10:35 GMT

Nara Lokesh Comments: జగన్ బయటకు రాకపోవడం వల్లే నేను బయట తిరుగుతున్నాను..

 పశ్చిమ గోదావరి జిల్లా

 పశ్చిమలో నారా లోకేష్ కామెంట్స్

-జగన్ చేతకాని తనం వల్లే నేను ఇప్పుడు బయట తిరగాల్సి వస్తుంది..

-నేను బయట తిరగతాన్ని ఎగతాళి చేస్తూ ఓ మంత్రి నన్ను ఎద్దుతో పోల్చారు...నేను ఎద్దునైతే మీ ముఖ్యమంత్రి దున్నపోతా

-వరద బాధితులకు కనీసం ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం కూడా ఇవ్వడం లేదు.

-జగన్ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదు.

-అనంతపురంలో ప్రకటిస్తుంటే మాపైనే దాడులు చేస్తున్నారు.

-జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ కేవలం రైతులకు 25లక్షలు ఖర్చు చేశారు.

-కొల్లేరుకు ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వస్తే వారిని ఆదుకునే చర్యలు లేవు

-ఉభయగోదావరి, కృష్ణా జిల్లా రైతలకు సూచిస్తున్నా.. మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలి

-ఈ అంశంపై టీడీపీ రైతులకు అండగా ఉంటుంది

-దళిత, బీసీ రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. అది ఎలా రైతు సంక్షేమం అవుతుంది

-రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు 40రూపాయలకు అమ్ముతున్నారు.. మరీ దారుణం

-పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేసారు

-నిధులు రాకపోతే మాపై ట్విట్లు చేయడం కాదు.. పనికి మాలిన యంపీలు ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయాలి

-అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తుంటే, బయట నుంచి మనుష్యులను తీసుకు వచ్చి కేసులు పెడుతున్నారు

-ఢిల్లీ చుట్టూ ప్రతిసారి 59లక్షల ఖర్చుపెట్టి అటూ ఇటూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలీదు.. రాష్ట్రానికి ఏమీ లాభం రాలేదు

2020-10-26 10:31 GMT

Guntur District Updates: కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు...

 గుంటూరు జిల్లా...

-గుంటూరు జిల్లా,తెనాలి సుల్తానాబాద్ హత్య కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు

-ఈ నెల 21న జరిగిన చంద్రనాయక్ హత్యకు సంబంధించి భార్యే కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ

-వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో చంద్ర నాయక్ ను హత్యచేయించిన భార్య జ్యోతి బాయ్

-అక్రమ సంబంధమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు

-చంద్రనాయక్ భార్య జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివ నాగార్జున అరెస్టు

-హత్యకు సహకరించిన జ్యోతి అక్క కొడుకు సాయి కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు

2020-10-26 10:28 GMT

Visakha Updates: గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....

విశాఖ...

ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కామెంట్స్....

-40 ఎకరాల గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....

-భూమి విలువ 800 కోట్ల పైచిలుకు

-విశాఖ లో ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రభుత్వం చూస్తుంది

-దీనిని పొలిటికల్ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు..

-సామాన్య ప్రజలు ఎవరూ ఇది సరికాదు అని అనలేదు.. కేవలం టిడిపి నాయకులే అంటున్నారు

-56 పేజీల రిట్ పిటీషన్ వేశారు,వచ్చిన కోర్ట్ ఆర్డర్ ను వక్రీకరించి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నారు

-కోర్ట్ లో గీతం భూమి మాదే అని చెప్పలేదు

-ప్రభుత్వ భూముల్లో ఆక్రమించి కట్టిన భూముల్ని ప్రభుత్వ అవసరాలకు రానున్న కాలంలో ఉపయోగిస్తాం

-ఆగస్టు3 ముఖ్యమంత్రి కి గీతం వారు లేఖలో 40 ఎకరాలు అభివృద్ధి కోసం కావాలని రాసారు.ఇంతకన్నా అది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి సాక్ష్యాలు   కావాలా...

-గీతంలో ఒక్క పేద వాడైనా చదువుకొనే అవకాశం ఉందా..

-చంద్రబాబు కు విద్యా దానం కంటే భూ దానం ఎక్కువయ్యింది .

2020-10-26 10:19 GMT

Nellore District Updates: అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి...

నెల్లూరు :--

  ఏపి టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు. పీసీ

-- రాష్ట్రంలో దళితులపై దాడులు,దళిత మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి

-- 5లక్షల భూమిని 50లక్షలకి పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే దళితుల భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది

-- అభివృద్ధి వికేంద్రీకరణకి టీడీపీ వ్యతిరేకం కాదు వికేంద్రీ కరణ పేరుతో అమరావతికి అన్యాయం చేయడానికి మేము వ్యతిరేకం

-- గాంధీజి కలలను సాకారం చేస్తా అన్న ముఖ్యమంత్రి సచివాలయలను అడ్డుపెట్టుకుని దళారులకు ఉడిగం చేస్తున్నారు

-- దళిత రైతు జైపాల్ పై అక్రమ కెలుసు పెట్టాడని మేము తీవ్రంగా కండిస్తున్నాం,దీనిపై కేంద్ర ఎస్సి ఎస్సి కమీషన్,హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్లతం

-- దళితులు,రైతుల సంక్షేమం గురించి ఈ ప్రభుత్వనికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు,ధరల స్థిరీకరణ గురించి అస్సలు చర్యలే లేవు

--దళారుల వెనకున్న మాఫీయాని బహిర్గతం చేసేవరకు మా పార్టీ పోరాటం చేస్తుం ది.

2020-10-26 10:17 GMT

Kadapa District Updates: ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..

కడప :

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కామెంట్స్..

-ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..

-టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఉండేది..

-వైసీపీ అసమర్థత కారణంగా పోలవరంకు కేంద్రం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేస్తోంది..

-నిధులు కావాలని అడగటానికి వైసీపీ ఎంపీలకు నోరు రావడం లేదు..

-పోలవరం పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం పూర్తి ఎడారిగా మారుతుంది..

-హోదా విషయంలో ఢిల్లీ పెద్దల మెడలు వంచుతామన్న వైసీపీ నేతలు వారి వద్దే వంగి వంగి మెడలు వంచుతున్నారు..

-పోలవరం నిధులు రాబట్టలేకపోతే ఎంపీలు రాజీనామా చేయాలి..

-వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ...

-గీతం, నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గు చేటు..

2020-10-26 09:58 GMT

Amaravati Updates: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్రం నిధులు..

అమరావతి..

-పునరావాసంతో సంబంధం లేదంటున్న కేంద్రం..

-ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో వెలుగులోకి కీలక అంశాలు..

-2016 సెప్టెంబర్‌ నాటి కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం..

-పోలవరం నిర్మాణం నిధులు మాత్రమే కేంద్ర భరిస్తుందని స్పష్టీకరణ..

2020-10-26 09:42 GMT

C.M.Jaganmohan reddy: దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం...

  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కామెంట్స్:

– ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా.

– ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి.

– ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

– రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిలు కూడా ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం.

– ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం.

– వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాలను చేపడుతున్నాం.

– ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం.

– 16.2 శాతం ఎస్సీలకు, 6శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూముల కేటాయింపు .

– స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి.

– ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం.

– సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి.

– పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నాం.

– అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం.

– ఆసరా, చేయూత లాంటి పథకాలనుకూడా చేపట్టాం.

– మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకు వచ్చాం.

– చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా చూశాం.

– ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

– రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం .

– అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

– ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలోఆదేశించిన సీఎం

2020-10-26 09:13 GMT

Amaravati Updates: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం...

అమరావతి:

// ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం

// ‘‘జగనన్న వైయస్సార్‌ బడుగు వికాసం’’ను క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

2020-10-26 09:10 GMT

West Godavari Updates: ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి...

పశ్చిమ గోదావరి జిల్లా.. 

// ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి అశ్వియుజమాస నిజకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

// శ్రీవారిని అమ్మవార్లను పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెలు గా అలంకరణ చేసి తంతు సంకల్పం నిర్వహించారు.

// ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు S.V.సుధాకరరావు మరియు MP. మార్గాని.భారత్ రామ్.

Tags:    

Similar News