Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-26 02:11 GMT
Live Updates - Page 2
2020-10-26 15:21 GMT

Kadapa District Updates: ఆర్డీవో పై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన పరుష వ్యాఖ్యలను ఖండిస్తన్నాం....

కడప :

*రాష్ట్ర సివిల్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మచంద్రా రెడ్డి కామెంట్స్ ....

*గీతం యూనివర్సిటీ లో అక్రమ కట్టడాలు కూల్చివేత సందర్బంగా ఆర్డీవో పై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన పరుష వ్యాఖ్యలను ఖండిస్తన్నాం.....

*చట్ట పరిధిలోనే మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు మాకు ఉండవు....

*ఆరోజు ప్రభుత్వం చెప్పిందే చేసాం..... ఈ రోజు ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నాం.....

*మెప్పు పొందినపుడు ఒకలా, లేనప్పుడి మరోలా స్పందించడం మంచిది కాదు....

*ఉద్యోగుల పై ఎవరు ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేసిన వారికి ధీటుగా సమాధానం చెబుతాం.....

*క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుకాడబోము..

2020-10-26 15:13 GMT

Amaravati Updates: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబి) నిరాకరణ...

  అమరావతి

-- పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్ట్ లను రివర్స్ టెండరింగ్, జుడిషియల్ ప్రివ్యూ నుండి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

-- నూతన విధానం ప్రకారం ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబి) నిరాకరణ

-- పట్టణ ప్రాంతాల్లో తాగునీటి, మురుగునీటి పారుదల ప్రాజెక్టు అమలుకు 2019లో ఏఐఐబి, ఏపీ ప్రభుత్వం మద్య ఒప్పందం

-- అప్పటి నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని సూచించిన ఏఐఐబి

-- ఏఐఐబి సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్ ను జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ నుండి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన పురపాలక శాఖ

-- ఏఐఐబి నిధుల తో రూ. 5350.62 కోట్లతో పట్టణ మంచినీటి సరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్ట్ కు పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం

2020-10-26 15:02 GMT

Visakha Updates: విశాఖ పోర్టు ట్రస్టులో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు...

  విశాఖ....

//ఈ నెల 27 వ తేది నుండి నవంబర్ 2 వ తేది వరకు. .

//అప్రమత్తత భారత్, సంపన్న భారత్ థీమ్ తో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహణ..

//కోవిడ్ నిబంధనల పై ప్రజలలో అవగాహన..

//పాలన లో పారదర్శకత పై కార్యక్రమాలు నిర్వహించనున్న పోర్టు ట్రస్ట్..

2020-10-26 14:57 GMT

Amaravati Updates: మోసపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే!

  అమరావతి...

* విత్తన కంపెనీ చేతిలో మోసపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

* 14 ఎకరాల్లో పంట వేయగా 5 ఎకరాల్లో బయటపడ్డ నకిలీ విత్తనాలు

* ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసిన ఆర్కే

* పంట నష్టంతో వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

* విచారణకు ఆదేశించిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు

2020-10-26 14:53 GMT

Kurnool District Updates: మహానంది మండలం గాజులపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం...

కర్నూలు జిల్లా :

*రోడ్లు పై నడుచుకుంటూ వెళుతున్న వారి పై దూసుకెళ్లిన కారు..

*అవ్వ సత్యవతి( 55), మనవడు చరణ్ (12) అక్కడికక్కడే మృతి..

*మరొకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు..

*మృతులు గాజులపల్లె కు చెందిన వారిగా గుర్తింపు..

2020-10-26 14:51 GMT

Prakasam District Updates: బేస్తవారిపేట మండలం మల్లపురం గ్రామంలో విషాదం...

ప్రకాశం జిల్లా..

* స్థానిక గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి

* మృతి చెందిన ఇద్దరు యువకులు అన్నదమ్ములు కావడంతో తల్లడిల్లి పోతున్న కుటుంబ సభ్యులు.

* సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

* కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

2020-10-26 14:16 GMT

Amaravati Updates: కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి...

  అమరావతి

_ వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలి

_ కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం

_ అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశాలు

– కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్న అధికారులు

– వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు

– స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామన్న అధికారులు.

– అందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందన్న అధికారులు

– ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 నాలుగు వారాల్లో పనులు ప్రారంభిస్తామన్న అధికారులు

– ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలన్న సీఎం.

– పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలన్న ముఖ్యమంత్రి.

– కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి.

– కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.

– కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై సమీక్ష చేసిన సీఎం.

– క్లస్టర్‌ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు.

– రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్న అధికారులు

– ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్న అధికారులు

– డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.

– పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి.

– కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలన్న సీఎం.

2020-10-26 14:01 GMT

Visakha Updates: విశాఖ లో atm దొంగతనం జరిగింది..

విశాఖ

-డీసీపీ క్రైమ్స్ సురేష్ బాబు కామెంట్స్.

-ఈ నెల 22 రాత్రి విశాఖ లో atm దొంగతనం జరిగింది

-గ్యాస్ కట్టర్ సహాయం తో sbi ఎటిఎం ను కట్ చేసి

-9,59500 దొంగతనం జరిగింది..

-Cc కెమెరా ను డిస్ కనెక్ట్ చేసారు దొంగలు

-కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని

-6 టీమ్స్ ఏర్పాటు చేసాము

-దొంగలు 23 ఉదయం బెంగుళూరు వెళ్లారు.

-బెంగుళూరు, అనంతపురం పోలీస్ ల సహాయం తీసుకున్నాము..

-సమ్మరజ్యోత్ సింగ్(పంజాబ్), జాఫర్ సాధిక్ (కేరళ) అనే ఇద్దరు పాత నేరస్థులు ఈ దొంగతనం చేశారు.

-విశాఖలో మొత్తం 50ఎటిఎం లు రెక్కీ చేశారు

-కేవలం 5 సెలెక్ట్ చేసి, వాటి లామ్స్ కట్ చేశారు..

-అల్లిపురం లో 20వ తేదీన గ్యాస్ కట్టర్ దొంగతనం చేసి 22వ తేదీన దొంగతనం చేశారు

-అనంతరం ఫ్లైట్. కు బెంగుళూరుకు వెళ్లిపోయారు

-6 లక్షలు రికవరీ చేశాము..

-గతంలో వీరు హైదరాబాద్, కూకట్ పల్లి, మాదాపూర్, బెంగుళూరు లో 2 ఎటిఎం లు దోచుకున్నారు.

-లగర్జి గా బ్రతకడం ఈ ఇద్దరికి ఇష్టం..

-కేవలం టాటా కంపెనీ మెయింటైన్ చేస్తున్న ఎటిఎం లనే వీరు దొంగతనం చేస్తారు..

2020-10-26 13:46 GMT

Amaravati Updates: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం...

అమరావతి

-అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

-పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం

-గతంలో మాదిరిగా 3 మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం

-ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి

-ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్షార్హులని పేర్కోన్న అబ్కారీ శాఖ

2020-10-26 13:18 GMT

Talari Venkatrao: పండుగ రోజు సీఎం దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారు..

- తలారి వెంకట్రావు,వైసీపీ ఎమ్మెల్యే, గోపాలపురం

- పండుగ రోజు సీఎం దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారు

- అందుకే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం

Tags:    

Similar News