Amaravati Updates: కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి...
అమరావతి
_ వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలి
_ కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం
_ అధికారులకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాలు
– కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్న అధికారులు
– వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు
– స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామన్న అధికారులు.
– అందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందన్న అధికారులు
– ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 నాలుగు వారాల్లో పనులు ప్రారంభిస్తామన్న అధికారులు
– ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలన్న సీఎం.
– పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలన్న ముఖ్యమంత్రి.
– కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి.
– కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
– కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సమీక్ష చేసిన సీఎం.
– క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు.
– రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్న అధికారులు
– ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్న అధికారులు
– డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.
– పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి.
– కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలన్న సీఎం.