Kurnool updates: వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల రాస్తారోకో..
కర్నూల్ జిల్లా..
-కోడుమూరులోని కోట్ల సర్కిల్ వద్ద రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల రాస్తారోకో
-ఎద్దుల బండ్లతో పాటు పాల్గొన్న రైతులు
-వ్యవసాయ బిల్లును ఆమోదించినందుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేషనల్ హైవే పై రాస్తారోకో నిర్వహించిన రైతులు..
-డోన్ నేషనల్ హైవే పై తీవ్ర ఉద్రిక్తత
-నేషనల్ హైవే పై సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల రాస్తారోకో
-ధర్నా చేసినటువంటి నాయకులను, మహిళలను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు.
Vijayawada updates: వన్ టౌన్ రమణయ్య కూల్ డ్రింక్ షాపు యజమాని శివకుమార్ కృష్ణనదిలో గల్లంతు..
విజయవాడ..
-నాలుగు రోజులు అయిన కనిపించని మృతదేహం
-మృతదేహాం కోసం నాలుగు రోజుల నుండి గాలిస్తున్న ఎన్ డి ఆర్ ఎఫ్ , ఎస్ డిఆర్ ఎఫ్ సిబ్బంది.
-కృష్ణనదికి వరద ప్రవాహాం ఎక్కువగా రావడంతో గాలింపు కష్టతరం
-మృత దేహాం కోసం కృష్ణానది వద్ద ఎదరు చూస్తున్న కుటుంబ సభ్యులు
East Godavari updates: కాకినాడ రూరల్ తూరంగిలో గుట్కా స్టాక్ పాయింట్ పై ఇంద్రపాలెం పోలీసుల దాడి..
తూర్పుగోదావరి :
-భారీగా నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్ల ను సీజ్ చేసిన పోలీసులు..
-సుమారు రూ. 35 లక్షల విలువైన 7.5 లక్షల నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేసిన పోలీసులు..
-గుట్కా నిల్వ చేసిన హరినాధ్ అనే వ్యక్తి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
-ఒక లారీ, ఆటో సహా రూ. 21 వేల నగదు స్వాధీనం..
Prakasam updates: కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది...
ప్రకాశం..
-ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కామెంట్స్...
-కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా విద్యుత్ మీటర్లు ద్వారా రైతులకు 30 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం...
-కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి... వాటిని అధిగమించేందుకు కేంద్రం ద్వారా నిధులు రాబట్టి ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాం...
-ఆ నిధులు మేము జేబులో వేసుకోవడానికి కాదు...
-తెలంగాణ ప్రభుత్వం బీజేపీతో ఒకసారి కలిసి ఉంటుంది... మరోసారి విభేదిస్తుంది... మేము అలా కాదు...
-తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆలోచించి చేస్తే బాగుంటుంది...
Vijayawada updates: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నిరసన..
విజయవాడ..
-కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రైతు సంఘాల నేతల నిరసన
-నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్, సీపీఐ, సిపిఎం నేతలు.
-నిరసనలో పాల్గొన్న నేతలు, రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు
-అరెస్ట్ అయిన నేతలు సీపీఐ నారాయణ, రామకృష్ణ, సీపీఎం మధు, బాబు రావు
-రైతు సంఘం నేతలు వడ్డే శోభనాదిశ్వర రావు
-కాంగ్రెస్ నేత గంగాధర్, నరహరి శెట్టి నరసింహ రావు.
-పలువురు మహిళలు ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించిన పోలీసులు
Vizianagaram updates: విజయనగరం గిరిపుత్రులకు తప్పని డోలి కష్టాలు..
విజయనగరం ...
-సాలూరు మండలం సిరివరకు గ్రామానికి చెందిన వ్యక్తికి వైద్యం కోసం నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకేళ్ళిన బందువులు.
-సీదరపు రాము అనే వ్యక్తికి వారం రోిజులుగా జ్వరంతో బాదపడుతున్నా స్థానికంగా వైద్య సదుపాయాలు లేక ఇక్కట్లు
-జ్వరంతో పాటు వాంతులు తోడవడంతో పరిస్థితి విషమించటంతో నడుచుకుంటూ డోలి సహాయంతో తరలింపు.
-ఒడిశా రాష్టానికి చెందిన నారాయణ పట్నా వరకు 4కిలోమీటర్ల మేర డోలీలో తీసుకువెళ్ళి వైద్యం అందిస్తున్న పరిస్థితి.
Visakha updates: పెందుర్తి-అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు!
విశాఖ...
-తెలుగుదేశం పార్టీ మాజీ అనకాపల్లి శాసనసభ్యుడు పీలా గోవింద్ సత్యనారాయణ ప్రభుత్వ గెడ్డ పోరంబోకు భూమిని ఆక్రమించారు అంటూ పిర్యాదు...
-పిర్యాధు మేరకు చర్యలు తీసుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బంది.
-వారిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పీలా శ్రీనివాస్ తెలుగుదేశం కార్యకర్తలు.
Srisailam Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
కర్నూలు జిల్లా:
- 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో : 1,05,215 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 1,14,896 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
- ప్రస్తుతం : 884.80 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం: 214.3637 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Karnataka:రాజధాని బెంగళూరులో అలజడి హింసాత్మక సంఘటన లో దూకుడు పెంచిన ఎం ఐ ఏ
కర్ణాటక:
- రాజధాని బెంగళూరులో అలజడి సృష్టించిన డి జి హళ్ళి, కే జి హళ్ళి హింసాత్మక సంఘటన లో దూకుడు పెంచిన ఎం ఐ ఏ.
- సూత్రధారులను గుర్తించేందుకు ఎం ఐ ఏ అధికారుల దాడులు.
- ఇప్పటికే అరెస్టు చేసిన 380 మంది నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరణ
- శాసనసభ్యుడు అఖండ శ్రీనివాసమూర్తి నివాసం, బంధువులు ఇళ్ల పై రాళ్లు రువ్వడం, దాడులకు అసలు కారకులు ఎవరు అన్నది గుర్తించే పనిలో అధికారులు
Kurnool Updates: శ్రీశైలం గంటా మఠం పునరుద్ధరణ పనుల్లో బయటపడిన ధ్యాన మందిరం
కర్నూలు జిల్లా
- గంటా మఠం ముందుభాగాన కోనేరు కు ఉత్తర భాగాన బయటపడిన ఈ ధ్యాన మందిరం
- 6 అడుగుల 6 ఇంచుల విస్తీర్ణంతో కలిగి ఉన్న డ్యానమందిరం
- తవ్వకాలలో ధ్యాన మందిరం నైరుతి భాగం నుండి ఆగ్నేయం వరకు మరియు ఆగ్నేయ మార్గం నుండి తూర్పు వరకు నెలకొన్న స్వరంగా మార్గం
- జీర్ణోద్ధరణ పనుల ధ్యాన మందిరమును పరిశీలిస్తున్న ఈఓ కేయస్ రామారావు ఆధికారులు