Live Updates: ఈరోజు (25 అక్టోబర్, 2020 ) బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-25 09:42 GMT
Live Updates - Page 2
2020-10-25 14:49 GMT

Kurnool updates: మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి...

కర్నూలు...

//మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా...

//మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారని ఎంతైటి వారైనా ఏపార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి.. 

//కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై శుక్రవారం దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని   డిమాండ్

//భాదిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరుపున అండగా ఉంటామని బాలిక తల్లిదండ్రులకు భారోసా ఇచ్చిన తెలుగుదేశం నాయకులు

2020-10-25 14:38 GMT

Amaravati updates: విశాఖ గీతం యూనివర్సిటీ కట్టడాలు కూల్చివేత నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే...

అమరావతి...

//నవంబర్ 30 వరకు కట్టడాలు కూల్చివేత నిలుపుదలపై స్టే ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు

//కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

//స్టే ఆర్డర్ ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసిన న్యాయస్థానం

2020-10-25 14:35 GMT

Hyderabad updates: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్న మంత్రులు..

 హైదరాబాద్.. 

//రేపు హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని, ప్రశాంత్ రెడ్డి

//జియగూడా, గోడే క కబర్, కట్టెల మండి ...

//ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభం చేయనున్న మంత్రులు

2020-10-25 14:32 GMT

Adilabad updates: పిప్పరవాడ టోల్ ప్లాజా వద్ద కంటైర్ లో అకస్మాత్తుగా మంటలు....

ఆదిలాబాద్..

//మంటలు చెలరేగడంతో దగ్దమైనా కంటైనర్..

//ముప్పై లక్షల అస్తినష్టం

//డిల్లీ నుండి చెన్నై వెళ్లుతున్నా కంటైనర్

2020-10-25 14:28 GMT

Vijayawada updates: ముగిసిన దసరా ఉత్సవాలు..

  విజయవాడ...

//ప్రారంభం అయిన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఊరేగింపు

//డప్పులు, మేళతాలాలు, సింగారి మేళం నడుమ ఘనంగా జరుగుతున్న నగర ఊరేగింపు.

//మరికాసేపట్లో ఊరేగింపుగా తప్పోత్సవానికి ఉత్సవమూర్తులను తీసుకురానున్న అధికారులు.

//నదీ విహారం లేకపోవడంతో హంస వాహనంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించనున్న వేద పండితులు

2020-10-25 14:26 GMT

Vijayawada Durgamma updates: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వేణుగోపాల్..

 విజయవాడ

-చల్లబోయిన వేణుగోపాల్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

-ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

-చెడు పై మంచి సాధించడమే విజయదశమి.

-నవరాత్రులలో అమ్మవారు ప్రజలకు ఎలా వరాలు ఇస్తున్నారో అలాగే ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు.

-బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచిన దసరా ఈ సంవత్సరం దసరా.

-బలహీన వర్గాలకు చెందిన తనను మంత్రిగా జగన్ చేశారు.

-మరిన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విధంగా అమ్మవారి కరుణా కటాక్షాలు సీఎం జగన్ కి ఉండాలి.

2020-10-25 11:20 GMT

Tirumala updates: స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను తిరుపతిలో జారీ..

  తిరుమల..

//శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ఉచిత స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ నుండి తిరుపతిలో జారీ

//తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు. రోజుకు 3 వేల టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందజేస్తారు .

//శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు.

//టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి రావలసి ఉంటుంది.

//ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తులను మాత్ర‌మే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమ‌లకు అనుమతిస్తారు.

2020-10-25 11:14 GMT

East Godavari updates: వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి..

తూర్పు గోదావరి జిల్లా

//కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే   జక్కంపూడి రాజా.

//కోరుకొండ సీతానగరం మండలాల్లో వివిధ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

2020-10-25 11:08 GMT

Botsa Satyanarayana Comments: గీతం యూనివర్సిటీ పై బొత్స వ్యాఖ్యలు..

//గీతం తమవని చెప్పుకుంటున్న భూములు ప్రభుత్వానివి

//చంద్రబాబు హయాంలో గీతం యూనివర్సిటీ భూ కబ్జా చేసింది

//ముందస్తు నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు తొలగించారు.

//పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం

//పోలవరం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారు.

//పోలవరం పూర్తి చేయడం పై మా ప్రభుత్వం ప్రాధాన్యత

2020-10-25 11:05 GMT

Botsa Satyanarayana Comments: చంద్రబాబు బాబు గ్రాఫిక్స్ తో మెట్రో చూపెట్టారు..

 విశాఖ..

//విశాఖ లో మెట్రో రైల్ త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష

//మీడియం మెట్రో కంటే లైఫ్ మెట్రో ఖర్చు తక్కువుగా ఉంటుంది

//స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రో, బీచ్ , పోస్ట్ ఆఫీస్ వరకు మెట్రో ప్రణాళికలు

//మహారాష్ట్ర కు చెందిన విఎంటీఎస్ కంపెనీ కు కు మెట్రో ప్రాజెక్ట్ అందజేత

//మెట్రో రైలు కు 1.25 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు స్టాప్ లు ఉండాలి

//ఢిల్లీ, బొంబాయి, పట్టణాలతో సమానంగా విశాఖ కూడా అభివృద్ధి చెందుతుంది

//బి ఆర్ టి ఎస్ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ లో ఉంది

Tags:    

Similar News