Live Updates: ఈరోజు (25 అక్టోబర్, 2020 ) బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. రెండు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో వైభవంగా కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పండుగలకు దూరం అయిపోయిన ప్రజలు ఈసారి దసరా పండుగను కరోనా నిబంధనల నేపథ్యంలోనే సంబరంగా జరుపుకుంటున్నారు.
ఈరోజు తాజా వార్తలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...
//చార్మినార్ భాగ్యలక్ష్మి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
//దసరా సంధర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
//అనంతరం ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ విజయానికి ప్రతీకగా ఈ దసరా నిర్వహించడం జరుగుతుందన్నారు...
//ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన పై విజయం సాధించి ప్రజలను రక్షించాలని...
//ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నాను అని తెలిపారు
తూర్పుగోదావరి...
//రోడ్డు ప్రమాదంలో హోమ్ గార్డ్ మృతి...*
//కొత్తపేట మండలం గంటి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అమలాపురంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నెల్లి బాల సుబ్రహ్మణ్యం(36) మృతి...సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.....
వరంగల్ అర్బన్...
//వరంగల్ చరిత్రాత్మక భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెప్పోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
//ముందుగా ఆలయంలో అమ్మవారికి పూజాదికాలు నిర్వహించిన మంత్రి
//పూజలు చేసి, తెప్పోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
తూర్పుగోదావరి జిల్లా..
//విజయదశమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి సీతపల్లి వాగులో దిగిన స్థానిక సాయినగర్‌కు చెందిన పసల సూర్యప్రభాస్కర రావు దుర్మరణం
//వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయిన సూర్యభాస్కర రావు
//కిలోమీటర్ దూరంలో ఉన్న రాళ్ల మధ్య చిక్కుకున్న సూర్యభాస్కర రావు మృతదేహాం
//మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
కరీంనగర్ జిల్లా...
//లేజర్ షో,క్రాకర్ షో ,రావణాసుర వధా
//హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమాలాకర్.
నెల్లూరు:--
- బెంగుళూరు నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ఆర్టీసీ డ్రైవర్ కృష్ణను అరెస్టు చేసిన సెబ్ అధికారులు..
- అతని వద్ద నుంచి 30వేలు విలువ చేసే 22 పుల్ మద్యం బాటిల్స్ సీజ్..
- గత కొంతకాలంగా బెంగుళూరు నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చి కోవూరు పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్న డ్రైవర్ కృష్ణ..
- పక్కసమాచారం తో మాటు వేసి పట్టుకున్న వన్ టౌన్ ఇన్చార్జి సెబ్ సీఐ అశోక్, ఎస్ ఐ రవీంద్ర
//అంబర్ పేట లోని మహంకాళి ఆలయం ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం..
//ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,
//పార్టీలకు అతీతంగా విచ్చేసిన నేతలు
//హాజరైన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు
//గత 30 సంవత్సరలుగా కార్యక్రమం..
//చేడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రవణ దహన కార్యక్రమం..
//ప్రతి ఏడాది అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకకు కరోన ఎఫెక్ట్
//కరోన నేపథ్యంలో ఆలయ ఆధ్వర్యంలో ని కొద్దీ మందితో పాటు , సందర్శలకు అనుమతి
//అంబర్ పెట్ మునిసిపల్ గ్రౌండ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా రావణ దహ కార్యక్రమం.
//పాల్గొన్న మాజీ ఎంపీ వి.హన్మంత్ రావు , స్థానిక ఎమ్మెల్యే కాలే వెంకటేశర్లు
అమరావతి.....
//ఆర్కే.....మంగళగిరి ఎమ్మెల్యే
//ఈరోజు చేనికివెళ్ళా AP సీడ్స్ వద్ద కొన్న వరి వంగడాలలో...కేళీలు (బెరుకు విత్తనాలు)కనిపించాయి
//20 శాతం సుమారుగా పంట లో ఉన్నాయి..
//గుంటూరు JD అగ్రికల్చర్ వారితోమాట్లాడా...శాస్త్రవేత్తలు వచ్చారు
//రిపోర్టు ఇస్తామన్నారు...మంజీరా సీడ్ కంపెనీ, నంద్యాల వారి సరఫరా
//AP సీడ్స్ వారిపై....త్వరలో ప్రభుత్వానికి/ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా...
పెద్దపల్లి జిల్లా...
//ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో అనాదిగా వస్తున్న పూజ అడ్డుకున్న ఓ వర్గం ...
//పూజ చేసి తీరుతామని అంటున్న గ్రామస్తులు మరో వర్గం ...
//పోలీస్ ల భారీ బందోబస్తు మధ్య కాల్వ శ్రీరాంపూర్ లో పండుగ ..
//ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం...
//స్వల్ప లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
విజయవాడ...
//హంస వాహనంపై సేద తీరుతున్న దేవత మూర్తులు
//హంస వాహనంపై వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు అందుకొనున్న దేవత మూర్తులు.
//కృష్ణా నధిపై తెప్పోత్సవం ఉత్సవ లేకపోవడంతో ఎక్కువ సమయం హంస వాహనంపై సేద తెరనున్న ఉత్సవ మూర్తులు.
//కోవిడ్ నేపథ్యంలో ఘాట్ వద్దకు భక్తులను అనుమతించని పోలీసులు.
//వరద ప్రవాహం ఉండటంతో హంస వాహనంపైకి పరిమిత సంఖ్యలోనే వీఐపీలకు అధికారులకు అనుమతి.