Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
-శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం
-2 క్రేస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటివిడుదల చేస్తున్న అధికారులు
-ఇన్ ఫ్లో : 1,48,508 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 1,23,586 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
-ప్రస్తుత : 885.00 అడుగులు
-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
-ప్రస్తుతం : 215.8070 టీఎంసీలు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
గుంటూరు.
- ఏటూకూరు కు చెందిన ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మీ హత్య కేసును ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులు
- మే 9న వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో ఉపాధ్యాయరాలు శ్రీలక్ష్మీ దారుణ హత్య.
- శ్రీలక్ష్మి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు
- నిందితులు బండ్లమూడి లక్ష్మి నారాయణ, గోడపాటి సతీష్, కోటపాటి గణేష్ లపై కేసు నమోదు
- నిందితుల వద్ద నుంచి ఒక గొలుసు, ఉంగరం స్వాధీనం చేసుకున్న పోలీసులు
- శ్రీలక్ష్మి పనిచేస్తున్న పాఠశాలలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న నిందితుడు లక్ష్మీనారాయణ
- వడ్డీ వ్యాపారం, అక్రమ సంబంధం నేపథ్యంలో చనువుగా ఉన్న శ్రీలక్ష్మీ
- మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం, వడ్డీ డబ్బులు అడుగుతుందని శ్రీలక్ష్మి ని హతమార్చిన లక్ష్మీనారాయణ.
- గతంలో కట్టుకున్న భార్యను సైతం హత్య చేసిన నిందితుడు లక్ష్మీ నారాయణ
- రెండు హత్యలు తానే చేసినట్లు విచారణ లో వెల్లడి
- గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి...
విజయవాడ
- భారతీ నగర్ కారు హత్యాయత్నం కేసు
- ఈ నెల 17న ముగ్గురు ను కారులో పెట్టి నిప్పు పెట్టిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి..
- ఈ ఘటనలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు..
- 8 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కృష్ణారెడ్డి..
చిత్తూరు
- ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి
- చిత్తూరు జిల్లా పాకాల లో కన్నుమూసిన సదానంద (సహజ మరణం)
- బాలసాహిత్యం లో విశేష కృషి చేసిన కలువకొలను సదానంద
- కేంద్రసాహిత్య అకాడమీ అందించే బాలసాహిత్య పురస్కార్ ను తన 'అడవితల్లి' నవలకి గానూ కైవసం చేసుకున్న సదానంద
- ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సాహిత్యకారుడు సదానంద
- 1939 ఫిబ్రవరి 22న చిత్తూరు జిల్లా పాకాల లో జన్మించిన కలువకొలను సదానంద
- 36ఏళ్ళ పాటు ఉపాధ్యాయుడిగా పని చేసి 19 97 లో పదవీ విరమణ
- బాలల కోసం 200కి పైగా కథలు, 100కి పైగా గేయాలు, 8కథా సంపుటాలు, 2నవలలు రచించిన సదానంద
అమరావతి
- పిల్లి మాణిక్యరావు టీడీపీ అధికార ప్రతినిధి
- మంత్రిపదవి, తాయిలాలకోసం నాని తనకులాన్ని తానే కించపరుచుకోవడమేంటి?
- జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గాలను, అరాచకాలను, అవినీతిని సమర్థించుకోవడానికి మంత్రులను వాడుకుంటున్నాడు.
- కొడాలి నాని అంటే ప్రజలెవరూ గుర్తించడం లేదు.
- బూతులమంత్రి, సన్నబియ్యం సన్నాసి మంత్రి, వాడెమ్మ మొగుడు మంత్రి అంటేనే గుర్తుపడుతున్నారు.
- తనశాఖను ఎవరో నిర్వహిస్తుంటే, నోటికి పనిచెప్పి బతకడం నానికి అలవాటైంది.
- ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఎస్పీవై ఆగ్రోస్ పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు, రాంకీ సెజ్ లో దుర్ఘటనప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
- స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో మాత్రం తప్పంతా రమేశ్ ఆసుపత్రిదే అన్నట్లు కొడాలి మాట్లాడటమేంటి?
- రాజధాని గురించి మాట్లాడేహక్కు దళితులకు లేదనడం కంటే అట్రాసిటీ ఏముంటుంది?
- పార్టీ మారిన ప్రతిసారి మాట మార్చడం డొక్కాకు అలవాటు
జాతీయం
- మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (పిఎంఎల్‌ఎ) కింద 12 మంది నిందితులయిన హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాదులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు .
జాతీయం
- సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలకు సన్నాహకాలు
- నిబంధనల ప్రకారం వచ్చే నెల 23 లోపు తప్పనిసరిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉండడంతో కసరత్తు
- ఉభయసభల అధికారులతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ల వరస సమావేశాలు
అమరావతి...
- సజ్జల రామకృష్ణ రెడ్డి.... ప్రభుత్వ సలహాదారు
- చంద్రబాబుగారూఎన్నికలు జరిగి 14నెలలు కూడా ముగియలేదు.
- మీరు గెలిచిన ఆ 23 చోట్లకూడా మీపేరు చెప్తే భగ్గుమంటున్నారు.
- అలాంటి మీరు అమరావతి పేరుమీద దొంగపోల్స్ పెడుతున్నారు.
- రాజకీయంగా చివరిదశలో ఉన్నమీరు ఇప్పటికైనా కళ్లు తెరవండి.
- ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయండి.
- కుళ్లు, కుతంత్రాలు విడిచిపెట్టండి.
- విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్ని చిమ్మకండి. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి.
అమరావతి:
- మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో ముగిసిన వాదనలు.
- తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.
- వచ్చే శుక్రవారం తీర్పు వెల్లడించనున్న కోర్టు.
శ్రీకాకుళం జిల్లా..
- శ్రీకాకుళంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం..
- పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం..