Nizamabad updates: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పెర్కిట్ nh 44 హైవేను నిర్బంధించిన రైతులు..
నిజామాబాద్ జిల్లా:
-కిషన్ మోర్చా ఆధ్వర్యంలో హైవేపై ధర్నా నిర్వహించారు
-ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని హైవేపై ధర్నా చేపట్టారు..
-హైవేపై ఎక్కడ ఎక్కడ వాహనాలు నిలిపే నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది...
Hyderabad updates: ఖైరతాబాద్ కుశాల్ టవర్స్ వద్ద తెలంగాణ స్టేట్ ప్రైవేటు రవాణా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా.....
హైదరాబాద్..
-కరోనాతో జీవనం కొనసాగించడమే కష్టంగా మారిన నేపథ్యంలో ఫైనాన్సు చెల్లించాలంటూ ఫైనాన్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల ధర్నా ..
-కరోన సమయంలో బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టాలి అని ఎవరిని బలవంతం చేయవద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫైనాన్స్ వ్యాపారులు తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం ..
-ఫైనాన్సర్ వేధింపులతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదిమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారూ..
-సీజింగ్ పేరుతో 5000 రూపాయలు వసూలు చేయడాన్ని నిలిపివేయాలని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రోడ్లపై వాహనాలు ఆపి డ్రైవర్ను వేధించే వారిపై చర్యలు తీసుకోవాలని, covid 19 దృష్ట్యా ఒక సంవత్సరం పాటు పోలీస్ జలాలను విధించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ ..
-ధర్నా నిర్వహిస్తున్నడ్రైవర్లను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు...
Nampally ACB updates: వైద్య పరీక్షల కోసం ఏసీపీ నర్సింహ్మారెడ్డిని ఆస్పత్రికి తరలించిన ఏసిబి అధికారులు..
నాంపల్లి..
-నాంపల్లి ఏసిబి కార్యాలయం నుంచి వైద్య పరీక్షల కోసం కోఠి లోని ఆస్పత్రికి ఏసీపీ నర్సింహ్మారెడ్డిని తరలించిన ఏసిబి అధికారులు..
-కోవిడ్ పరీక్షల అనంతరం ఉస్మానియా లో వైద్య పరీక్షలు...
-అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్న ఏసిబి అధికారులు...
Karimnagar updates: గంగాధర మండల కేంద్రంలో ట్రాక్టర్లతో భారీ రోడ్ షో నిర్వహించిన రైతులు..
కరీంనగర్ జిల్లా...
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ.
-కేసీఆర్ పేరు నమూనా తో ట్రాక్టర్ల సెటప్
-రెవెన్యూ చట్టానికి ,సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ రైతుల ర్యాలీ.
-రైతుల తో కలిసి ట్రాక్టర్లు నడిపిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్.
-ట్రాక్టర్ల తో పెద్ద ఎత్తున గంగాధర చౌరస్తా కు తరలివచ్చిన చొప్పదండి రైతులు.
Sangareddy updates: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ను పట్టుకున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది..
సంగారెడ్డి జిల్లా..
-పఠాన్ చెరు లోని ముత్తంగి ORR టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను పట్టుకున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది.
-అర్ధరాత్రి వాహనాల తనిఖీలో 10 ఆటో ట్రాలీ లలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం .
-వాహనాలతో పాటు 10 మందిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టిన పఠాన్ చెరు పోలీసులు.
Nizamabad updates: బాల్కొండ నియోజకవర్గం లో రైతుల కృతజ్ఞత ర్యాలీ..
నిజామాబాద్ :
- 'నూతన రెవెన్యూ చట్టం' బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా 500 ట్రాక్టర్ల తో రైతుల భారీ ర్యాలీ.
- మోర్తాడ్ నుంచి వేల్పూర్ X రోడ్ వరకు కొనసాగిన ర్యాలీ.
- వేల్పూర్ X రోడ్ మార్కెట్ యార్డ్ వద్ద సీఎం కేసీఆర్ , మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం.
High Court of Telangana: భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం లో జరిగిన ఎన్ కౌంటర్ పై హైకోర్టు లో లంచ్ మోషన్ పిటీషన్..
టీఎస్ హైకోర్టు.....
-లంచ్ మోషన్ పిటిషన్ ధాఖలు చేసిన పౌర హక్కుల సంగం...
-లంచ్ మోషన్ విచారణ కు అనుమతి ఇచ్చిన హైకోర్టు..
-మద్యాంహ్నం 2.30 విచారణ చేపట్టనున్న హైకోర్టు.
ACB updates: నర్సాపూర్ 112 ఎకరాల కేసులో నోరు మెదపని అడిషనల్ కలెక్టర్ నగేష్...
-3 రోజుల కస్టడీ లో ఏసీబీ ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు..
-బాధితుడి నుండి తీసుకున్న 40 లక్షల రూపాయలు ఎక్కడ దాచరనే ప్రశ్నకు సమాధానం ఇవ్వని నగేష్
-బాధితుడి నుండి డబ్బు తీసుకున్న రోజు నగేష్ ఎవరెవరితో మాట్లాడారు అనే అంశం పై నగేష్ సీడీఅర్ పరిశీలిస్తున్న ఏసీబీ
-నగేష్ బినామీ జీవన్ గౌడ్ తో గతంలో అడిషనల్ కలెక్టర్ జరిపిన లావా దేవిల పైనా పొంతన లేని సమాధానాలు
-నేడు మెదక్ జిల్లా రిటైర్డ్ ఉన్నతాధికారి ఏసీబీ విచారణకు హాజరు అయ్యే అవకాశం
-ఆర్డీవో అరుణా, తహశీల్దార్ సత్తార్ ల పాత్ర పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏసీబీ
-ఇప్పటి వరకు లభ్యం కానీ 40 లక్షల లంచం డబ్బు..
-జూనియర్ అసిస్టెంట్ వాసిం తో అడిషనల్ కలెక్టర్ జరిపిన లావాదేవీల పైనా ఏసీబీ ఆరా..
-నేడు చివరి రోజు కస్టడీ లో భాగంగా నిందితుల నుండి పూర్తి సమాచరం రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నం....
ACB updates: నర్సింహారెడ్డి భినమిలా పై కూపీ లాగుతున్న ఏసీబీ...
ఏసీబీ అప్ డేట్స్....
-నాంపల్లి ఏసీబీ ప్రధాన కార్యాలయం లో ఏసీపీ నర్సింహారెడ్డి ని విచారిస్తున్న ఏసీబీ అధికారులు...
-నర్సింహారెడ్డి ఆస్తుల చిట్టా ఇప్పుతున్న ఏసీబీ అధికారులు..
-నర్సింహారెడ్డి భినమిలా ఇండ్ల లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు...
-నర్సింహారెడ్డి భినమిలు కూడా పోలీసులే...
-ప్రస్తుతం భినమికు, బంధువుల ఇండ్ల లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు...
-నేడు బ్యాంకు లాకర్ల ను ఓపెన్ చేయనున్న ఏసీబీ..
-ఎస్ బి ఐ, ఆంధ్ర బ్యాంక్ లాకర్ల కు గుర్తించిన ఏసీబీ..
-రియల్ ఎస్టేట్ వ్యాపారం లి భారీగా పెట్టుబడులు పెట్టిన నర్సింహారెడ్డి..
-నేడు వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు....
Komaram Bheem district updates: కుమ్రంబీమ్ జిల్లాలో కోనసాగుతున్న కూంబింగ్..
కుమ్రంబీమ్ జిల్లా..
-మావోయిస్టు నాయకుడు బాస్కర్, వర్గీస్, రాము, అనిత ల కోసం అడవుల జల్లేడ పడుతున్న గ్రే హౌండ్స్ దళాలు..
-దహేగామ్, బెజ్జూర్, పెంచిల్ పెట, కాజగ్ నగర్, సిర్పూర్ మండలాల్లో పోలీసు దళాల కూంబింగ్
-బారీ బలగాలతో మావోల కోసం అణుఅణువు గాలిస్తున్నా పోలీసులు..
-అందోళన చెందుతున్న గిరిజనులు..