CMRF Scam Case updates: సియం ఆర్ ఎఫ్ కేసు సీఐడి నుండి ఏసిబి కు బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
అమరావతి..
సియం ఆర్ ఎఫ్ స్కాం కేసు అప్ డేట్..
-వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో సియం ఆర్ ఎఫ్ చెక్కులు పోర్జరీ చేసినట్లు గుర్తించిన ఏసిబి అధికారులు.
-ప్రొద్దుటూరు లో సియం ఆర్ ఎఫ్ చెక్కులు పోర్జరీ చేసిన ముగ్గురు పై కేసు నమోదు చేసిన అధికారులు.
-ఏపి సచివాలయం లో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన అధికారులు.
-సియం ఆర్ ఎఫ్ కేసును మరింత లోతుగా విచారిస్తున్న ఏసిబి అధికారులు.
Kadapa District updates: గండికొట జలాశయానికి కొనసాగుతున్న కృష్ణా జలాల ప్రవాహాం...
కడప :
-జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 7100 క్యూసెక్కులు వచ్చి చేరుతున్న ప్రవాహాం...
-మైలవరం ప్రాజెక్టుకు నీటి విడుదల నిలిపివేసిన అధికారులు...
-జిఎస్ఎస్ఎస్ కాలువకు 400, గండికొట లిప్ట్ 990, చిత్రవతి ఎత్తిపొతల ద్వారా 1100 క్యూసెక్కులు విడుదల...
-గండికొటలొ 14.50 టిఎంసీలకు చేరిన నీటి నిల్వ...
-తాళ్లపొద్దుటూరు గ్రామంలొ మరింతగా పెరిగిన నీరు...
-నేడు కూడా కొనసాగనున్న నిర్వాసితుల ఆందోళన..
Amaravati updates: సీఎం జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు...
అమరావతి..
10 గంటలకు తిరుమల నుండి నేరుగా హైదరాబాద్ వెళ్తున్న సీఎం.
రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకి సీఎం జగన్
అక్కడి నుండి నేరుగా 11:20కి హైదరాబాద్ లోని కంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సతీమణి భారతి రెడ్డి తండ్రిని ఆసుపత్రిలో పరామర్శించనున్న సీఎం.
తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో 1:20కి గన్నవరం రానున్న సీఎం..
Kurnool Updates: మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సిఐడి నోటీసులు
కర్నూలు:
- ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ క్వారంటైన్ సెంటర్ కు వెళ్లి కరోన వ్యాప్తి చేసారని సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేసిన భూమా అఖిల
- మే నెలలో ఎమ్మెల్ హఫీజ్ ఖాన్ పై ఆరోపణలు చేసిన భూమా అఖిల...
- అఖిల ప్రియ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ లను ఆశ్రయించిన హఫీజ్ ఖాన్
- ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ లు జారీ చేసిన సిఐడి
Annavaram: అన్నవరం దేవస్థానంలో భద్రత ఏర్పాట్లుపై భద్రత రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ ఆధ్వర్యంలో నేడు పరిశీలన
తూర్పుగోదావరి
- ఆలయంలో ప్రస్తుతం రక్షణ ఏర్పాట్లు, లోపాలు, అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలించనున్న ఇంటెలిజెన్స్ భద్రతా విభాగం అడిషినల్ ఎస్పీ అరుణ్‌బోస్
- దేవస్థానంలోని భద్రత విభాగం, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ప్రత్యేక భద్రత దళం అధికారులు, సిబ్బందితో భద్రతపై సమీక్షించనున్న అడిషనల్ ఎస్పీ అరుణ్ బోస్
Gujarat Updates: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం .
జాతీయం
- రాష్ట్రంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున ప్రమాదం .
- ప్రాథమిక సమాచారం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడు .
- భారీ ఎత్తున చెలరేగిన మంటలు. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు వెల్లడి.
- ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం
Chittoor Updates: చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగు దాటిలో మహిళ మృతి
చిత్తూర్:
- వేరుశనగపంటకు కాపలాగా ఉన్న తండ్రీ కూతురిపై ఒంటరి ఏనుగు దాడి.
- కూతురు సోనియా అక్కడికక్కడే మృతి.
- ఏనుగు దాడి నుండి తప్పించుకున్న తండ్రి మురుగన్
- సోనియా ఇంటర్మీడియట్ ద్వితియ సంవత్సరం చదువుతోంది.
- సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది
Eastgodavari Updates: మెట్టప్రాంతంలో ఏలేరు ఆయకట్టులో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
తూర్పుగోదావరి
- ఏలేరు జలాశయం రిజర్వాయరు నుంచి పది వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నాం-
- ఇన్ ఫ్లో 10వేల క్యూసెక్కులుగా వుంది
- ఏలేరు రిజర్వాయరు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.96 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది
- మళ్ళీ భారీవర్షాలు హెచ్చరికలు వున్నాయి.. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తం-గా వుండాలి
- ఏలేరు ఇఇ నరసింహారాజు
- ఈనెల 12 నుంచి ఏలేరు వరద మిగుల జలాల విడుదలతో అతలాకుతలమైన ఏలేరు ఆయకట్టు
- ఏలేరు ఆయకట్టు 57 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాల పంటపొలాలలో ముంపు
- కిర్లంపూడి, సామర్లకోట, గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లోని పలుగ్రామాలలో ఏలేరు వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు
Anantapur Updates: కుడేరు లో మీసేవ నిర్వాహకుడు వేణు ను అరెస్ట్ చేసిన పోలీసులు.
అనంతపురం:
- ప్రభుత్వ సంక్షేమ ఫలాల పొందడానికి ఆధార్ లో వివరాల నమోదికు రూ 2, 3 వేలు వరకు నగదు తీసుకుంటూ న్న వేణు.
- ఆధార్ కార్డులో తప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు
- 50 మందికి పైగా ఆధార్లో వయసు తారుమారు చేశారని విచారణలో వెల్లడి.
East Godavari Updates: మేరీమాత, ఏసుక్రీస్తు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం
తూర్పుగోదావరి
- మండపేటలోని పురాతన ఆర్సీఎం చర్చి గేటు వద్ద ఉన్న మేరీమాత, ఏసుక్రీస్తు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై కొనసాగుతున్న విచారణ
- ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహనరావు మండపేటలో మకాం వేసి దర్యాప్తు వేగవంతం.
- మండపేటలో సెక్షన్ 30 యాక్టు అమలు చేస్తున్న పోలీసులు
- ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్తవి ప్రతిష్టించిన చర్చి పాస్టర్లు
- తమకు ఎవరిపైనా అనుమానం లేదనీ.. ఎటువంటి ఆందోళన చేపట్టబోం - చర్చి పాస్టర్ రత్నాకర్