Weather Updates: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
విశాఖ
- వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో నేడు బలహీనపడే అవకాశం
- దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో తిరిగి ఈశాన్య దిశలో పయనించే అవకాశం
- దీని ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం .
- గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో 4, అనకాపల్లి, భీమిలి, పోలవరంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.
Dhowleswaram Barrage: గోదావరిలో క్రమేణా పెరుగుతున్న వరద ఇన్ ఫ్లో
తూర్పుగోదావరి
- ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 3లక్షల 81 లక్షల క్యూసెక్కులు వరద సముద్రంలోకి విడుదల
- ప్రస్తుతం ధవలేశ్వరం వద్ద 10.40 అడుగుల నీటీమట్టం
Rajahmundry Updates: పద్మావతి ఘాట్ వద్ద గోదావరిలో విహారయాత్రకు పాంటూన్ బోటుకు అనుమతి
తూర్పుగోదావరి:
- ప్రస్తుతం దిండి రిసార్ట్స్‌లో రెండు, కాకినాడలో ఒక్కో పాంటూన్ బోటుకు అనుమతి
- పాపికొండలు విహార యాత్రకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు
- ఏపీ పర్యాటక డివిజనల్ మేనేజర్ తోట శ్రీవీర నారాయణ
Vijayawada Updates: ఇంద్రకీలాద్రిపై లోకాకళ్యాణార్ధం నిర్వహిస్తున్న చండి యాగం నేటితో పూర్తి కానుంది.
విజయవాడ
- మధ్యాహ్నం 12గంటలకు పూర్ణాహుతితో యాగం పూర్తి.
- ఇంద్రకీలాద్రిపై ఉన్న శివాలయంకి నేటి నుంచి భక్తులకు అనుమతి
- గత 6నెలలుగా అభివృద్ధి పనుల్లో భాగంగా భక్తులకు శివాలయం అనుమతి రద్దు చేసిన అధికారులు
- సుమారు 13 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు..
- దసరా నాటికి పూర్తి స్థాయిలో భక్తులకు అనుమతి.
Amaravati Updates: నేడు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ల ముందు ఆందోళన
అమరావతి
- మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన బీజేపీ
- విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణుల ఆందోళన
Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
కర్నూలు జిల్లా:
- 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో : 2,10,420 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 2,60,809 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
- ప్రస్తుతం : 884.20 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
- ప్రస్తుతం: 210.9946 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి