Visakha updates: జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతి నేను ఆధారాలతో బయటపెట్టాను: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..
విశాఖ..
-కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు కారు విషయం పై ఏసీబీ కి వినతిపత్రం అందించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ,ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు..
-కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతి పై నేను ఆధారాలతో బయటపెట్టాను.
-ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలి.
-రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమయ్యారు.
-అవినీతి పై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు.
-ఇదివరకే నేను కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసాను ...ఇంతవరకు స్పందన లేదు.
-ఈ ఎస్ ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తో మంత్రి తనయుడు ఫోటో ఎందుకు దిగారు.
-ఈ ఎస్ ఐ కేసులో మంత్రి అవినీతి చేసారని ఆధారాలు చూపించిన ఎందుకు స్పందించడం లేదు.
Kakinada updates: జిల్లా కలెక్టరేట్ వద్ద బిజేపి శ్రేణుల ఆందోళన..
తూర్పుగోదావరి :
-కాకినాడలో జిల్లా కలెక్టరేట్ వద్ద బిజేపి శ్రేణుల ఆందోళన..
-ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్ లపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసన..
-మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్..
East Godavari updates: అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద బి.జె.పి. నాయకుల ఆందోళన..
తూర్పు గోదావరి జిల్లా..
అమలాపురం..
-మంత్రి కొడాలి నాని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండు చేసిన బిజెపి
-సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశికి వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు మానేపల్లి అయ్యాజీ వేమ, యాళ్ల దొరబాబు
Rajahmundry updates: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతల ఆందోళన..
తూర్పుగోదావరి - రాజమండ్రి..
-మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా రాజమండ్రి- సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన..
-హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మంత్రి అనుచిత వ్యాఖ్యలు
-వెంటనే మంత్రి నాని ని బర్తరఫ్ చేయాలని నినాదాలు
-ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు రేలంగి శ్రీదేవి, బిజేపీ నాయకులు బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ తదితరులు
National updates: అనురాగ్ ఠాకూర్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..
జాతీయం..
-కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి చర్చ
Srikakulam updates: కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
శ్రీకాకుళం జిల్లా..
-కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన..
-హిందువులు మనోభావాలు దెబ్బతినేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధర్నా..
-ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు..
Vijayawada updates: కొడాలి నానిని బర్తరఫ్ చేయాలంటూ బిజెపి రాష్ట్రవ్యాప్త నిరసనలు..విష్ణువర్ధన్ రెడ్డి..
విజయవాడ..
-విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
-ఉద్దేశపూర్వకంగా కొడాలి నాని, ఎమ్మెల్యే రోజాలు ప్రధానమంత్రి, యూపీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు...
-సీఎం కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలి...
-రాష్ట్రంలోని బోగులకు యోగుల గురించి ఏమి తెలుసు
-కొడాలి నాని వెంటనే క్షమాపణలు చెప్పుకుంటే గుడివాడలో మా సత్తా సతచూపుతాం
-పోలీస్ లను అడ్డంపెట్టుకుని పాలన చేయాలనుకుంటే ప్రజాగ్రహం తప్పదు..
East Godavari updates: మండపేట లో చర్చిలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనను ఖండిస్తూ క్రైస్తవులు ముస్లిం హిందువులు ఐక్యంగా శాంతి ప్రదర్శన..
తూర్పుగోదావరి..
-చర్చిలో విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు
-ప్రదర్శన లో పాల్గొన్న బిజేపీ మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ కోన సత్యనారాయణ మైనారిటీ నాయకులు
-ఎండి అల్తాఫ్, దూల జయరాజు, ఎండి కరీం
-చర్చిలో ప్రతిష్టించిన విగ్రహాలను వీడియోలు తీయకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
Amaravati updates: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్ ను ప్రారంభించిన ఐ&పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి..
అమరావతి..
విజయ్ కుమార్ రెడ్డి..
-మీడియా కార్యక్రమాలు నిర్వహణలో పాత్రికేయుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మీడియా పాయింట్ ఏర్పాటు చేసాం.
-ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం పంపేదుకు సులభంగా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసాము.
-అధునాతనమైనా వసతులను మీడియా పాయింట్ వద్ద పాత్రికేయుల కోసం ఏర్పాటు చేస్తున్నాం.
-సమర్థవంతంగా విధులు నిర్వర్తించి సమాచారం చేరవేసే క్రమంలో మీ సమస్యలను పరిష్కరించాలని కార్యాలయం ఏర్పాటు చేసాము..
East Godavari updates: దాడుల నుంచి దేవాలయాలను దేవుళ్లే కాపాడుకోవాలని నిరసన..చినరాజప్ప...
తూర్పుగోదావరి :
చినరాజప్ప కామెంట్స్..
-పెద్దాపురం మరీడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దాపురం శానససభ్యుడు చినరాజప్ప. పార్టీ అధీష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవలయంలో పూజలు నిర్వహించాము..
-సిఎం జగన్ నిన్న తిరుపతిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు..
-జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయలు పాటించకుండా మంత్రులతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు..
-హిందూ దేవాలయం మీద దాడులు చేసిన వారిని పటుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది..
-చంద్రబాబును తిట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే పనిలేదు..
-నిత్యావసర వస్తువులు ధరలు దారుణంగా పెరగాయి..
-పెట్రోలు డీజిల్ గ్యాస్ విపరీతంగా పెరిగాయి.. ఉల్లిపాయిలు కిలో రూ. 50 కి చేరింది..
-కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది.. సామాన్యులకు వైద్యం అంద…