Amaravati updates: వివిధ జిల్లాల్లోని పలువురు తహాసీల్దార్లు, డిప్యూటీ తహాసీల్దార్లకు అందని జీతాలు..
అమరావతి..
-వివిధ జిల్లాల్లో తహాసీల్దార్లను రీ-షఫ్లింగ్ చేసిన కలెక్టర్లు.
-సాంకేతిక ఇబ్బందితో సుమారు వంద మందికి పైగా తహాసీల్దార్లు, డెప్యూటీ తహాసీల్దార్లకు ఇప్పటివరకూ అందని జీతాలు.
-జీతాలు అందని తహాసీల్దార్లకు వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని డెప్యూటీ సీఎం ధర్మానకు వినతి పత్రం సమర్పించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్.
అవసరమైతే కలెక్టర్లకు జీతాలు ఆపాలని.. తాసీల్దార్లకు మాత్రం జీతాలు ఆపొద్దని రెవిన్యూ సంఘాల వినతి.
National updates: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు , సహకారాన్ని కోరాం: బుగ్గన రాజేంద్రనాథ్!
జాతీయం..
-రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి, సహాయ మంత్రితో చర్చించాం
-పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రానికి నిధులు విడుదల వేగవంతం చేయాలని కోరాం
-ఏపీ విభజన చట్టంలోని అంశాలు, రామాయణం పోర్టు, పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక హోదా అంశాలను కేంద్ర ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్లాం
-జీఎస్టీ బకాయిల అంశంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆప్షన్లపై చర్చించాల్సి ఉంది.
-పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 760 కోట్ల రూపాయల బిల్లుల పున పరిశీలన చేయాలని చెప్పారు.---బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి
Amaravati updates: రైతులు కష్టాలు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు, మంత్రి..
-అమరావతి..
-ఆయిల్ పామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ. 80 కోట్లు కేటాయించాం.
-పెదవేగి ఫ్యాక్టరీకి తరలించే ఆయిల్ పాం రైతులకు ఈ ధరల చెల్లింపు.
-వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ది చేకూర్చేందుకు నిర్ణయం.
-వ్యవసాయ.. వ్యవసాయ అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోకి తెస్తాం.
-ప్రభుత్వమే సొంతంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆలోచన.
-రథం దగ్దమైతే చంద్రబాబు ఆనంద తాండవం చేస్తున్నారు.
-భక్తి శ్రద్ధలతో జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.
-గతంలో కులాలను అడ్డం పెట్టి రాజకీయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
-సీఎం జగన్ ఢిల్లీ టూర్ విషయమై టీడీపీ అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
-తానింకా ప్రభుత్వాన్నే నడుపుతున్నానని చంద్రబాబు భావిస్తున్నారు - కన్నబాబు, మంత్రి..
National updates: కేంద్ర మంత్రి సురేష్ అంగాడి మృతికి సంతాపం చెబుతున్నాం: రామ్మోహన్ నాయుడు!
జాతీయం..
-రాష్ట్ర సమస్యల కోసం మేము ఉభయసభల్లో పోరాడాం
-వ్యక్తిగత ఎజెండా మాత్రమే వైకాపా ఎంపీలు అమలు చేశారు
-జగన్ పై కేసులున్నాయ్. గెలిస్తే తన అధికారాన్ని కేసుల కోసం దుర్వినియోగం చేస్తారని ముందే చెప్పాము
-కానీ యువత ప్రత్యేక హోదా సహా ఏవేవో సాధిస్తామని చెప్పి జనాన్ని నమ్మించి గెలుపొందారు
-సీబీఐ కేసులు, న్యాయవ్యవస్థ అని మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అంశాల గురించి మాట్లాడలేదు
-అమిత్ షాతో సీఎం జగన్ భేటీ రహస్య మంతనాల తరహాలో జరిగింది
-రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. గతంలో ఎప్పుడూ మతకలహాలు చూసారా?
-ఎప్పుడూ లేని మతపరమైన దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి?
-ఒక మతం మీద ఇంతగా దాడులు జరుగుతుంటే ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారు? - రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ
National updates: ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర సమస్యలపై సభలో మాట్లాడాం..కనకమేడల రవీంద్రకుమార్!
జాతీయం..
-ఆంగ్ల మాధ్యమం నిర్బంధం చేయడం తగదని చెప్పాము
-ఏపీకి 3 రాజధానులతో రాజకీయ క్రీడకు తెరతీసి, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు
-25 బిల్లుల్లో దాదాపు అన్నింటిలో పాల్గొన్నాం
-కోవిడ్ మీద చర్చలో విజయసాయిరెడ్డి సందర్భరహిత వ్యాఖ్యలను అడ్డుకున్నాం
-న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు
-చంద్రబాబు మీద కేసులు ఎలా పెట్టాలన్నదే వైకాపాకు కావాలి తప్ప రాష్ట్ర సమస్యలు కాదు
-ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించి రాజధాని భూములపై సీబీఐ విచారణ అంటున్నారు
-టీటీడీని దుర్వినియోగం చేసే ప్రయత్నాలను బహిర్గతం చేసాము - కనకమేడల రవీంద్రకుమార్, టీడీపీ ఎంపీ
Visakha updates: కొడాలి నాని జగన్ మత్తులో వున్నారు: విష్ణుకుమార్ రాజు..
విశాఖ:
-జగన్ మెప్పుపొందేందుకు కొడాలి నాని
-ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు...
-ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాధ్ లపై అనుచితంగా మాట్లాడ్డం దారుణం...
-ఈ వ్యాఖ్యలకు బాధ్యత ప్రభుత్వం వహించాలి...
-కొడాలి నాని వేరొక మతం పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే జగన్ ఊరుకునేవారా - బి.జె.పి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు...
Nellore updates:వైద్యశాల నుంచి పోలీసుల కళ్లు గప్పి పరారైన బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు హరీష్ రెడ్డి అరెస్ట్.
నెల్లూరు..
-- నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నుంచి పోలీసుల కళ్లు గప్పి పరారైన బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు హరీష్ రెడ్డి అరెస్ట్.
-- రిమాండ్ నిందితుడిగా ఉంటూ వైద్యం కోసం వచ్చి 5 రోజుల క్రితం జిజిహెచ్ నుంచి పరారైన హరీష్ రెడ్డి.
-- కోవూరు సమీపంలో ఓ కారును తీసుకొని డ్రైవర్ ను పక్కకు నెట్టేసి కారు తో కూడా ఇచ్చిన హరీష్ రెడ్డి.
-- కారుకి ఫాస్ట్ ట్యాగ్ ద్వారా గుర్తించి గాలింపు చేపట్టిన పోలీసులు.
-- తమను పోలీసులు ఎలాగైనా అరెస్టు చేస్తారని భావించి కోవూరు సమీపంలో కారు వదిలేసిన నిందితుడు హరీష్ రెడ్డి.
-- ప్రధాన నిందితుడి తో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేసిన కోవూరు పోలీసులు.
-- పరారీలో నిందితుడి అరెస్ట్ చేసిన కోవూరు పోలీసులకు రూరల్ డిఎస్పి హరినాథ్ రెడ్డి అభినందనలు.
Visakha updates: ఈ రాష్ట్రంలో హిందు మతం పట్ల నిరసన భావం ఉంది: శ్రీనివాసనంద స్వామిజీ..
విశాఖ....
-మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు తిరుపతి పట్ల, హిందూత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు
-టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పై వివాదం తీసుకొచ్చారు.
-సీఎం జగన్ రెండో సారి హిందువులకు పంగనామాలు పెట్టారు.
-మంచి చెప్పిన అధికారులు ఎల్ వి సుబ్రమణ్యం, జె వి ఎస్ ప్రసాద్ లను ప్రక్కకు పెట్టారు.
-హిందు మతాన్ని మంట కలపడానికి ఈప్రభుత్వం నడుముకట్టింది.
-మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు రాజీనామా చేసి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ చేసిన రాష్ట్ర సాధు పరిషత్.
-సీఎం జగన్ ..తాను హిందువునని ప్రకటించాలి లేదా వారి తరుపున శారదా పీఠాధిపతి చెప్పగలరా - రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ.
National updates: కరోనా సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను బాగా చేశారు: గల్లా జయదేవ్..
జాతీయం..
-తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు
-3 రాజధానులు చట్టం ప్రకారం సాధ్యం కాదు. పార్లమెంట్లో ఈ విషయం లేవనెత్తాము
-జీఎస్టీ, పోలవరం నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి అడిగాం
-ఇంగ్లీష్ మీడియం విద్య గురించి నిర్మాణాత్మక సూచనలు చేశాము
-దేవలయాలపై దాడులు, దళితులపై దాడుల గురించి మాట్లాడాము
-23 బిల్లులపై చర్చలో టీడీపీ పాల్గొని అభిప్రాయాలు చెప్పింది
-కరోనా అతి పెద్ద సంక్షోభం. దేశానికి చైనా సరిహద్దు వివాదంపై చర్చ జరగలేదు
-కోవిడ్ కారణంగా ఆరోగ్య సంక్షోభం, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించింది. అది మానవ జీవన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది
-ఆర్ధిక వ్యవహారాల్లో కీలక సలహాలు ఇచ్చాం. ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండేందుకు సూచనలు చేసాము
-ఖర్చులను ప్రాధాన్యత క్రమంలో చేయాలని సూచించాము-గల్లా జయదేవ్, టీడీపీపీ నేత
Andhra Pradesh High Court: విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు..
అమరావతి..
-ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని
-దీనిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు
-కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ
-ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
-తదుపరి విచారణ నవంబర్ 6కి వాయిదా