Live Updates: ఈరోజు (24 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 24 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | దశమి - 26:44:08 వరకు తదుపరి ఏకాదశి | పూర్వభాద్ర నక్షత్రం - 15:32:06 వరకు తరువాత ఉత్తరాభాద్ర | వర్జ్యం 07:11:07 నుండి 07:56:00 | అమృత ఘడియలు 11:40:27 నుండి 12:25:21 | దుర్ముహూర్తం08:40:54 నుండి 09:25:47 | రాహుకాలం 14:51:14 నుండి 16:15:24 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39
ఈరోజు తాజా వార్తలు
తిరుపతి...
- రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్
- బిశ్వభూషణ్ హరిచందన్ కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు.
గుంటూరు:
- రూ.లక్ష 50వేల నగదు..40లక్షల వోచర్ల అపహారణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమాని శ్రీనివాసరావు.
కృష్ణాజిల్లా:
- గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
- తిరుపతిలో రాష్ట్రపతి రంనాధ్ కొవింద్ కు స్వాగతం పలుకనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
కృష్ణాజిల్లా..
- బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వెనుక నుంచి ఢీకొట్టిన కారు. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
- మృతులు గూడూరు మండలం కలపటంకు చెందిన మద్దాల శ్రీను, పెనుగూడికి చెందిన ఎండి.ఇంతియాజ్ గా గుర్తింపు.
జాతీయం
- ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా
- ప్రజారోగ్యం కోసం పోరాడినవారికి తొలి ప్రాధాన్యం
- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది డాటా సేకరణ
- ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రకటించనున్న ప్రధాని మోదీ
- సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పౌల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రెజెంటేషన్
- జులై 2021 నాటికి 20-25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు
విశాఖ..
* మహిళా మృతి. 20 మందికి గాయాలు.
* క్షతగాత్రులు పెదబయలు మండలం గడుగుపల్లి గ్రామస్తులు.
* ఒరిస్సాలోని కిందిపడ దేవాలయానికి దర్శనానికి వెళుతుండగా ఘటన.
* రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
* భారీ భద్రత నడుమ సాగనున్న రాష్ట్రపతి పర్యటన
* ఉదయం 10.30 రేణిగుంట విమానాశ్రయం.
* 11.00 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం.
* మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహం.
* 01.05 గం. వరాహ స్వామి దర్శనం, అనంతరం శ్రీవారి దర్శనం.
* 01.55 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహం
* సా.4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి చెన్నై తిరుగు ప్రయాణం.
విశాఖ
- నేటి సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనున్నదని వాతావరణశాఖ అంచనా.
- పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతం.
- రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపాన తీరందాటుతుందని అంచనా
- నేటినుంచి మూడు రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఉత్తరాంధ్ర, తెలంగాణలకు ఓ మోస్తరునుంచి చెదురుమదురు వర్షాలు
- మత్స్యకారులు వేటకు పోరాదని ఆదేశాలు
తిరుమల సమాచారం
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 33,312 మంది భక్తులు.
* నిన్న తలనీలాలు సమర్పించిన 10,666 భక్తులు.
* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.61 కోట్లు.
నెల్లూరు...
-- ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఓ దుకాణం వద్దకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత ...
-- ఆటో సీజ్...ఇద్దరు వ్యక్తులు అరెస్టు.. కొనసాగుతున్న తనిఖీలు