Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-21 01:17 GMT
Live Updates - Page 3
2020-09-21 06:45 GMT

Srikakulam updates: రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

శ్రీకాకుళం జిల్లా..

-పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన చంద్రకళ అనే యువతి కుటుంబ సభ్యులు..

-నాలుగు నెలల క్రితం ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న యువతి..

-యువతి శ్రీకాకుళం పి.ఎన్. కాలనీకి చెందిన చంద్రకళ..

-తమ కూతురు చావుకు రవి కుమార్ అనే వ్యక్తి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు..

-రవికుమార్ ను పోలీసులకు అప్పగించిన చంద్రకళ కుటుంబ సభ్యులు..

-విచారణ కూడా చేయకుండా రవికుమార్ ను పోలీసులు వదిలేశారని చంద్రకళ కుటుంబ సభ్యులు ఆరోపణ..

-తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన యువతి కుటుంబ సభ్యులు..

-AITUC ఆధ్వర్యంలో ఆందోళన .. పోలీసులు రంగప్రవేశం..

-పోలీసులకు, సంఘ నాయకులకు మధ్య వాగ్వాదం..

-ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

2020-09-21 05:59 GMT

Kurnool updates: కార్మిక చట్టాలను పాత వాటినే అమలు చేయాలని సీపీఎం పార్టీ నిరసన..

కర్నూలు...

-సవరించిన కార్మిక చట్టాలను పునరుద్ధరించి.. పాత వాటినే అమలు చేయాలని సీపీఎం పార్టీ నిరసన..

-ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవలని డిమాండ్.

-కరోనా కష్టకాలం లో కరెంట్ చార్జీలు పెంపు కు నిరసనగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ధర్నా..

2020-09-21 05:55 GMT

Vizianagaram District updates: మహాకవి గురజాడ అప్పారావు 158వ జయంతి ఉత్సవాలు..

విజయనగరం..

-గురజాడ స్వగృహంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాలర్పించిన జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, గురజాడ వారసులు, సాహితీకారులు,

-పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు

2020-09-21 05:50 GMT

Kadapa District updates: కేంద్ర కారాగారం కేంద్రంగా రెండవ రోజు కోనసాగుతున్న వివేకా హత్య కేసుపై సిబిఐ విచారణ..

కడప :

-మరోమారు విచారణకు హాజరైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి భార్య, మరో మహిళ...

-నిన్న మహిళలిద్దరినీ ఆరు గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు..

-కీలక వ్యక్తులు, అనుమానితులను విచారించనున్న సీబీఐ బృందం..

-కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాక విచారణను వేగవంతం చేసిన సీబీఐ బృందం..

2020-09-21 04:27 GMT

High Court Of Andhra Pradesh: నేడు ధర్మాసనం ముందుకు రానున్న లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు..

అమరావతి:

-నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి,మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ

-పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై కేసులు వేసిన రాజధాని రైతులు

-సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపై కేసులు నమోదు

-రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైన, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడంపైన కేసులు వేసిన రైతులు

-రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ విధింపును ఛాలెంజ్ చేసిన రైతులు

-పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టం పై ఇప్పటికే స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు

-నేడు ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం..

2020-09-21 04:23 GMT

Amaravati updates: సిఎంఆర్ఎఫ్ నిధులు దారి మళ్లించే అంశంపై సీరియస్ గా ఉన్న జగన్ సర్కార్..

అమరావతి..

-సచివాలయంలో 117.15 కోట్ల సిఎమ్ఆర్ఎఫ్ కుంభకోణంపై నేడు విచారించనున్న పోలీసులు.

-ఫోర్జరీ చెక్కులు సృష్టించి నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసారని పిర్యాదు చేసిన రెవెన్యూ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ మురళి కృష్ణ.

-పారదర్శకంగా దర్యాప్తు చెసి దోషులను త్వరగా అదుపులోకి తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం జగన్

-తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఆధ్యర్యంలో నేడు సచివాలయంలో విచారణ..

2020-09-21 04:20 GMT

Dhavaleswaram updates: ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 9.10 అడుగుల నీటిమట్టం..

తూర్పుగోదావరి..

-సముద్రంలోకి 3లక్షల 34వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల

-భారీవర్షాలతో తూర్పు, మధ్య డెల్టాల పంట కాల్వలకు 2,000, 500 క్యూసెక్కులు సరఫరా.

-పశ్చిమ డెల్టాల కాల్వకు నీటిని నిలిపివేసిన అధికారులు..

2020-09-21 04:14 GMT

East Godhavari updates: జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్..

తూర్పుగోదావరి :

-85 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. తాజాగా 1,260 పాజిటివ్‌ కేసులు నమోదు..

-జిల్లాలో 86,507 కి చేరిన పాజిటివ్ కేసులు..

-ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్స్, హోం ఐసోలేషన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 73 వేల 831 మంది బాధితులు..

-12 వేల 191 పాజిటివ్ కేసులు.. నిన్న కరోనాతో 4 గురు మృతి 485 కి చేరిన కరోనా మరణాలు..

2020-09-21 04:10 GMT

Antervedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దర్శనాలు నేటి నుంచి పునః ప్రారంభం..

తూర్పుగోదావరి :

-రథం దగ్ధమైన ఘటన తరువాత ఆందోళనలు, నిరసనలు, పోలీస్‌ డ్యూటీలతో సుమారు 60 మందికి సోకిన కరోనా..

-కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో నిన్నటి వరకు స్వామివారి దర్శనాలు నిలిపివేసిన అధికారులు..

-ఈ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలకు అనుమతి..

2020-09-21 04:03 GMT

Rajahmundry updates: నేడు కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తో భేటీకానున్న రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు..

తూర్పుగోదావరి -రాజమండ్రి..

-కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ముద్రగడ ప్రకటించాక తొలిసారి ముద్రగడ తో కాపు రాష్ట్ర జేఎసీ సమావేశం

-కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదేనని, మౌనం వీడి ఉద్యమం ముందుకు తీసుకువెళ్ళాలని కోరనున్న కాపు జేఎసి నేతలు..

Tags:    

Similar News