Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
విజయవాడ..
-రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనికి బుద్ది రావాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుగారు నగరంలోని మాచవరం దాసాంజనేయ స్వామి వారికి వినతి పత్రం సమర్పించారు.
-అనుచిత వ్యాఖ్యల వలన హిందువుల మనో భావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని మాచవరం పోలీసు స్టేషన్ లో కొడాలి నాని పై కేసుల నమోదు చెయ్యాలని కోరుతూ ఫిర్యదు పత్రాన్ని సమర్పించారు.
గుంటూరు....
-మంత్రి కొడాలి నాని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
-గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజ్
-హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని ని అరెస్ట్ చేయాలని డిమాండ్
అమరావతి:
-మూడు రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో సీఐడీకి బదలాయించనున్న ప్రభుత్వం.
-ఉద్యోగుల పాత్రపైనా అంతర్గత విచారణ చేపట్టనున్న ఏసీబీ.
-సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారంపై సెక్రటేరీయేట్టులో తుళ్లూరు పోలీసుల విచారణ.
-రెవెన్యూ శాఖ అధికారులతోపాటు సచివాలయంలోని ఎస్బీఐ అధికారులనూ విచారించిన పోలీసులు.
-గతంలో సీఎంఆర్ఎఫ్ కోసం జారీ చేసిన చెక్కుల నకిలీ చేసినట్టు గుర్తింపు.
-నకిలీ చెక్కులను అదే నెంబరు తో, అదే సంతకం తో రూపొందించిన ఆగంతకులు
-మూడు కంపెనీల ఖాతాల పేరు పై చెక్కులను బ్యాంకుకు జమ
-నకిలీ చెక్కులతో గతంలో వేలు,లక్షల్లో ను నిధులు డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం
-సుమారు గంటన్నర పాటు సాగిన విచారణ.
అమరావతి..
సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్:
-23 సాయంత్రం 3.50 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న జగన్.
-రోడ్ మార్గం ద్వారా 5 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ కి సీఎం జగన్.
-సాయంత్రం 6.20 నిమిషాలకు శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న జగన్.
-24 ఉదయం 8.10 కి కర్ణాటక సీఎం యడ్యూరప్ప తో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.
జాతీయం..
గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి..
• “ప్రధాన మంత్రి ఆవాస్ (పట్టణ) యోజన” కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2016 నుంచి 2019 వరకు 10.50 లక్షల ఇళ్ళు మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
• రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రానికి కేటాయించిన 10.50 లక్షల ఇళ్ళలో 2.93 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు.
• మిగిలిన ఇళ్ళు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి.
• 2022 మార్చి నాటికి వీటి నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
నెల్లూరు..
-- తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి రాష్ట్రపతి రామనాథ కొవిద్ సంతాపం.
-- లేఖ ద్వారా సంతాప సందేశాన్ని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..
-- లేఖను దగ్గరుండి ఎంపీ కుటుంబ సభ్యులకు అందజేసిన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ...*
తూర్పుగోదావారి..
కాకినాడ.....
- పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్..
- మందుల సరఫరా కాంట్రాక్టు టెండరు విషయమై కార్తీక్‌ను బినామీగా పెట్టుకొని ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కాంట్రాక్టును కట్టబెట్టారు..
- అందుకు కృతజ్ఞతగా అతను మంత్రి కుమారుడికి బెంజి కారును బహుమతిగా ఇవ్వడం పక్కా ఆధారాలతో నిరూపితమైనది,
- ఆయన కుమారుడు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల..
- విజయవాడలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న కార్తీక్.. మంత్రి జయరామ్‌కు బినామీ.
- దీనిపై సీఎం జగన్ ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలి.
విజయనగరం ...
-పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు ఆళ్ల నాని,ధర్మాన కృష్ణ దాస్,పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు
-పార్వతీపురం ఐటిడిఎ పరిదిలో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ స్థలం పరిశీలించిన ఉప ముఖ్య మంత్రుల బృందం.
-పార్వతీపురం ఏరియా హాస్పిటల్ సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్,పాములు పుష్ప శ్రీవాణి ,మంత్రి సీదిరి అప్పలరాజు
-హాజరైన ఎమ్మెల్యే అలజంగి జోగారావు,బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు..
తూర్పు గోదావరి జిల్లా..
-హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న మంత్రి వ్యాఖ్యలపై నిరసన
-మంత్రిని అరెస్టు చేయాలని డిమాండ్.
విజయవాడ..
-పీసీసీ ఉపాధ్యక్షుడు, డా. గంగాదర్ పై సి.ఐ.డి. కేసు నమోదు చేసిన వ్యవహారం పై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి.
-ఈ వ్యవహారంలో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు
-భవిష్యత్ లో ఇటువంటి ఇబ్బందులు మరెవరికి కల్పించకూడదని ఆదేశించిన ఎన్.హెచ్.ఆర్.సి.