KCR Srisailam Tour: ఇవ్వాళ్టి ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన రద్దు
- శ్రీశైలంలో తెలంగాణ వైపునున్న ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై దిగ్భ్రాంతి
- ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించాలని అధికారులకు ఆదేశం
- వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది.
- అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు.
- ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.
- తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
- చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.
- ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
- ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
- దీంతో ఇవ్వాళ్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు.
కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
-కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
- మైనర్ బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన రోహన్ అనే యువకుడు
- స్థానిక నేత కుమారుడు రోహన్
- బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలిక తో పరిచయం పెంచుకున్న రోహన్
- బాలిక చేత బలవంతంగా మాత్రలు మింగించిన యువకుడు
- విషయం బయటికి చెబితే చంపేస్తానంటూ బాలిక కు బెదిరింపులు..
- ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్ లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు.
- ఈ నెల 12 న కుల్సుంపూరా లో కేస్ నమోదు చేసిన పోలీసులు
- పరారీలో లో రోహన్.
Jagadeesh Reddy: శ్రిశైలం పవర్ ప్రాజెక్ట్ ప్రమాదంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రకటన
- శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరం
- మొదటి యూనిట్లో ఫైర్ జరిగింది
- నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి
- పదిమంది బయటకు వచ్చారు
- లోపల తొమ్మిది మంది చిక్కు కున్నారు
- లోపల దట్టమైన పొగ ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది
- ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారు
-పొగ తో మూడు సార్లు లోపలికి వెళ్లి వెనక్కు వచ్చారు
- ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా సంఘటనా స్థలానికి వెళ్ళ లేకపోతున్నారు
- ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు
- సింగరేణి సిబ్బంది సహాయం కోరాం
- లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం
- జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు వారు సేఫ్ గానే ఉన్నారు
Bhadrachalam: భద్రాచలం పాల్వంచ మధ్య రాకపోకలు బంద్
భద్రాద్రి కొత్తగూడెం:
- భద్రాచలం పాల్వంచ మధ్య రాకపోకలు బంద్
- కిన్నెరసాని ప్రాజెక్టు కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో 12 గేట్లు ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
- వరద ప్రమాదం పొంచి ఉండడంతో నాగారం వద్ద కిన్నెరసాని బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు ...
Tali peru Peoject: ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తున్న తాలిపేరు ప్రాజెక్ట్..
భద్రాద్రి కొత్తగూడెం
- ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తున్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్.
- అర్ధరాత్రి భారీగా వరద నీరు రావడంతో 25 గేట్ల ద్వారా 2 లక్షల 617 క్యూసెక్కుల వరద గోదావరి లోకి విడుదల
- ఉదయానికి వరద తగ్గుముఖం పట్టడంతో 25 గేట్లద్వారా 1 లక్షా 67 వేల 784 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల
- ప్రాజెక్ట్ వద్ద 259.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
Bhadrachlam: భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి
భద్రాచలం:
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి
- 54 అడుగులకు నీటిమట్టం చెరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
- సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించిన కలెక్టర్
కామారెడ్డి:
- డైలీ మార్కెట్ రోడ్డు లో ఆటో పక్కకు తీయమని నందుకు శివం క్లాస్ స్టోరీ యజమాని పొలసా వెంకట పై 50 మంది ఆటో డ్రైవర్ ల దాడి కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు యజమాని వెంకట్ కు తీవ్ర గాయాలు
- దాడి కి నిరసనగా నేడు పట్టణంలో బట్టల దుకాణాలు మూసి వేస్తున్నట్లు అసోసియేషన్ పతినిదులు ప్రకటన
Mulugu District: రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి కొనసాగుతున్న వరద ఉధృతి
ములుగు జిల్లా:
- ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి కొనసాగుతున్న వరద ఉధృతి.
- ప్రస్తుత నీటిమట్టం 9.580 మీటర్లు.
Heavy Rains in Kamareddy: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు
కామారెడ్డి :
- జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు
- గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 21.7 మి.మి.వర్షపాతం నమోదు
- అత్యధికంగా తాడ్వాయి లో 36.4 మి.మి.వర్షపాతం నమోదు.
- వరుస వర్షాలతో జిల్లా లోని అయా మండలాల్లో నీ చెరువులు కుంటలు చెక్ డ్యాం లు ఊట చెరువులు అలుగులు పరుతున్నాయి.
- వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Karimnagar: లోయర్ మానేరు డ్యామ్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం
కరీంనగర్ :
- లోయర్ మానేరు డ్యామ్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం
- లోయర్ మానేరు మొత్తం కెపాసిటీ 24టిఎంసి
- ప్రస్తుతం 21.5టిఎంసి
- ఇన్ ఫ్లో 11 వేల క్యూసెక్స్
- మధ్యాహ్నం తరువాత మూడు గేట్లు ఏతే అవకాశం ...
- దిగువ ప్రాంతాల్లో అలెర్ట్ ప్రకటించిన అధికారులు