Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-20 00:26 GMT
Live Updates - Page 2
2020-10-20 09:27 GMT

Hyderabad Rain updates: హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్న వాన భయం..

హైదరాబాద్.. 

-సిటీలో పలు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం

-ఇంకా వరద ముంపులోనే 200 ల కాలనీలు

-వరద సహాయక చర్యల కోసం 53 బోట్లను సిద్ధం చేసిన ప్రభుత్వం

-ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జి హెచ్ ఎం సీ

-ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ

-మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనలో ముంపు ప్రాంత ప్రజలు

2020-10-20 09:05 GMT

Raghunandan Rao: బీజెపి అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్..

సిద్దిపేట జిల్లా:

దుబ్బాక బాలాజీ ఫంక్షన్ హాలులో బీజెపి అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్..

  రఘునందన్ కామెంట్స్:

- రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తి గత వేధింపులకు గురి చేస్తోంది

- నిన్న వాహనం తనిఖీ చేయడానికి పది మంది సిఐ, పది మంది ఎస్సైలు, ముగ్గురు ఎసిపి లు 150 మంది పోలీస్ బందోబస్తు మధ్య తనిఖీ

- కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు

- పోలీసులను వివరణ కోరితే సరైన సమాధానం లేదు

- మా బీజెపి వాహనంలో డబ్బులు పెట్టి కేసులు పెట్టె కుట్ర ప్రభుత్వం చేస్తుంది

- మమ్మల్ని వ్యక్తి గతంగా టార్గెట్ చేస్తుండు మంత్రి హరీష్ రావు

- 2014 ఆగస్టు నుండి ఇవ్వాల్లటికి దుబ్బాక కు ఎన్ని నిధులు ఇచ్చారో మంత్రి చెప్పాలి

- బీజెపి గెలిసిన దగ్గర 2 రూపాయలు ఫెన్షన్ వస్తుందని నిరూపిస్తవా? హరీష్ రావు కు సవాల్

- దుబ్బాక లో టౌన్ హాల్ కు మూడు కోట్లు ఇచ్చినట్టు సమాచార హక్కు చట్టం కింద మీ అధికారులే ఇచ్చారు.

- బీజెపి గెలిస్తే పింఛన్లు రావనడం నిరూపించాలి

- కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ఒక నాణానికి బొమ్మ బొడుసు లాంటివే

- నిన్న జరిగిన అన్ని సంఘటనలు రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి ఈ రోజు తెలుపుతాము

2020-10-20 08:43 GMT

Hyderabad updates: నగరంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం!

-జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్..

-నగరంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

-అధికారులు,ఫ్లడ్ రిలీఫ్ స్పెషల్ ఆఫీసర్లు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డి ఆఫ్ ఎఫ్ టీమ్ లను అప్రమత్తం చేసిన కమీషనర్

-శిధిల భవనాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించాలి

2020-10-20 06:54 GMT

సిద్దిపేట జిల్లా:

టీఆరెస్ కు షాక్

టీఆరెస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన తొగుట ఎంపిపి గాంధారి లతా నరేందర్ రెడ్డి..

..... ఏఐసిసి ఇంచార్జ్ మాణికం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన ఎంపిపి లత

2020-10-20 06:54 GMT

#ధరణి పోర్టల్​లో ఆస్తుల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.

#దాదాపు 80 శాతానికిపైగా ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తైందుంటున్న అధికారులు

#జీహెచ్ఎంసీలో ఐదు లక్షలా 60 వేలు మంది వ్యవసాయేతర స్థిరాస్తుల వివరాలను నమోదు.

#రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 79 లక్షలకు పైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు.

#జీహెచ్ఎంసీలో ఐదు లక్షలా 60 వేలు,

#ఇతర పట్టణాల్లో 16 లక్షలా 11వేలు,

#గ్రామపంచాయతీల్లో 57 లక్షలా 33 వేల ఆస్తుల వివరాలు నమోదు.

#వర్షాల నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా హైదరాబాద్​లో ఆస్తుల నమోదు ప్రక్రియ జరగడం లేదు.

# వెబ్ పోర్టల్, మీసేవ ద్వారా కొంతమంది స్వయంగా ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు.

2020-10-20 06:52 GMT

హైదరాబాద్ నగరం లో మళ్ళి మొదలైన వర్షం

దిలీసుఖ్ నగర్, చైత్యన్య పురి, సరూర్ నగర్, కర్మాన్ ఘాట్ ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం

2020-10-20 06:52 GMT

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు.

కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని వెల్లడించారు.

రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు సీఎం కేసీఆర్ తెలిపారు.

2020-10-20 06:51 GMT

అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి.

2020-10-20 06:51 GMT

హైదరాబాద్

ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న రెండు ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు...

మంగళగిరి, కాకినాడ నుండి నిన్న రాత్రి బయలుదేరిన బృందాలు...

ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 35 స్పీడ్ బొట్లు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం..

మరొక 15 బొట్లు రేపటి లోపు అందుబాటులోకి...

ఆంధ్రప్రదేశ్ నుండి 5 స్పీడ్ బొట్లు, రెండు ఎయిర్ బొట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి...

రేపటి లోపు మరొక 4 మంగళగిరి నుండి అందుబాటులోకి..

మరికాసేపట్లో ముంపు ప్రాంతాలకు బయలుదేరడం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు...

ఏ క్షణమైనా ఎక్కడికి వెళ్లాలనుకున్న వేగంగా వెళ్లడం కోసం 20 ట్రక్కుల్లో స్పీడ్ బొట్లు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం..

2020-10-20 06:50 GMT

ములుగు జిల్లా.

మంగపేట మండలం గంపోనిగూడెం ప్రధాన రహదారిపై రైతుల ధర్నా.

పెనుగాలులు, ఆకాలవర్షాల వల్ల పంటలు నష్టపోయిన వివరాలపై సర్వే నిర్వహించాలి.

నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.

ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా నిలచిన వాహనాలు.

రైతుల ధర్నాకు మద్దతు పలికిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.

Tags:    

Similar News