Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
ఏపీలో ఉల్లిపాయలను సబ్సిడీపై అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వ్వం.
వర్షాలు,వరదల ప్రభావంతో ఉల్లి ధరలు పెరగడంతో సబ్సిడీపై అందించాలని భావిస్తున్న ప్రభుత్వం.
మహారాష్ట్ర, కర్నాటక నుండి ఏపీకి ఉల్లి దిగుమతి కాకపోవడంతో ఏపీలో అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.
బహిరంగ మార్కెట్లో 70 రూపాయలుగా ఉన్న ఉల్లి ధరలు,మరో వారంలో 100రు చేరె అవకాశం.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చర్చించి రెండు లేదా మూడు రోజుల్లో అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు అమ్మకాలు.
వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపడుతున్న మార్కెటింగ్ శాఖ అధికారులు
పశ్చిమ గోదావరి జిల్లా
👉అజ్ఞాతంలోకి మాజీమంత్రి, టీడీపీ నాయకురాలు పీతల సుజాత.
👉నిన్న టీడీపీ జాతీయ ,రాష్ట్ర పార్టీ పదవుల కేటాయింపులో తనకు ఎలాంటి పదవీ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన పీతల సుజాత.
👉పార్లమెంట్ అధ్యక్షుల నియామకం, టీడీపీ జాతీయ ,రాష్ట్ర పార్టీ పదవుల్లో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో తనని పార్టీ అధినాయకత్వం దూరం పెడుతుందని కార్యకర్తల దగ్గర ఆవేదన
👉తన కంటే జూనియర్లకు రెండు, మూడు పార్టీ పదవులు ఇవ్వడంతో అవమానంగా ఫీల్ అయిన పీతల సుజాత.
👉నిన్న ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పీతల సుజాత
👉నేడు జిల్లాకు నారా లోకేష్ వస్తున్నారనే సమాచారంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పీతల సుజాత
👉వైసీపీ, బీజేపీలలో చేరాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పీతల సుజాత అనుచరులు.
అమరావతి:
కొవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో విచారణ
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన గుంటూరు కు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు.
ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశం
రెండు వారాల్లో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ఏఏజీని ప్రశ్నించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం
కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని తెలిపిన అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి
ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలు
సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ పిల్ దాఖలు

విశాఖ...
వెదర్ అప్ డేట్
మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనం
వివిధ వాతావరణ పరిణామాల వల్ల ఆవర్తనం బలహీనం..
బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం బలపడుతుందా లేదా అనేది అంచనా వేస్తున్న అధికారులు..
దీని ప్రభావంతో నేడూ రేపూ కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ రాయలసీమలలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయి.
రేపు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు.
పుట్టపర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం.
వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది.
బుక్కపట్నం చెరువులోకి భారీగా చేరుతున్న నీరు.
అనంతపూర్ లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో కి వరద నీరు.
ఓల్డ్ టౌన్ లోని కూరగాయల మార్కెట్ లోకి చేరిన వరద నీరు
పశ్చిమ గోదావరి జిల్లా
భారీ వర్షాలు కారణంగా ఈ రోజుపశ్చిమగోదావరి జిల్లాలో జరగాల్సిన టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ పర్యటన వాయిదా
తిరుమల
శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సాయి కుమార్.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారు..
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది.
కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్
నిజమైన హీరోలు పోలీసులు, పోలీసు గెటప్ వేస్తేనే ,మాలో ఒక పౌరుషం కనిపస్తుంది..నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో.
పోలీస్ స్టోరి చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది. త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నా.
కనిపించే మూడు సింహాలు. పోలీసులు,వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులే
సాయి కుమార్, సినీనటుడు