Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-20 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-20 16:39 GMT

శ్రీకాకుళం జిల్లా..

-ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్స్..

-ఎంతటి తప్పు చేసినా పోలీసుల అండదండలు ఉంటాయనే ధీమాతో అనేకమంది చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు..

-జిల్లాలో కూడా పోలీసులను నమ్మాలా లేదా అనే పరిస్థితులు నెలకొన్నాయి..

-మంచినీళ్ల పేటలో ఓ వాలంటీర్ స్థానిక మహిళ పై ప్రవర్తించిన తీరు బాధాకరం..

-మనుషులు మృగాల్లా మారడానికి కారణం జగన్..

-వైసిపి నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కంకణం కట్టుకున్నారు..

-టిడిపిని అణగదొక్కాలనే దూరాలోచనతోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు..

-మేము న్యాయం కోసం స్టేషన్ లకు వెళితే కౌంటర్ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..

-న్యాయాన్ని పరిరక్షించాలని ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసాం..

2020-10-20 16:34 GMT

కృష్ణాజిల్లా..

-తెలంగాణా రాష్ట్రం కోదాడ నుండి నందిగామ కు ఆటోలో అక్రమంగా మద్యం రవాణా

-ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన నందిగామ పోలిసులు

-340 మద్యం బాటిళ్లు స్వాధీనం

2020-10-20 16:32 GMT

విజయవాడ

దుర్గగుడి ఈవో సురేష్ బాబు

-4 వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు

-11981 మంది దర్శనానికి వచ్చారు 4483 లడ్డు ప్రసాదాలు విక్రయించాం

-14,54,345 రూపాయలు సాయంత్రం వరకు వచ్చిన ఆదాయం

-రేపు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

2020-10-20 16:01 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి

-56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్.

-నగరంలో బీసీ ల భారీ ర్యాలీ, అపర నవయుగ పూలే మన సీఎం జగన్..

-గోదావరి గట్టు పై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎంపీ భరత్

2020-10-20 15:47 GMT

విజయవాడ..

-సీపీ బి. శ్రీనివాసులు

-హరికృష్ణ కారు ద్వారా క్లూస్ దొరికాయి

-కాల్పుల సంఘటనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది

-ఇద్దరికీ తోడ్పడిన ఆటో డ్రైవర్ రాధాకృష్ణారెడ్డి

-సాకేత్ రెడ్డి, గంగాధార్ అలియాస్ గంగూ భాయ్ కాల్పులు జరిపారు

-కాల్పులకు వినియోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నాం

-సింగపూర్ లో పనిచేసాడు సాకేత్ రెడ్డి

-హైదరాబాదులో ఉన్నాడు సాకేత్ రెడ్డి

-బీహార్ నుంచీ తుపాకీ కొనుక్కొచ్చాడు

-తెనాలికి చెందిన సందీప్ సాకేత్ రెడ్డికి సుపారీ ఇచ్చాడు

-సందీప్ మెసేజ్ ద్వారా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయాలని సాకేత్ రెడ్డిని రప్పించాడు

-గంగూ భాయ్, సాకేత్ రెడ్డి కలిసి లిక్కర్ తీసుకున్నారులిక్కర్ తీసుకునేందుకు క్రైమ్ స్పాట్ కు వచ్చారు

-మృతి చెందిన మహేష్ ను, దోషులను వెళ్ళిపోమని బీటు పొలీసులు చెప్పారు

-మహేష్ మాటలు విన్న నిందితులకు, మహేష్ కు మధ్య గొడవ జరిగింది

-సాకేత్ మాన్షన్ హౌస్ బ్రాందీ రెండు బాటిళ్ళు తాగాడు

2020-10-20 15:43 GMT

విశాఖ..

-షీలానగర్ గేట్వే ఈస్టిండియా ప్రైవేట్ కంటేైనర్ యార్డులో ప్రమాదం

-క్రేన్ ఢీకొని కొండవీటి సాంబశివరావు అనే ఉద్యోగి మృతి

2020-10-20 15:35 GMT

తాడేపల్లి..

-ఎన్ రెడ్ క్యాప్ వైస్ చైర్మన్ రమణారెడ్డి పీసీ

-రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్రాజక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం

-కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలు గుర్తించాం

-దీర్ఘకాలిక లీజుకు తీసుకుని పెద్ద ఎత్తున సౌర పవన్ హై-గ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా చర్యలు

-డవలపర్లు పవర్ ప్లాంట్లు నిర్మిస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇతర గ్రామాలకు విక్రయించే వీలు

-రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటుంది

-కర్నూలు కడప, అనంతపురం జిల్లాలో 3 నుండి 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల అల్ట్రామెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ లకు ప్రోత్సాహం

-నూతన పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు బహుళ ప్రయోజనాలు

-కరువు పీడిత ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చేయొచ్చు

-రాష్ట్రంలో 7 ప్రాంతాల్లో 6,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రైజెక్టు ఎర్పాటు

2020-10-20 15:27 GMT

చత్తీస్ గఢ్ :

-ఐఇడి పేల్చి,కాల్పులు జరిపిన మావోయిస్టులు.

-ఇద్దరు జవాన్లకు గాయలు,

-ఎదురుకాల్పులలో ఒక మావోయిస్ట్ మృతి.

-భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..

2020-10-20 15:23 GMT

తిరుమల... 

-ఈస్ట్ బాలాజినగర్ లో ఓ నివాసగృహం వద్ద ప్రత్యేక్షమయిన చిరుత పులి

-భయాందోళనలో బాలాజినగర్ వాసులు, గతంలో పలుమార్లు ఇదేప్రాంతంలో కనిపించిన చిరుతలు

2020-10-20 15:20 GMT

అమరావతి.

-క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి

-కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వానం

-నవంబరు 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు

-సీఎంకి వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపిక అందజేసిన ప్రతినిధులు

-కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:    

Similar News