Telangana live updates: మంచిర్యాల
మంచిర్యాల డివిజనల్ రైల్వే మేనేజర్ అజయ్ కుమార్ గుప్తా రైల్వే స్టేషన్ నిర్వహణపై తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన 100 ఫీట్ల పొడవు, 600 ఫీట్ల జాతీయ జెండాను డివిజనల్ రైల్వే మేనేజర్ అజయ్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు.
Telangana live updates: ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అడవి పందుల భారీ నుంచి కాపాడుకోవడానికి వినూత్న పద్దతిని పాటిస్తున్నారు. మైకు ద్వారా కుక్క, పులి, నక్క అరుపులను రికార్డు చేసుకొని పంట పొలాల చుట్టు మైకులు అమర్చారు. ఎలుగుబంటి వేశాలు వేసుకొని తిరుగాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Telangana live updates: జనగామ జిల్లా
జనగామ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోతు కవితతో కలిసి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. టీఆర్‌ఎస్ లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్ పార్టీ బతికి ఉంటుందన్నారు.