Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Weather updates: దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
దక్షిణ కోస్తా ఆంధ్ర :
-ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
-రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
-ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Weather updates: ఉత్తర కోస్తా ఆంధ్రాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
-ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
-తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
-రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Visakha Weather updates: బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..
విశాఖ....
-మధ్య బంగాళాఖాతం లో 5.8 km ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం....
-దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో అదే ప్రాంతములో అల్పపీడనం ఏర్పడే అవకాశం...
-దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ..
Guntur district updates: మార్కెట్ యార్డ్ లో సర్వ సభ్య సమావేశం..హాజరైన MLA నంబూరు శంకర్ రావు..
గుంటూరు జిల్లా..
-గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సర్వ సభ్య సమావేశం..హాజరైన MLA నంబూరు శంకర్ రావు ....
-బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్య మంత్రి YS జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన MLA శంకర్రావు....
-మార్కెట్ యార్డ్ సెక్రటరీ నాగరాజు పై అవినీతి ఆరోపణలు....
-సర్వ సభ్య సమావేశానికి హాజరుకాక పోవడం పై ఎమ్మెల్యె అగ్రహాం......
-రికార్డుల తారుమారుకు పాల్పడ్డాడని అతనిపై విచారణకు ఆదేశించిన MLA నంబూరు శంకర్ రావు.....
Y.S.Jaganmohan Reddy: నూతన ఇసుక విధానంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష..
అమరావతి
-మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో పాటు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు.
-సీఎం జగన్ మోహన్ రెడ్డి..
-ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దు.
-పూర్తి పారదర్శకంగా విధానం ఉండాలి. ధర కూడా రీజనబుల్‌గా ఉండాలి.
-నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలి. పూర్తి నాణ్యతా ప్రమాణలు పాటించాలి.
-ఇసుక రీచ్‌లు, సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుంది.
-రవాణా వ్యయం ఎక్కువగా ఉంది. అది రీజనబుల్‌గా ఉండాలి.
-చలాన్ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి.
-ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ.
-ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్‌ఈబీ రంగ ప్రవేశం చేస్తుంది.
-ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా. టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేయవచ్చు.
-స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూపన్లు ఇచ్చి, వాటిపై సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు.
East godavari updates: అమీనాబాద్ కి చేరుకున్న నారా లోకేష్!
తూర్పుగోదావరి :
-ఉప్పాడ కొత్తపల్లి మం. అమీనాబాద్ కి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
-సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి..
-స్థానిక మత్స్యకారులతో మాట్లాడిన నారా లోకేష్..
Vijayawada durgamma updates: కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి!
విజయవాడ..
-అశోక్ పిల్లర్ సమీపంలో ఊ డి పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు
-ఫ్లై ఓవర్ కాంక్రిట్ పెచ్చులు ఊడి పడటంతో కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలు.
-APSP బెట్టాలియన్ కి చెందిన రాంబాబు దసరా ఉత్సవాల బందోబస్తు కోసం విధి నిర్వహణ.
-రాంబాబు మీద పెచ్చులు పడటంతో అతని చేతికి, భుజానికి గాయాలు.
-మూడు రోజుల క్రితమే ప్రారంభం అయిన ఫ్లై ఓవర్
-ఘటన పై విచారణ జరుపుతున్న అధికారులు
Visakha updates: అపోలో హాస్పిటల్ లో ప్రారంభమైన పోస్ట్ - కోవిద్ రికవరీ క్లినిక్..
విశాఖ..
-కోవిద్ రోగులలో 50 శాతం పైగా శ్వాస, ఛాతి నొప్పి, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు, దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు
-కోవిద్ -19 నుండి కోలుకున్న రోగులు ఎదురుకొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి మొట్ట మొదటి క్లీనిక్
-ఆరిలోవ అపోలో హాస్పిటల్ లో పోస్ట్ - కోవిద్ రికవరీ క్లినిక్ ను ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సమీ వెల్లడి
sedhiri appalararu updates: శ్రీకాకుళం జిల్లాకు జగన్ పెద్దపీట వేశారు!
శ్రీకాకుళం జిల్లా..
మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..
రెండు మంత్రి పదవులు, ఒక స్పీకర్ పదవితో పాటు కార్పొరేషన్ చైర్మన్ లలో కూడా శ్రీకాకుళం జిల్లాకు జగన్ పెద్దపీట వేశారు..
50 శాతం ఓటు బ్యాంకు కలిగిన బిసిలకు 56 కార్పొరేషన్ లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది..
ఒక్కో కార్పొరేషన్ లో ఒక ఛైర్మన్, డైరెక్టర్లను చేర్చి బిసిలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పించారు..
6 కార్పొరేషన్ పదవులు జిల్లాకు ఇవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను..
కార్పొరేషన్ పదవులు అన్ని కులాల వారి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి..
బిసిలకు ఇంత పెద్దఎత్తున బడ్జెట్ కేటాయింపులు కూడా వైసిపి ప్రభుత్వం గొప్పతనం..
1-6 నెలల్లోనే 2కోట్ల 70 లక్షల మంది బిసిలకు లబ్ది చేకూరింది..
-బిసిలుగా ఎల్లప్పుడూ జగన్ కు అండగా నిలుస్తాం..
Nellore district updates: నెల్లూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన...
నెల్లూరు :--
-- కృష్ణపట్నం పోర్టు లో పనిచేస్తున్న ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను తొలగించడం పై ఆందోళన.
-- కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వెళ్లిన వారిని తొలగించడం అన్యాయం. సీఐటీయూ నాయకులు మోహన్ రావు.
-- కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళన తీవ్రతరం... పోర్ట్ యాజమాన్యానికి సీఐటీయూ హెచ్చరిక.