Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
అమరావతి..
-రేపు కృష్ణా జిల్లా కైకలూరు,పశ్చిమగోదావరి జిల్లా ఉండి,తణుకు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-దెబ్బతిన్న పంటలు,నీట మునిగిన ఇళ్ళు పరిశీలించి నష్టపోయిన రైతులు,ప్రజల్ని పరామర్శించనున్న లోకేష్
మహారాష్ట్ర:
-గడ్చురోలి జిల్లా దానోర తాలూకా గ్యారపత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసమి కేసానిలి అడవి ప్రాతంలో నిన్న సాయంత్రం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఐదుగురు మావోల వివరాలు వెల్లడించిన పోలీసులు
-ఈ సంవత్సరం లో 10 మంది మావోలను మట్టుపెట్టడం జరిగింది అన్నారు.
-ఈ సంవత్సరంలో ఇదే పెద్ద సంఘటన అనిఅన్నారు.
-ఈ కుంబింగ్ లో పాల్గొన్న సి60 కమోడోస్ అభినందించిన గడ్చురోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్
-1)సుమిత &రాజో,వయసు 34 గ్రామం: ముంగనిర్,
-తాలూకా దానోర,
-ఈమె మీద 14 కేసులు
-4 లక్షలు రివార్డు
-2)కుమిలి దావీడే, వయసు23, గ్రామం: కటజీరి
-తాలూకా: దానోర
-కోర్చి దళం సభ్యురాలు
-2 కేసులు
-రివార్డు 2 లక్షలు
-3)సుమన్ &జుంకి &సుంకి వయసు32
-గ్రామము:పిసిలి బొరిగి,
-తాలూకా :ఏటపల్లి,
-జిల్లా:గడ్చురోలి
-తిపగడ్ దళం acm సభ్యురాలు,2006 నుండి పని చేస్తుంది,
-21 కేసులు,6 లక్షల రివార్డు
-4)చందా&చందన&మాకే వయసు26
-గ్రామం: బుడిగిన్:
-తాలూకా :జోగర్ గుండా
-జిల్లా బీజాపూర్
-రాష్ట్రం; ఛత్తీస్ గడ్
-15 నెంబర్ ప్లాటున్ దళ సభ్యురాలు,4 లక్షలు రివార్డు
-5)టిరా &నిలిష్&శివాజీ వయసు30
-గ్రామం: కిచోడ,
-తాలూకా :దానోర
-జిల్లా:గడ్చురోలి
-తిప్పగాడ్ దళ సభ్యుడు,20 కేసులు,2లక్షల రివార్డు
-చనిపోయినా మావోల మీద 16 లక్షల రివార్డు ఉంది
శ్రీకాకుళం..
-అచ్చెన్నాయుడు, టిడిపి ఎపి అద్యక్షుడు..
-పార్టీ ఓడినా గెలిచినా...ఓడినా ఎప్పుడూ టిడిపితో ఉండేది బిసిలే!
-టిడిపి నియామకాల్లో 60 శాతం బిసిలకే ఇచ్చారు
-2024లో ఎన్నికలుజరిగినా...ముందు జరిగినా చంద్రబాబును సిఎం ను చేస్తాం
-రాష్ట్రం కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావాలి
-16 నెలల్లో రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్యం, కక్ష సాదింపు చర్యలే
-వైసిపి పాలన కారణంగా టిడిపి క్యాడర్ భయంలోకి వెళ్లిపోయారు
-పార్టీలో అందరినీ కలుపుకుంటా....ప్రజా క్షేత్రంలో పారాడుతా
-వరదలపై మంత్రి పెద్ది రెడ్డి సమీక్ష.......
-ఎవ్వరికీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం
-హైదరబాద్ లో నాళాలు పై నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు పడుతున్నారు
-బలహీనంగా ఉన్న కాలువలు, చెరువులు గుర్తించి పనులు చేపడుతాం
-ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు
-అవసరమైన నిధులు సమకూర్చి నష్ట పరిహారం చెల్లిస్తాం
అమరావతి :
-2018 గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ అంశంపై దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ..
-అక్టోబర్ 22 లోపులో తీర్పు వెలువరించనున్న ధర్మాసనం..
విశాఖ..
-ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్
-భారతదేశంలోనే బీసిలకు పెద్దపీట వేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి.
-కలలో కూడా ఊహించని విధంగా ముఖ్యమంత్రి బీసిలకు న్యాయం చేశారు.
-తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కులులాగా మెరుగుతున్నారు.
-టిడిపిలో కుక్కులాగ ఉండలేకే వైసిపీ పార్టీకి మద్ధతు ఇచ్చాను.
విశాఖ..
-విశాఖ బీచ్ రోడ్డులో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు
-హాజరైన ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్,అదీప్ రాజు,వాసుపల్లి గణేష్ కుమార్ ,వైసిపీ నాయకులు
శ్రీకాకుళం జిల్లా..
-మందస మండలం రట్టి తీరంలో మృతదేహం లభ్యం..
-మృతుడు సిసింద్రీగా గుర్తింపు..
-నిన్న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ..
-24 గంటలుగా సిసింద్రీ కోసం కొనసాగిన గాలింపు చర్యలు..
-సిసింద్రీ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..
తూర్పుగోదావరి :
-పెదపూడి మం. అచ్చుతాపురత్రయం లో నారా లోకేష్ కు వైసిపి కార్యకర్తల నుంచి నిరసన సెగ..
-వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను బ్యాక్ అంటూ నినాదాలతో ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు..
-పోలీసుల జోక్యంతో వెనుదిరిగిన వైసిపి కార్యకర్తలు.. సద్దుమణిగిన వివాదం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :
రాయలసీమ :
-ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
-ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
-అమరావతి వాతావరణ కేంద్రము