Harish Rao Comments: నిత్యం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది..శ్రీ హరీశ్ రావు..
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్ :
- దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో రెండు నూతన అంబులెన్సులను మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో ప్రారంభించుకున్నాం.
- గ్రామీణ పేద ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.
- దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే 2 అంబులెన్సులు ఉన్నాయని, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు మరో రెండు అంబులెన్సులను నూతనంగా ప్రారంభించడం జరిగింది.
- ప్రజలు అత్యవసర సమయంలో 108 ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద..
నిజామాబాద్:
-ఇన్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో లక్షా 50 వేల క్యూసెక్కులు
-40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు
-ప్రస్తుత నీటి మట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు
Double Bedroom Housing scheme: ఇక్కడ కట్టే ఇళ్లల్లో 90% జీహెచ్ఎంసీ పరిధి ప్రజలకే..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
-స్థలాలు లేకనే శివారు ప్రాంతాల్లో నిర్మించాం
-ఎక్కడ కట్టినా అవి హైదరాబాద్ వాసులకే
-లక్ష ఇళ్లకు సంబంధంచిన లిస్ట్ ఇస్తామంటే పారిపోతున్నారు
Bhatti Vikramarka: అర్ధాంతరంగా ముగిసిన హైదరాబాద్ డబల్ బెడ్ రూం ఇళ్ళ సందర్శన..బట్టి విక్రమార్క..
బట్టి విక్రమార్క.. సి ఎల్పీ నేత..
-జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబల్ బెడ్ రూం ఇళ్ళను చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3428 ఇళ్లనే చూపించారు
-ఈరోజు చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో రావు
-జీహెచ్ఎంసీ పరిధిలో వందల ఎకరాలు ఉన్నాయి కట్టడానికి
-గత మునిసిపల్ ఎన్నికల్లో ఆయా మునిసిపాలిటీ లలో చూపించిన ఇళ్ళనే చూపిస్తున్నారు
Karimnagar updates: మానవత్వం చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్..
కరీంనగర్ :
-రామడుగు మండలం రుద్రారం గ్రామంలో అనదలైన ఇద్దరు పిల్లలకి చేయూత..
-లక్ష రూపాయల నగదు ఇచ్చి..పిల్లల బాధ్యత తీసుకున్న ఎమ్మెల్యే..
Telangana updates: దేశం లోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పోతుంది..వేముల ప్రశాంత్ రెడ్డి..
వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి..
-లుంబిని పార్క్ పక్కనే ఉన్న జలదృశ్యం లో తెలంగాణ మ్యాట్రీస్ మెమోరియల్ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి.
-తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల అయినా వారి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని సీఎం ఆలోచన ప్రకారం ఏ ఏర్పాటు జరుగుతున్నవి..
-తెలంగాణ మార్టిస్ మెమోరియల్ తెలంగాణ రాష్ట్రని కి ఎవరు వచ్చిన అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించేల నిర్మిస్తున్నాము.
-ఇతర దేశాల నుంచి ప్రముఖులు వచ్చిన ఇక్కడ వచ్చిన పెళ్లి రాజ్ ఘాట్ తరహాలో శ్రద్ధాంజలి ఘటించేలా ఏర్పాటు చేస్తున్నాం.
-350 కార్లు, 600 బైక్ లు పట్టేలా పార్కింగ్ ప్లేస్.
-ఫోటో గ్యాలరీ లో అమరవీరులను గుర్తుకు తెచ్చుకునే ల ఉంటావి..
-బట్టి విక్రమార్క కి అనుమానం రావడం తో తలసాని వెంట తీసుకెళ్లారు
-తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 12 లక్షల ఇతర రాష్ట్రాల ఇండ్ల తో సమానం.
Telangana Latest news: కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆద్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నం..సితక్క..
సితక్క ఎమ్మెల్యే...
-పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సితక్క కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి తదితరులు...
-మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్...
-పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం 500 కోట్లు చెల్లింపు, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్...
-పోలీసులకు సితక్క కి మధ్య తోపులాట..
-ముట్టడికి యత్నించిన ఎమ్మెల్యే సితక్క తో పాటు కిసాన్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్...
-నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు...
-అసెంబ్లీ లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదు..
-రైతుల డిమాండ్ల పై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు...
Telangana updates: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాము..మల్లారెడ్డి..
-Hmtv తో మంత్రి మల్లారెడ్డి..
-ప్రస్తుతం ఉన్న రాంపల్లి లో ఆరు వేలకు పైగానే ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యింది
-కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లో చేసిన సవాలు ను స్వీకరించి మేము కట్టిన ఇండ్లు చూపించాం
-ఇండ్ల లబ్ధి దారులు ఆందోళన చెందవద్దు
-ఇండ్ల కోసం ఆత్మహత్య లు చేసుకోవడం బాధాకరం..
Telangana updates: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండేవి...కేటీఆర్..
కేటీఆర్ రాష్ట్రమంత్రి...
ట్విట్టర్ ద్వారా..
-రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం విజయవంతంగా అమలు చేయడం తో రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు సున్నకు చేరుకున్నాయి.
-ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ సాక్షిగా దృవీకరించింది.
Kamareddy updates: నీటిని కౌలాస్ వాగు ద్వార మంజీర లోకి విడుదల చేసిన అధికారులు..
కామారెడ్డి :
జుక్కల్..
-మండలం లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షం కారణంగా ప్రాజెక్ట్ లో 10,327క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ 5గేట్లు ఎత్తి 6855క్యూసెక్కుల నీటిని కౌలాస్ వాగు ద్వార మంజీర లోకి విడుదల చేసిన అధికారులు.