Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59
ఈరోజు తాజా వార్తలు
జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.
మేయర్ బొంతు రామ్మోహన్..
-భట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరు నమ్మారు.
-ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ను భట్టి చూడకుండా తప్పించుకొని పోయాడు.
-కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నరు.
-కొల్లూరు లో సకల సౌకర్యాలతో పేద ప్రజలకు ఇండ్లు కట్టించాము.
-రాజకీయల నాయకుల ప్రమేయం లేకుండా, పూర్తిగా అధికారుల ద్వార పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాము.
-జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.
మంత్రి మల్లారెడ్డి ..
-జి హెచ్ ఎం సి పరిధిలో స్థలాలు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే.
-సీఎం కేసీఆర్ పేదలు గౌరవం గా ఉండాలని డబుల్ బెడ్ ఇండ్లు నిర్మాణాలు చేశారు.
-కాంగ్రెస్ పార్టీ వైఖరి చేసి ప్రజలు విసుకుంటున్నారు.
-పేదల కోసం కట్టిన ఇండ్లు చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారు.
సంగారెడ్డి జిల్లా..
జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
-కొల్లూరు లో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళ ఖండం.
-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుడా హైద్రాబాద్ నిరుపేదల కోసం 15 శివారు ప్రాంతాల్లో 33550 ఇండ్లు నిర్మాణం చేశారు.
-నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో స్థానికులకు 10 శాతం, హైదరాబాద్ వారికి 90 శాతం మందికి కేటాయిస్తాము.
-ప్రభుత్వం బాధ్యత గా నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ నిర్మాణలు చూపెడుతామని చెప్పిన వినలేదు.
-పెద్దవాళ్ళ గొప్పగా బతకాలని పూర్తిగా ఉచితంగా ఇండ్ల నిర్మాణం చేసాము.
-పేద వాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఆలోచన చేయలేదు.
-70 వేల కోట్లతో హైదరాబాద్ మహానగరంలో సమగ్ర అభివృద్ధి చేసాము.
హైద్రాబాద్..
-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామని చెప్పి, అమాయకులను మోసం చేసి లక్షలు కాజేసిన ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..
-ముగ్గురు సభ్యులు గల ఈ ముఠా లక్నో కేంద్రం గా పనిచేస్తుంది...
-లక్నో కు చెందిన షాను అన్సారీ, రిషబ్ మల్హోత్రా, వైభవ్ మహాజన్ ముగ్గురు కూడా విద్యార్థులే...
-లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది నిరుద్యోగులను చీటింగ్ చేశారు...
-కెరియర్ సైట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులను టార్గెట్ చేసుకునేవారు..
-నౌకరీ డాట్ కాం, టైమ్స్ జాబ్ డాట్ కాం వెబ్ సైట్ లలో ఉద్యోగం కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటరో వారి వివరాలు తీసుకుని మోసం చేశారు...
-నగరంలోని ఒక మహిళకు MNC కంపెనీ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తం అని చెప్పి 38 లక్షలు కాజేసిన ముఠా..
-నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మద్దతు ఇవ్వాలని
-కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ లిఖితపూర్వకంగా విజ్ఞాపనాపత్రాలను అందజేసింది...
-టీపీసీసీకీ, ఎఐసీసీకీ ఇదివరకే లేఖలు అందజేసింది టీజేఎస్.
-తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు ఉద్యమ సారథి అయిన కోదండరాం ఎమ్మెల్సీగా గెలుపొందడం అవసరమనీ,
-యువత, నిరుద్యోగులకు ఆయన మండలిలో సరైన ప్రాతినిధ్యం వహిస్తారని,
-ఈ విశాల ప్రయోజనాల దృష్ట్యా కోదండరాం కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు
-లిఖితపూర్వకంగా వినతి పత్రాలను అందజేశారు....
-ఈ బృందంలో జి. వెంకట్ రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేష్, శ్రీశైల్ రెడ్డి ఉన్నారు....
-అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం తెలియజేసింది....
-హైదరాబాద్ నగర శివారు కొల్లూరు లో డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల ను పరిశీలించిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్..
-144 ఎకరాలకు పైగా స్థలం లో 15560 ఇళ్లు
-స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి చాలా సౌకర్యాలు వస్తాయి
-కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో నిర్మించిన 33558 ఇళ్లు కడతామని చెప్పారు
-కాంగ్రెస్ వాళ్ళ స్థాయికి తగ్గి ఇంటికి వెళ్లి ఆహ్వానించాం
-వాళ్ళు కావాలనే తప్పించుకోడానికి ప్రయత్నాలు చేశారు
-శివారు ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లల్లో 90% హైదరాబాద్ వాసులకే అని ఆనాడే చెప్పాం
-ప్రభుత్వ సంకల్పంతో వారిని ఆహ్వానిస్తే మేము పారిపోయాం అంటున్నారు...వారిని సాదరంగా పంపించాం
-ఒక్క బట్టి విక్రమార్క కే కాదు, దేశ ప్రధానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం.. ఇలాంటి ఇళ్లు ఎక్కడా లేవు
టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..
-రాష్ట్రంలో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేయాలని టీడీపీ టీఎస్ మహిళా విభాగం శాంతియుతంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతుంది...
-నిరసన తెలుపుతున్న మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నా ను, తెలుగుమహిళా కమిటీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
-అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ...
కామారెడ్డి :
జుక్కల్..
-జుక్కల్ బిచ్కుంద మండల కేంద్రం లో నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,
-జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్.
-భారీ వర్షం కారణంగా నష్టపోయిన పంటలు, తెగిపోయిన రోడ్లు అంశం పై అధికారులతో అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్.
ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు..
#క్రిస్టియన్లు శాంతిని ప్రేమించే వారు
#రాష్ట్రం లో టిఆర్ఎస్ అధికారం లోకి రావాలని క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు చేశారు
#గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి పంచాయతీ అనుమతి సరిపోతుందని ప్రభుత్వం జీవో ఇవ్వడం సంతోషం
#స్మశాన వాటికలకు స్థలం కూడా ఉదారం గా కేటాయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే
#పాస్టర్లకు కరోనా సమయం లో ఇబ్బందులు ఎదురయ్యాయి ..వారిని ప్రభుత్వం ఏ రూపం లోనైనా ఆదుకోవాలి
బి .వినోద్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్:
#సీఎం కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు
#కోవిడ్ నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్ధిక రంగం లో మందగమనం నెలకొంది
#ఈ కోవిడ్ లోనూ రాష్ట్రం లో అభివృద్ది ,సంక్షేమం ఆగలేదు
#వంద దేశాల కన్నా జనాభా లో హైదరాబాద్ పెద్దగా ఉంటుంది
#కోవిడ్ పరిసితుల్లోనూ హైదరాబాద్ లో వినూత్న అభివృద్ధి పనులు కొనసాగడానికి మంత్రి కేటీఆర్ ఆలోచనా విధానమే కారణం
#హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది
#క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం పై సీఎం కెసిఆర్ చిత్తశుద్ధి తో ఉన్నారు
#ఉద్యమ సమయం లో కెసిఆర్ ఏం చెప్పారో అన్ని వర్గాల సంక్షేమం కోసం అదే చేస్తున్నారు