West Godavari updates: చేపట్టిన ఛలో అమలాపురం కి ఎలాంటి అనుమతులు లేవు.. ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు..
పశ్చిమ గోదావరి జిల్లా..
డిఐజి మోహనరావు కామెంట్స్..
-ఎవరు కూడా అమలాపురాని కి రావద్దు..
-కోనసీమలో సెక్షన్ 144, 30 అమలులో ఉంది..
-ఎవరైనా విధ్వంసాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం..
East Godavari-Prathipadu: తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యముగా వైసిపి పని చేస్తోంది..చినరాజప్ప..
తూర్పుగోదావరి : ప్రత్తిపాడు....
-ప్రత్తిపాడులో వరుపుల రాజా నివాసం వద్ద టిడిపి నేతల సమావేశం.
-హాజరైన నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యనమల కృష్ణుడు, జ్యోతుల నవీన్..
చినరాజప్ప పాయింట్స్..
-వరుపుల రాజా పై లంపకలోవ సొసైటీలో పెట్టిన కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమే..
-రాష్ట్రములో దేవాలయాలపై జరుగుతున్న దాడులు కేవలం ప్రభుత్వ వైఫల్యం..
-పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణిలో 20శాతం మాత్రమే కోర్టు కేసులు ఉన్నాయి..
-మిగతావి ప్రజలకు పంచకపోవడం పై వైసీపీ ఆంతర్యం ఏంటో స్పష్టం చేయాలి..
-హిందూ దేవాలయాల పై జరిగిన దాడుల పై నిరసన తెలపడానికి వెళ్లే వారిని అడ్డుకోవడం దురదృష్టకరం..
Vijayawada-Durgamma updates: వచ్చే నెల 17 నుండి 25 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.. దుర్గగుడి ఈవో సురేష్ బాబు..
విజయవాడ..
దుర్గగుడి ఈవో సురేష్ బాబు..
- ఈ రోజు నుండి ఆన్లైన్ లో దర్శన టికెట్ లు అందుబాటులో ఉన్నాయి
- కొండపైకి రవాణా సౌకర్యం లేదు
- నది స్నానానికి అనుమతి లేదు
- తలనీలాలు రద్దు చేసాం
- భవాని భక్తులైన, సాధారణ భక్తులు అయిన ఆన్లైన్ లొనే టికెట్ తీసుకోవాలి
- మొదటి రోజు ఉదయం 9 గంటలు నుండి రాత్రి 8 గంటలు వరకు మిగిలిన రోజులు ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది
Vijayawada-Durgamma updates: దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందికి మాత్రమే అనుమతి.. పైలా సోమినాయుడు, దుర్గగుడి చైర్మన్..
విజయవాడ..
పైలా సోమినాయుడు, దుర్గగుడి చైర్మన్..
-ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం
-మూల నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి
-4వేల టికెట్ లు ఉచిత దర్శనానికి కేటాయించాము, 3 వేల టికెట్ లు 100 రూపాయలు, 3వేల టికెట్ లు 300 రూపాయలకు కేటాయించాము
-టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలి
-5 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు దర్శనానికి అనుమతి లేదు
-కోవిడ్ నేపద్యంలో తలనీలాలు సమర్పణ రద్దు చేసాం
-వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్ మీదుగా క్యూ లైన్ ద్వారా భక్తులు రావాలి
-ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దర్శనానికి రావాలి
Andhra Pradesh High Court: కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు..
అమరావతి..
- ప్రభుత్వ భూముల వేలానికి సంబంధించి మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
- పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.
- ప్రభుత్వం చేసే ప్రతి పనికి పిటిషనర్లు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యలు చేసిన అదనపు అడ్వకేట్ జనరల్.
- ఈ వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు
- కోర్టు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేసిన ధర్మాసనం
- అక్టోబర్ 6వ తేదీలోపు ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశo.
- మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ
- ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... పూర్తిస్థాయి విచారణకు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా
- గుంటూరు, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్లపైనా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ
- ఈ వ్యాజ్యాలతో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శులు... అక్టోబర్ 6వ తేదీలోగా కౌంటర్ల దాఖలు చేయాలని, పిటిషనర్లు అక్టోబర్ 9వ తేదీలోగా రిప్లే కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ
- మిషన్ బిల్డ్ ఏపీ ద్వారా భూముల వేలాన్ని నిలిపివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Amaravati updates: ఫైబర్ నెట్టుని అడ్డం పెట్టుకుని వేమూరి హరి ప్రసాద్ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు..గౌరీ శంకర్...
అమరావతి..
గౌరీ శంకర్...
-ఫైబర్ నెట్ స్కామ్ విషయంలో హరి ప్రసాద్ చేసిన అక్రమాలపై నా దగ్గర సాక్ష్యాలున్నాయి.
-ఏపీ ఎస్ఎఫ్ఎల్ సంస్థని తన సొంత ప్రైవేట్ కంపెనీగా నడిపించారు.
-ఏపీ ఫైబర్ నెట్టులో ఇంకా హరి ప్రసాద్ మనుషులే ఉన్నారు.
-ఫైబర్ నెట్ బిల్లింగ్ సాఫ్ట్ వేరులో అవకతవకల కారణంగా కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది.
-బిల్లింగులో అవకతవకలు అరికట్టేందుకు కొత్త బిల్లింగ్ సాఫ్ట్ వేర్ రూపొందించాలని అనుకున్నాం.
-కొత్త సాఫ్ట్ వేర్ పని చేయకుండా ఉండేలా నెట్ వర్క్ డౌన్ చేశారు.
-నెట్ వర్క్ డౌన్ చేసినందుకు టెరా సాఫ్ట్ కంపెనీపై వైజాగులో కేసు పెట్టాం.
-ఫైబర్ నెట్ బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లోపాలను కనిపెట్టినందుకే నాపై కుట్ర పన్నారు.
Guntur updates: ప్రభుత్వ ఆస్తుల విక్రయం (మిషన్ బిల్డ్ ఏ పి) పై నేడు హైకోర్టులో విచారణ....
గుంటూరు...
-ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని ఆపివేయాలని హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన గుంటూరు కు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు....
-పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్..
-ప్రతిపనికి అడ్డం తగులుతున్నారు
-పరిపాలన వారినే చేసుకోమనండి ఏజీ వ్యాఖ్యలు, మీరు ఎవరినీ ఉద్దేశించి మాట్లాడారు , హై కోర్టు నా! పిటిషనర్ లనా! అని న్యాయ మూర్తి వ్యాఖ్యలు....
-విషయాలన్నింటిని కూలంకషంగా పూర్తి స్థాయి విచారణ చేసి తీర్పు ను అక్టోబర్16 కు వాయిదా.
-ప్రతివాదులుగా ఉన్న అన్నీ విభాగాల ప్రభుత్వ కార్యదర్శులకు అన్నీ కేసుల్లో కౌంటర్ దాఖాలు చేయలన్న ధర్మాసనం.
Polavaram Project updates: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యూనల్ లో విచారణ..
జాతీయం..
-ముంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఆమోదించిన ఎన్జీటీ
-కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఎన్జీటీ
-రెండు నెలల్లో పోలవరం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం
-ఏపీలో పోలవరం ముంపు బాధితులకు ఆరు నెలల్లో పునరావసం, పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశం
Sucharitha Comments: జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర లో మహిళల కష్టాలు స్వయంగా విని చలించిపోయారు..మేకతోటి సుచరిత..
గుంటూరు:
మేకతోటి సుచరిత - హోంమంత్రి వర్యులు...
-ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో జరిగిన వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గోన్న హోంమంత్రి మేకతోటి సుచరిత.....
-ప్రత్తిపాడు నియోజకవర్గం లో కూడా చాలా మంది మహిళలు కష్టాలు చెప్పుకున్నారు.
-మహిళల కష్టాలు చూసి చలించిన జగన్మోహన్ గారు అనేక పథకాలను ప్రవేశపెట్టారు.
-దేశంలో ఎక్కడా లేని విధంగా 65 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగింది.
-వై.యస్.ఆర్ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారు.
-మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలనే తపనతో సీఎం పథకాలను ప్రవేశపెట్టారు.
-ఆనాడు వై.యస్.ఆర్ మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారు. నేడు సీఎం జగన్ చేసి చూపించారు..
-మహిళల పేరు మీద ఇళ్ల పట్టాల కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. ఇంటి నిర్మాణం కోసం రుణం కూడా ఇస్తోంది ఈ ప్రభుత్వం.
-అమ్మవడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ప్రతి పథకం లోనూ సీఎం మహిళలను భాగస్వామ్యం చేసారు.
-సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలా పక్షపాతి అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.
Amaravati updates: కోవిడ్ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష..
అమరావతి..
సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
-కోవిడ్ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
-హాజరైన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య,ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు.