Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59
ఈరోజు తాజా వార్తలు
తిరుపతి ...
చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి...ప్రభుత్వ విప్
-దేవుడ్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు దరిద్రులు....
-దేవుడే లేదన్న డిఎమ్‌కె పార్టీని...
-అత్యంత భక్తి గల తమిళలు గెలిపించడం లేదా....
-శ్రీవారి దర్శనం తరువాతే పాదయాత్ర ను జగన్ ప్రారంబించారు... పాదయాత్ర ముగింపు తరువాత తిరుమలకు వచ్చారు...
-మిరాశీ వ్యవస్థను చట్టం చేసిన ఘనత జగన్ ది..
-జంధ్యం వేసుకోని బ్రహ్మణుడు లాంటి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి...
-వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో పదిశాతం కూడా చంద్రబాబు లేదు...
-వై వి సుబ్బారెడ్డి పై నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్... చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం...
-శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితిల్లో ప్రభుత్వం వదిలి పెట్టాదు...
-తప్పుచేసిన వారిపై చర్యలు ఉంటాయ్
అమరావతి..
-భావనపాడు పోర్టు నిర్మాణం, భూ సేకరణ, ఆర్&ఆర్ ప్యాకేజ్, ఇళ్ల స్థలాల పంపిణీ, పరిహారం పెంపు కు సంబంధించి అంశాలపై ప్రధానంగా చర్చ.
-పశుసంవర్ధక శాఖ కు సంబంధించి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు గురించి, సంస్థాగతంగా అవసరాన్ని బట్టి పశువైద్యుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై సీఎంతో చర్చించిన మంత్రి..
విశాఖ..
బిజేపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్
-నివాసం వద్ద ప్రభుత్వ తీరుకు ఖండన.
-బిజేపి ఏపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కామెంట్స్.
-రాష్ట్రంలో అరచాకపాలన సాగుతోంది.
-హిందువుల మనోభావాలను జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది.
-దేవాలయ ఆస్ధులు, భూములు కొల్లగొట్టాలని చూస్తే పరాభవం తప్పదు.
-గృహనిర్భంధాలు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదు.
-జగన్ ప్రభుత్వం మూడున్నరేళ్లు కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు.
-ప్రశ్నిస్తే గొంతునొక్కే దోరణి ఆట్టేకాలం సాగదు.
అమరావతి...
అంబటి రాంబాబు...వైసీపీ ఎమ్మెల్యే
-ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన లేజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషీయర్, మీడియా తమ తమ విధులను సక్రమంగా నిర్వహించడం వలనే ప్రజాస్వామ్యం విజయం సాధించింది.
-రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఎవరికి ఏ హక్కులు ఉన్నాయో తెలుస్తుంది.
-న్యాయవ్యవస్థకు రాజ్యాంగ పరిధిలోనే పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి.
-రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించడం సబబు కాదు.
-చంద్రబాబు అక్రమాస్తుల కేసు పెండింగ్ లో ఉంది
-సుమారుగా 15 సంవత్సరాల పాటు స్టేలో ఉండిపోయింది, విచారణకు రావట్లేదు
-చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి, ఆ స్టే లు అన్ని పోయి విచారణ జరగాలి
-ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు
-ఈ కేసును కూడా త్వరితగతిన విచారణ జరపాల్సిన అవసరం ఉంది
-మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అని డబ్బులిస్తూ దొరికిపోయిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు
-అమరావతి కుంభకోణం చాలా పెద్దది.
-చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇందులో ప్రమేయం ఉంది
-దీనిమీద సత్వరమే విచారణ జరిపి నిగ్గుతేల్చాలి
-భారతదేశంలో అతి పవిత్రమైనది న్యాయవ్యవస్థ..న్యాయవ్యవస్థపై మాకు అపారమైన విశ్వాసం ఉంది
అమరావతి..
- కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్..
కృష్ణా జిల్లా..
-నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
తూర్పుగోదావరి జిల్లా..
-రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం
-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలిలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.
అమరావతి..
- ఐవీఆర్‌ఎస్ ప్రశ్నల్లో మరింత స్పష్టత రావాలి
- వైద్య సేవలు, శానిటేషన్‌పై ప్రశ్నలు మారాలి
- హోం ఐసొలేషన్‌లో ఉన్న వారందరికీ కిట్లు అందాలి
- కోవిడ్–19, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి సమీక్ష
- అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి
- ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంపు
- సాధారణ కాన్పుకు రూ.5 వేలు. సిజేరియన్‌కు రూ.3 వేలు
- అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు
- ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలి
- ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పూర్తి సదుపాయాలు ఉండాలి
- జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి
- మరింత సమగ్ర సమాచారంతో ఆరోగ్యశ్రీ క్యూఆర్ కోడ్ కార్డులు
కృష్ణా జిల్లా..
గుడివాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి..
*వైసిపి ప్రభుత్వం,బిజెపి తో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం ఆడి నట్లే
*రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి,జగన్ ప్రభుత్వం పోలీస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది
*అడగకుండానే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు అన్నింటిపై సీబీఐ విచారణ జరపాలి
*నన్ను అరెస్ట్ చేసి నా వ్యక్తి గత స్వేచ్ఛను హరించిన పోలీసులపై,భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను
తిరుమల :
-వైవీ సుబ్బారెడ్డి, టిటిడి చైర్మన్:
-టిటిడిలో ఉన్న దళారి వ్యవస్ధను, అవినీతిని పూర్తిగా నిర్మూలించాం..
-స్వామివారి డబ్బు దుర్వినియోగం కాకుండా చూస్తున్నాం..
-గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు చరిత్రలో ఎన్నడూ జరగలేదు..
-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేదు..
తిరుమల :
-వేణుగోపాల్ దీక్షితులు.., ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా దారులు
-ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపం బ్రహ్మోత్సవ వేదిక..
-స్వర్ణ రధం, స్వర్ణ రధం బదులుగా ఏకాంతంగా సర్వ భూపాలవాహనం స్వామి వారిని కొలువు దీరుస్తాం..
-ప్రతి ఏడాది తిరువీధి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..
-కరోనా ప్రభావంతో ఈ ఏడాది బలి పీఠం వద్ద అష్టదిక్కపాలకులను ఆహ్వానిస్తాం..
తిరుమల :
-వైవీ సుబ్బారెడ్డి.., టీటీడీ పాలకమండలి చైర్మన్
-19 నుండి 27 వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం..
-ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ..
-రేపు ధ్వజారోహణ కార్యక్రమం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
-రాష్ట్ర ప్రభుత్వం తరపున 23 వ తారీఖున సీఎం పట్టువస్త్రాలు..
-ఈ ఏడాది కరోనా కు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం..
-ఏకాంతంగా ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం..
-మహారధం,స్వర్ణ రధం బదులుగా సర్వభూపాల వాహనం పై స్వామివారికి వాహన సేవ నిర్వహిస్తాం..
-24వ తేదీ శ్రీవారిని దర్శించుకొని నాద నీరాజనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు..
-కర్ణాటక సత్రం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గోని తిరుగు ప్రయాణం అవుతారు..
-రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతోనే స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం