Nagarkurnool updates: సుధాకర్ రావు అరెస్ట్ కు నిరసనగా ఆందోళన!
నాగర్ కర్నూల్ జిల్లా :
-కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు అరెస్ట్ కు నిరసనగా ఆందోళన చేపట్టి..
-ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు.
- టి ఆర్ ఎస్ కె జై కొట్టిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు...
- సీఎం కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుతాడు..తెలంగాణ ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ పై నమ్మకం ..విశ్వాసం మాకు ఉంది..
సస్పెండ్ చేసిన ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది..సానుకూలంగా ఉంటుంది అనే నమ్మకమ్ మాకు ఉంది..
- కేసీఆర్ కోపం కొంతనే.. కానీ మా పై ప్రేమ కొండంత...
- దుబ్బాక లో టి ఆర్ ఎస్ అభ్యర్థి కి స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించిన ఉపాది హామీ ఫీల్డ్ అసిస్టెంట్...
బ్రేకింగ్...
కీసర్ ఎమ్మార్వో నాగరాజు చివరిసారి వీడియో కాల్
చివరి సారిగా చనిపోడానికి ముందు కుటుబంతో వీడియో కాల్ మాట్లాడిన నాగరాజు
రెండవ కేసులో ఏసీబీ కస్టడికి తీసుకోడానికి ముందు కేసు విషయంలో సంభాషణలు
నేను ఏతప్పు చేయలేదు ప్రాపర్ గానే ఉన్నాయి అని చెపుతున్న నాగరాజు
అవన్ని రికార్డ్స్ పరిశీలించే చేశామన్న నాగరాజు
ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావు వెరిఫై చేసే చేశామన్న ఎమ్మార్వో
న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని కుటుంబానికి విన్నపం
బెయిల్ పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దాం అని కుటుంబ సభ్యులు హితవు...
కరీంనగర్ జిల్లా//
కరీంనగర్ జిల్లా లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ముఠాను పట్టుకున్న వీణవంక పోలీసులు
వీణవంక మండలంలో 9,39,800 రూపాయల విలువ గలా నిషేధిత గుట్కా ప్యాకేట్స్ పట్టుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుండి రెండు కార్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు పరారీలో మరో ఇద్దరు
గుట్కా ముఠాను పట్టుకున్న పోలీస్ లను అభినందించిన హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస రావు
ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
#ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
#అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లకు దృశ్యమాధ్యమం ద్వారా సీఎస్ దిశానిర్దేశం చేస్తున్నారు.
#ఈనెల 25 విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
#ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ ఏ మేరకు పూర్తయిందనే అంశాలపై దృష్టిసారించారు.
# ఎదురవుతున్న ఇబ్బందులు.. అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
#ఆస్తుల నమోదుకు ఇంకా నాలుగు రోజుల గడువే ఉండగా.. భారీ వర్షాల వల్ల కొంతమేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
#రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ 70శాతం వరకు పూర్తవగా.. జీహెచ్ఎంసీ పరిధిలో నెమ్మదించింది.
# ఇప్పటివరకు 75 లక్షలకుపైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు.
#రోజుకు 6లక్షలకుపైగా ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు.
#ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తహసీల్దార్లకు 3రోజుల క్రితమే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. భారీ వర్షాల వల్ల వాయిదా పడింది.
#ఈ అంశాలన్నింటిపై పరిష్కారానికి సీఎస్ సోమేష్‌కుమార్ దృష్టిసారించారు.
హైదరాబాద్
ఉప్పల్ లోని రవీంద్ర నగర్ కాలనిలో అధికారులకు వరద ముంపు బాధితులకు వాగ్వాదం...
నాలుగు రోజులుగా ఏ అధికారి రాలేదని ఇప్పుడు ఫొటోలకు పోజులు ఇస్తూ వస్తున్నారని స్థానికుల ఆగ్రహం...
నగరంలో ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసిన హృదయ విధారక సంఘటనలే...
నాలుగు రోజుల తర్వాత నీరు తొడిన తరువాత పై నుండి కిందకి వచ్చిన తర్వాత కట్టు బట్టలు తప్ప ఏమి మిగలేదు...
నిత్యవసర వస్తువులు ఇవ్వడానికి వచ్చిన అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం...
నిత్యవసర వస్తువులు బట్టలు,ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కొట్టుకుపోవడం తో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు..
ఈ నాలుగు రోజులు చిన్న పిల్లలకు పాలు లేక,తాగడానికి నీరు లేక ,తినడానికి తిండి లేక పస్థులున్నామని ముంపు బాధితుల ఆవేదన...
- సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ ముబారస్ పూర్ ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు కామెంట్స్....
- దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాత ఇందులో అలాంటి అనుమానం లేదు.
- కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఢిల్లీలో, గల్లిలో ఏమీలేదు .
-/ 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, తెదేపా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదు.
- దేశంలో, కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా బీడీల పెన్షన్లు ఇవ్వడం లేదు.
- కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లా దొంగ రాత్రి కరెంట్ వస్తది.
- కాంగ్రెస్ ఉన్నపుడు కటెంటు ఇవ్వక రైతులను ఇబ్బందులు పెడితే నేడు భాజపా మీటర్లు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది.
- కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది.
- వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు ఓట్లు వచ్చినపుడు కాంగ్రెస్, భాజపా నాయకులు వచ్చి పోతారు.
- ప్రజలకు అందుబాటులో ఉంది సేవ చేస్తోంది తెరసనే .
- సమైఖ్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వలు భూమి సిస్సు వసూలు చేస్తే నేడు రైతుకు పెట్టుబడి సాయం చేసున్న ప్రభుత్వం తెరసనే
- కాంగ్రెస్, భాజపా ఎండమావులు అంటి వే వారి వెంటపొతే ఏమి రాదు.
- ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసున్న తెశర కే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలంతా ఓటు వేసి గెలిపంచాలి.
దసరా పండగ రోజున ధరణి సైట్ సీఎం కేసీఆర్ ప్రారంభినచనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ లు,అడిషనల్ కలెక్టర్ లు,తహశీల్దార్ లతో సచివాలయం నుండి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
నాలుగో రోజు వరుసగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించిన కేటీఆర్
రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను అందించిన మంత్రి కేటీఆర్. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏంపిలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ లు
వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరం.... ప్రాణ నష్టం అరీకట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుంది
పారిశుద్ధ్యం పైన ప్రధాన దృష్టి సారించి పని చేయాలని
ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచన
రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద ఉన్న అప్ప చెరువు ని పరిశీలించిన మంత్రి కేటీఆర్
మొన్నటి భారీ వర్షాలకు అప్ప చెరువు తెగి పెద్ద ఎత్తున జనావాసాల వరదకు కారణమై న అప్ప చెరువు
సాగునీటి శాఖ తో సమన్వయం చేసుకొని వెంటనే చెరువుకట్ట కు తగిన మరమ్మతులు చేయాలని సూచించిన మంత్రి
చెరువు లో వెలసిన ఆక్రమణలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారుల కి ఆదేశం
#జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత
#వరదల కారణంగా సర్వేను వాయిదా వేస్తున్నట్లు అధికారులు