నాలుగో రోజు వరుసగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నాలుగో రోజు వరుసగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించిన కేటీఆర్
రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను అందించిన మంత్రి కేటీఆర్. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏంపిలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ లు
వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరం.... ప్రాణ నష్టం అరీకట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుంది
పారిశుద్ధ్యం పైన ప్రధాన దృష్టి సారించి పని చేయాలని
ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచన
రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద ఉన్న అప్ప చెరువు ని పరిశీలించిన మంత్రి కేటీఆర్
మొన్నటి భారీ వర్షాలకు అప్ప చెరువు తెగి పెద్ద ఎత్తున జనావాసాల వరదకు కారణమై న అప్ప చెరువు
సాగునీటి శాఖ తో సమన్వయం చేసుకొని వెంటనే చెరువుకట్ట కు తగిన మరమ్మతులు చేయాలని సూచించిన మంత్రి
చెరువు లో వెలసిన ఆక్రమణలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారుల కి ఆదేశం