Nagarkurnool updates: నీట మునిగిన పంప్ హౌస్ మోటర్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
నాగర్ కర్నూలు జిల్లా :
-కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద కెఎల్ఐ లో నీట మునిగిన పంప్ హౌస్ మోటర్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి.
-మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ :
-డీ వాటరింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
-మోటర్ సాఫ్ట్ సీల్ పోవడంతో ఘటన చోటుచేసుకుంది.. ఇది చిన్న సమస్య.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-కంట్రోల్ ప్యానెల్ ఏం కాలేదు. ఇంజనీరింగ్ అధికారులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
-ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి ఉంది.. రైతు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది.
-త్రాగునీటి కోసం ప్రజల అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం.
-అధికారులకు ప్రభుత్వానికి సహకరించాలి.. వీలైనంత తొందరలో మోటర్లు ప్రారంభిస్తాం.
-వారం రోజుల్లో ఒక మోటర్ ప్రారంభిస్తాం.. ప్రతిపక్షాలు రైతుల ఆత్మస్థైర్యం కోల్పోయే విదంగా గందరగోళం చేయొద్దు.
Hyderabad updates: మలక్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో తృటిలో తప్పిన ప్రమాదం...
-కారులో నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు...
-కారు నుండి బయటపడ్డ నలుగురు వ్యక్తులు.
-చూస్తుండగానే పూర్తిగా కాలిపోయిన కారు
-అసలే వర్షం అగ్నిప్రమాదంతో భారీగా స్తంభించిన ట్రాఫిక్.
Sangareddy updates: ఆనంద్ ఘటన స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ...
సంగారెడ్డి జిల్లా..
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుక బావి కాలువలో గత నాలుగు రోజుల క్రితం కార్ లో కొట్టుక పోయిన ఆనంద్ ఘటన స్థలాన్ని పరిశీలించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ.
L. రమణ కామెంట్స్..
-ఇది అత్యంత దయనీయమైన భాదకర దుర్ఘటన..
-ఈలాంటి దుర్ఘటనకు తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట...
-సరైన సమయంలో చర్యలు చేపట్టక పోవడం ఈ దుర్ఘటన కు కారణం.
-కాలువకు ఎలాంటి సైడ్ వాల్ నిర్మాణము, సూచిక బోర్డులు లేక పోవడం ప్రభుత్వం నిర్లక్ష్యం.
-రాష్ట్ర ప్రభత్వము కమీషన్ లకు కక్కుర్తిపడి వాటికి నిధులు కేటాయించే కుంటు తమ పొట్ట గడుపుకుంటునరే తప్ప ప్రజల అవసరాలు పట్టించుకోవడం లేదు
Telanagana Latest news: విమలక్కని కలిసి MLC ఎన్నికల్లో మద్దతు కోరిన: డా. చెరుకు సుధాకర్ , నాయకులు...
-భారత మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ( ఐక్య)
-MCPI(U) రాష్ట్ర నాయకత్వంని మర్యాదపూర్వకంగా కలిసి నల్గొండ , వరంగల్ , ఖమ్మం MLC ఎన్నికల్లో
-మద్దతు కోరిన డా., చెరుకు సుధాకర్ , నాయకులు
-సానుకూలంగా స్పందించిన MCPI(U) నాయకులు...
-అరుణోదయ విప్లవ కళాకారుల సంఘము
-విమలక్కని కలిసి MLC ఎన్నికల్లో మద్దతు కోరిన
-డా., చెరుకు సుధాకర్ , నాయకులు...
Hyderabad Latest news: హైదరాబాద్ నగరంలో సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్యలు -మంత్రి కె.టి.ఆర్..
హైదరాబాద్..
-జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన మంత్రి
-వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి వారి ఇంటి వద్దకే సిఎం రిలీఫ్ కిట్‌ను అందజేయాలి
-సిఎం రిలీఫ్ కిట్‌లో రూ. 2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు
Hyderabad rain updates: వర్షం మళ్ళీ మొదలైంది!
హైదరాబాద్..
-మాదాపూర్,గచ్చిబౌలి, లింగంపల్లి, షేక్పేట్, టోలిచౌకి లో భారీ వర్షం....
-గత కొద్ది రోజులుగా కురిసి ఆగిపోయిన వర్షం మళ్ళీ మొదలైంది..
-మాదాపూర్ తో పాటు గచ్చిబౌలి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నదులను తలపిస్తున్నాయి....
-వాహనాలు ఎక్కడికక్కడే రోడ్ల పై నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది
Nagarjuna Sagar Dam updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..
నల్లగొండ జిల్లా:-
-18క్రస్టుగేట్లు.. ఎత్తి నీటిని దిగువకు విడుదల.
-ఇన్ ఫ్లో 539930 క్యూసెక్కులు..
-అవుట్ ఫ్లో :539930 క్యూసెక్కులు ..
-ప్రస్తుతం నీటి నిల్వ: 309.9534
-మొత్తం 312 టీఎంసీలు.
-నీటిమట్టం: 589.30 /590 అడుగులు.
Mahabubabad district updates: గుడూరు మండలం లో సారాయి కేసు నమోదు!
మహబూబాబాద్ జిల్లా...
-గుడూరు మండలం ఎర్రకుంటా తండాలో పోలీసులు
-మరియు ఆబ్కారీశాఖ ఏక కాలంలో దాడులు నిర్వహించగా తాండలో 600 లీటర్ల బెల్లం పానకం,
-20 లీటర్ల కాచిన సారాయి ని స్వాధీనం చేసుకొని నింధితుల పై కేసు నమోదు చేసిన పోలీసులు...
Warangal urban district updates: ఆలయానికి చేరుకున్న అమ్మవారి ఆభరణాలు...
వరంగల్ అర్బన్...
-వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా భద్రకాళి ఆలయానికి చేరుకున్న అమ్మవారి ఆభరణాలు...
-ఉత్సవాల అనంతరం ఆంద్రాబ్యాంక్ లాకర్ లో పొందుపరుస్తారు.
Narketpally updates: కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన!
నల్గొండ :
నార్కెట్ పల్లి...
-అద్దంకి హైవేపై గంటకు పైగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన..
-ఇరు వైపులా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
-జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ పట్టుబడుతున్న రైతులు.