Tirumala Updates: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్న శివరాజ్ సింగ్ చౌహాన్...
తిరుమల..
* ఇవాళ సాయంత్రం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
* రేపు ఉదయం కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకుంటారు.
Visakha Updates: నర్సిపట్నంలో ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు...
విశాఖ...
* మైనింగ్ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.
* తెలుగు దేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు..
* సోమవారమే ఇంటి నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి అయ్యన్న.
* కార్యక్రమానికి వెళుతున్న మరో పదిమంది తెలుగు దేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Tirumala Updates: మాడవీధుల్లో ఊరేగనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి...
తిరుమల...
* రేపు నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనంపై
* ఈనెల 21న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
* 20న పుష్ప యాగానికి అంకురార్పణ, సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసిన టీటీడీ
Andhra Pradesh Updates: నేడు ఏపీకి రానున్న పవన్ కళ్యాణ్..
ఆంధ్రప్రదేశ్...
- దాదాపు 8 నెలల తరువాత వస్తున్న పవన్..
- రెండు రోజుల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొననున్న పవన్..
- 11 గంటలకు ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు, అనంతరం నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం..
- మధ్యాహ్నం 3 గంటలకు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూర్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం..
- రేపు ఉదయం అమరావతి పోరాట సమితి మహిళా నేతలతో పవన్ సమావేశం..
Visakha Updates: అనకాపల్లీలో టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చెస్తున్న పోలీసులు..
విశాఖ...
- ప్రభుత్వ ఇసుక పాలసీలో అక్రమాలను నిరసనగా అనకాపల్లీ అడిషనల్ డైరెక్టర్ మైనింగ్ ఆఫీసు ముట్టడికి టీడీపీ పిలుపు
- ముందస్తుగా నర్సీపట్నం, అనకాపల్లీలో టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చెస్తున్న పోలీసులు
- అనకాపల్లీలో ఎమ్మేల్సీ బుద్దా నాగజగదీశ్వరావును హౌస్ అరెస్టు చెసిన పోలీసులు
Anantapur Updates: కర్ణాటక సరిహద్దు లో నేటి నుంచి పిల్లర్లను నాటనున్న అధికారులు...
అనంతపురం:
- మొత్తం 76 పిల్లర్లను నాటాలని గుర్తించిన అధికారులు.
- 200 మీటర్ల కు ఓ పిల్లర్. 15 కిలోమీటర్లు సరిహద్దు గుర్తింపు.
- సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని రోజులు గా కొనసాగుతున్న సరిహద్దు సర్వే.
- పిల్లర్లు నాటడం తో సరిహద్దు వివాదానికి చెక్.
- సరిహద్దు ఏర్పాటు తో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగే అవకాశం.
Somashila Project Updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 15.166 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 18.704 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 76.281 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు
Kakinada Updates: సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ..
తూర్పుగోదావరి జిల్లా
కాకినాడ
కత్తులతో దాడి ఇద్దరికి గాయాలు
సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ హత్యాయత్నానికి దారితీసింది.
బొమ్మిడి రాంబాబు 44,బొమ్మిడి చక్రధర్ 18 అను ఇద్దరు వ్యక్తులుఆరేటి సుబ్రహ్మణ్యం21,జ్యోతుల సుబ్రహ్మణ్యం లను కత్తులతో దాడి చేయగా ఇరువురు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారని కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నామని తిమ్మాపురం ఎస్ఐ విజయ్ బాబు తెలిపారు.
Anantapur Updates: తుంగభద్ర హెచ్ ఎల్ సి కి అదనపు జలాల కేటాయింపు...
అనంతపురం:
-- మొత్తం 168 టీఎంసీల లభ్యత.
-- కర్ణాటక కు 110.143, ఏపీకి 52.698, తెలంగాణకు 5.159 టీఎంసీల కేటాయింపు.
-- ఏపీకి చెందిన 52.689 టీఎంసీల లో 25.755 టిఎంసిలు హెచ్ ఎల్ సి కి, ఎల్ ఎల్ సికి 19.019, కేసీ కెనాల్ కి 7.9 24 టిఎంసిలు కేటాయింపు
-- గతంలో నీటి లభ్యత 163 టిఎంసిలు ఉంటుందని అంచనా
-- తాజాగా 168 టీఎంసీలు లభ్యమైనట్లు నిర్ధారణ.
-- హెచ్ ఎల్ సికి అదనంగా 0.767 టీఎంసీలు కేటాయింపు
Krishna District Updates: విజయవాడ కొండపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం...
// *కొండపల్లి లో అగ్నిప్రమాదం, సుమారు 40 లక్షలు ఆస్థి నష్టం*
// అర్ధరాత్రి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేబుల్ ఆఫీస్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయి
// సుమారు రెండు గంటల సమయం మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి
// ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు
// నాలుగు ఫైరింజన్లు తో మూడు గంటలపాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది....
// మూడు గంటల పాటు అదుపులోకి రాని మంటలు....
// విలువైన కేబుల్ వైర్ లు, సెటప్ బాక్స్ లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ,పూర్తిగా దగ్ధం....
// సుమారు 40 లక్షల వరకు ఆస్తి నష్టం అని తెలిపిన సిటీ కేబుల్ యజమాని .....
// అర్ధరాత్రి సమయం కావడంతో ... కార్యాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం .....