Live Updates: ఈరోజు (17 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 నవంబర్ , 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-17 01:31 GMT

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-11-17 05:32 GMT

  విశాఖ

- ఇంటికి సిరియల్ ల్తెటింగ్ వేస్తుండగా కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి.

- ఉప్పకాలనీకి చెందినవాడిగా గుర్తింపు.

- మల్కాపురం పోలీసులు కేసు నమోదు.

2020-11-17 05:30 GMT

  అమరావతి :

-నేటినుంచి తిరిగి ప్రారంభం కానున్న హైకోర్టు

-అమరావతి రాజధాని అంశంపై రోజువారీ విచారణ

-ప్రత్యక్ష, హైబ్రిడ్ పద్ధతుల్లో విచారణ చేపట్టనున్న త్రిసభ్య ధర్మాసనం

-విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై జరగనున్న విచారణ

2020-11-17 05:29 GMT

  విశాఖ

-టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కామెంట్స్

-న్యాయస్థానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడిన వారిపై సిబిఐ కేసులు నమోదు చేయడం చూస్తే ప్రజాస్వామ్యం బతుకు ఉన్నట్టే లెక్క

-విజయసాయిరెడ్డి విశాఖ లో ఉంటూ గోడల పగలగొట్టే పనిచేస్తున్నారు

-నర్సీపట్నం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై అధికారులు దృష్టి సారించాలి

-గ్రూప్ హౌసింగ్ లబ్ధిదారులకు రుణ మాఫీ చేస్తాం అని సీఎం వైఎస్ జగన్ మాట తప్పారు..

2020-11-17 05:16 GMT

 నెల్లూరు:

* ఇద్దరు యువతులు, ముగ్గురు పిల్లలు అదృశ్యం...

* వెంకటగిరి మండలం జికె పల్లి గ్రామములో నిన్న మధ్యాహ్నం పిల్లల ముగ్గురికి ఆరోగ్యం బాగోలేదు అని వెంకటగిరి హాస్పిటల్ కి వెళ్లాలని ఆటో ఎక్కినట్లు    సమాచారం..

* నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి దొరకని వారి ఆచూకీ..

* వారి కోసం పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం..

2020-11-17 04:37 GMT

  గుంటూరు....

* 4020 మద్యం బాటిళ్లు స్వాధీనం

* గోవా నుంచి శావల్యపురం అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు

* ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

2020-11-17 04:24 GMT

  సీబీఐ కోర్టు....

- సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను వేరుగా విచారణ జరపలన్న అంశం పై నేడు విచారణ చేయున్న సీబీఐ కోర్ట్ ...

- జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల్లో రెండో నిందితుడు విజయ్ సాయి రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్...

- నేడు పిటిషన్ పై విచారించనున్న సీబీఐ కోర్టు...

2020-11-17 04:21 GMT

  అమరావతి..

- మరికాసేపట్లో పోలవరం చేరుకోనున్న మంత్రి అనిల్ కుమార్..

- పోలవరం నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి.

- అనంతరం ప్రాజెక్ట్ పురోగతి ఆర్&ఆర్ ప్యాకేజిపై అధికారులతో సమీక్ష చేయనున్న మంత్రి.

2020-11-17 04:11 GMT

 విజయవాడ...

 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-లబ్ధిదారులకు టిడ్ కో ఇళ్లు కేటాయించి, సంక్రాంతి పండుగైనా ఆ ఇళ్లలో జరుపుకునేలా చూడండి.

-లక్షలాది ఇళ్ల నిర్మాణం 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయింది.

-మరికొన్ని ఇళ్లకు విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించి, తుది మెరుగులు దిద్దాల్సి ఉంది.

-సిపిఐ చేపట్టిన టిడ్ కో ఇళ్ల పోరాటంతో మున్సిపల్ కమిషనర్లు ఇళ్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు.

-తక్షణమే లబ్ధిదారులకు ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికైనా చర్యలు చేపట్టగలరు.

2020-11-17 04:08 GMT

 అమరావతి...

- ఉదయం 11గంటలకు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం

- 2019 ఖరీఫ్ లో లక్షలోపు రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పథకం వర్తింపు

- 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్లకు పైగా జమ చేయనున్న ప్రభుత్వం

- అక్టోబరులో దెబ్బతిన్న పంటలకూ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయనున్న సీఎం

- నెల రోజు ల్లోపే 132 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

- ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటి వరకు పూర్తి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు

2020-11-17 04:04 GMT

  అమరావతి..

- ఫైనల్ ఎస్‍ఎస్‍ఆర్ ప్రకారం జాబితా ప్రకటన

- వచ్చే ఏడాది నవంబర్ 16 నాటికి 4,01,45,674 మంది ఓటర్లు

- పురుషులు 1,98,56,355,

- మహిళలు 2,02,85,236,

- థర్డ్ జండర్ 4,083

- ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు పంపాల్సిందిగా కోరిన ఈసీ

- డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు వెల్లడి

- 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా సిద్ధమవుతుందన్న ఈసీ

Tags:    

Similar News