Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-16 01:38 GMT
Live Updates - Page 2
2020-09-16 09:34 GMT

Sravani Case Updates: అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు..

శ్రావణి కేసు అప్డేట్..

-విచారణ అనంతరం ఆన్ లైన్ లో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి రిమాండ్ తరలించనున్న పోలీసులు..

-శ్రావణి ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది..??

-శ్రావణి తో ఉన్న పరిచయం ఏంటి..??

-సాయి కృష్ణ రెడ్డి తో కలిసి శ్రావణిని ఏం బెదిరించారు..??

-శ్రావణి ని వివాహం చేసుకుంటానని ఆ తరువాత సాయి రెడ్డి తో కలిసి ఎందుకు వేధించారు..??

-అనేక ప్రశ్నలకు సమాధానం రాబడుతున్న ఎస్సార్ నగర్ పోలీసులు....

2020-09-16 09:20 GMT

Nagarjuna Sagar Project Updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి పెరిగిన వరద..

నల్గొండ :

-14 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

-ఇన్ ఫ్లో :3,31,106 క్యూసెక్కులు.

-అవుట్ ఫ్లో :2,48,106 క్యూసెక్కులు.

-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

-ప్రస్తుత నీటి నిల్వ : 311.4474 టీఎంసీలు.

-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

-ప్రస్తుత నీటిమట్టం: 589.80అడుగులు

2020-09-16 09:01 GMT

Ramchander Rao Comments: విద్యుత్ చట్టం కేవలం సవరణ మాత్రమే..బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు..

గన్ పార్కు వద్ద బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు..

-తెలంగాణ ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తీసుకు వచ్చింది

-12 రాష్ట్రాలు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నాయి

-తెరాస ప్రభుత్వం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుంది

-43వేల కోట్ల రుణాన్ని విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు కేంద్రం విడుదల చేసింది

-పర్యావరణాన్ని రక్షించేందుకే ఈ చట్టం తీసుకువచ్చారు... దింట్లో తప్పేముంది

-వేలాది మెగావాట్ల విద్యుత్ చోరీకి గురవుతుంది... దీనిని నియంత్రించెందుకే ఈ చట్టం

-విద్యుత్ సవరణ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్చ సరైంది కాదు

-తెరాసకు చట్టంపై అభ్యంతరం ఉంటే పార్లమెంటులో మాట్లాడొచ్చు

-రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తో..రైతులను పక్కదారి పట్టిస్తోంది

-తెలంగాణ రైతులకు భాజపా అండగా ఉంటుంది

-విద్యుత్ సవరణ చట్టంపై మండలిలో చర్చకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశా

2020-09-16 08:54 GMT

Gun Park-Hyderabad: అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు...మాజీ ఎంపీ వి.హన్మంతరావు..

గన్ పార్క్ నుండి మాజీ ఎంపీ వి.హన్మంతరావు..

-అసెంబ్లీ సమావేశాలు 28 రోజులు జరుగుతాయని ఈ రోజే అసెంబ్లీ సమావేశాలు ముగియనుండడం చాలా బాధాకరం...

-అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి..

-అకస్మాత్తుగా అసెంబ్లీ సమావేశాన్ని ముగించడం వెనుక మతలబేంటి..

-సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కి సమయం కేటాయించలేదు ..

-నూతన రెవెన్యూ చట్టం ఆచరణలో ఎంత ఉంటున్నది రాబోయే రోజుల్లో చూడాలి..

-ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన ఉంటారు వారికి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇవ్వాలి..

-బిల్లులు పాస్ చేయడం కోసమే అసెంబ్లీ పెట్టారు ప్రజా సమస్యలను చర్చించడానికి కాదు..

-ప్రభుత్వం కరోనా కట్టడి లో పూర్తిగా విఫలమైంది..

-నిరుద్యోగ సమస్యను రూపుమాపడంలో ప్రభుత్వం విఫలమైంది..

2020-09-16 08:28 GMT

T. Harish Rao Comments: సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు : మంత్రి హరీశ్‌ రావు..

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు దుబ్బాక పర్యటన - కామెంట్స్

-దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటా

-దుబ్బాక అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా

-సిద్దిపేట తరహాలో దుబ్బాక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

-దుబ్బాక మహిళల త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాo

-త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపుతాo

-దుబ్బాక నియోజకవర్గం లో లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తాo

-దుబ్బాక అంటే ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం

-దుబ్బాక అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు.

2020-09-16 08:21 GMT

TS Assembly: అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేసిన ప్రైవేటు టీచర్లు...

అసెంబ్లీ..

-ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ అసెంబ్లీని ముట్టడించిన ప్రైవేటు టీచర్లు..

-ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ నినాదాలు చేసిన ప్రైవేట్ టీచర్లు.

-మాకు ఆరు నెలల నుండి యాజమాన్యాల నుండి రావాల్సిన జీతాలు చెల్లించేలా సీఎం కెసిఆర్ చొరవ తీసుకోవాలి అంటూ నినాదాలు .

-నల్గొండ జగిత్యాలకు జిల్లాలకు సంబంధించిన ప్రైవేటు టీచర్లు అసెంబ్లీ నీ ముట్టడికి ప్రయత్నం చేశారు.

-మూడు లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లు నిరుద్యోగులుగా మారిపోయారు మమ్మల్ని ఆదుకోవాలంటూ నినాదాలు.

-సీసీఎస్ ముందు అరెస్టు చేసిన. పోలీసులు.

2020-09-16 07:08 GMT

Telangana updates: పార్టీకి తొలి రోజుల నుంచి పనిచేసిన వ్యక్తి సుదర్శన్ రావు..కేటీఆర్..

-కేటీఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి..

-టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూకట్పల్లికి చెందిన

-యం. సుదర్శన్ రావు ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

-ఆయనతో తనకు వ్యక్తిగతంగా సుమారు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది.

-ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేటియార్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

2020-09-16 06:42 GMT

Telangana Legislative Assembly updates: అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి...

-రాష్ట్రంలో యూరియా కొరత లేదు..

-ఎక్కడైనా యూరియా కొరత ఉన్నట్లు ఫిర్యాదు చేస్తే..ఫిర్యాదు చేసిన 6 గంటల్లో యూరియా సరఫరా చేస్తాం..

-కరోనా కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తే...అభినందించాల్సింది పోయి..విమర్శించడం సరైంది కాదు..

2020-09-16 06:38 GMT

Chinna Jeeyar Swamy: చిన‌జీయర్ స్వామిని పరామర్శించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..

-ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన‌జీయర్ స్వామిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పరామర్శించారు.

-బుధ‌వారం శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ఆశ్రమంలో చినజీయర్‌ స్వామిని క‌లిసి మంత్రి తన సానుభూతిని, సంతాపాన్ని తెలియ‌జేశారు.

2020-09-16 06:36 GMT

Legislative Council updates: మున్సిపాలిటీ లో త్వరలోనే వార్డు ఆఫీసర్‌ నియామకాలు చేపడుతాం..మంత్రి కేటిఆర్..

శాసనమండలి లో మంత్రి కేటిఆర్..

-మొదటి మూడు సంవత్సరాలు ప్రొబేషనరీ కాల పరిమితి ఉంటుంది

-వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడ నిర్మిస్తాము అక్కడ కార్పరేటర్ మరియు వార్డు ఆఫీసర్ కలిసి పని చేస్తారు..

Tags:    

Similar News