Nalgonda district updates: చిట్యాల (మం)పేరేపల్లి గ్రామంలో అర్ధరాత్రి అలజడి..
నల్గొండ :
-ఎంపీపీ సునీత వెంకటేష్ ,సర్పంచ్ వర్గాల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు...
-9 మందిని పట్టుకుని పోలీసులకు అప్పగింత.పరారీలో మరో ఆరుగురు.
-పాతకక్షలే కారణమని అనుమానం.
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద...17 గేట్లు ఎత్తివేత..
మహబూబ్ నగర్ జిల్లా :
-ఇన్ ఫ్లో: 1,46,000 వేల క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 1,61,439 వేల క్యూసెక్కులు.
-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: : 9.657 టీఎంసీ.
-ప్రస్తుత నీట్టి నిల్వ: : 9.357 టీఎంసీ.
-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
-ప్రస్తుత నీటి మట్టం: 318.370 మీ.
sravani case updetes: శ్రావణి కేసు లో ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు..
-సోమవారం ఎస్ ఆర్ నగర్ పోలీసుల ముందు విచారణకు వస్త అని మస్కా కొట్టిన అశోక్ రెడ్డి..
-శ్రావణి ఆత్మ హత్య కేసులో కీలక నిందితుడిగా అశోక్ రెడ్డి ..
-సినిమా లో అవకాశాల పేరుతో శ్రావణి నీ పరిచయం చేసుకున్న అశోక్ రెడ్డి...
-అశోక్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని కోసం గాలిస్తున్న పోలీసులు..
Legislative Council updates: లాక్ డౌన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం..మంత్రి కేటిఆర్..
శాసనమండలి లో మంత్రి కేటిఆర్..
-మా ప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్ కు ఇవ్వవలసిన డబ్బులు ఇస్తున్నాము
-ఇప్పుడు వరకు అస్తిపన్ను..నీటి పన్ను పెంచలేదు ఇంకా తగ్గించాము
-జిహెచ్ఎంసీ SRDP ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము
-తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు నుంచి నేటి వరకు హైదరాబాద్ నగరంలో క్యాపిటల్ ఖర్చు 67 కొట్లు చేశాము ఇంకా రెవెన్యూ ఖర్చు కలిపితే లక్ష కోట్లు దాటుతుంది
-హైదరాబాద్ నగరంలో అద్బుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము..
-అక్టోబర్2 న దేశంలో ఎక్కడ లేనివిధంగా 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేస్తాము.
Telangana Legislative Assembly: అసెంబ్లీ సమావేశాల కుదింపు పై చర్చ..
తెలంగాణ అసెంబ్లీ..
-అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో సమావేశమైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి..
-అధికార, ప్రతిపక్షాల అభిప్రాయం మరోసారి తీసుకొని సమావేశాలను మధ్యంతరం గా ముగించే అంశంపై ఉభయసభల్లో కీలక ప్రకటన చేయనున్న ఛైర్మన్, స్పీకర్...
Sreepada Yellampalli Project updates: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి బారీగా చేరుతున్న వరద నీరు..
మంచిర్యాల జిల్లా..
-శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
-ప్రస్తుతం నీటిమట్టం 147.74
-గరిష్ట నీటిమట్టం148.00 M
-ప్రస్తుతం నీటినిల్వ19.453
-పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 TMC*
-ఇన్ ప్లో: 152235c/s
-15 గేట్లను ఎత్తి 144513 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నా అదికారులు
Kaleshwaram Project updates: 46 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-లక్ష్మీ బ్యారేజ్ ( కాళేశ్వరం ప్రాజెక్టు )
-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 95.90 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 14.8 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 96,300 క్యూసెక్కులు
Nagarjuna Sagar Project updates: 4 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..
నల్గొండ :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు..
-ఇన్ ఫ్లో :98,821 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :98,821 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు
Mulugu District Updates: వెంకటాపురంలో అనధికారిక లాక్ డౌన్ తో అవస్థలు పడుతున్న ప్రజలు..
ములుగు జిల్లా:
- లాక్ డౌన్ ప్రకటించి కర్రలతో వీరంగం సృష్టిస్తున్న స్థానిక తహశీల్దార్ నాగరాజు..
- నిత్యవసర వస్తువులు, కిరాణా దుకాణాలు కూడా మూసి వేయాలని హుకూమ్..
- ఆయనే సక్రమంగా మాస్క్ ధరించకుండా ప్రజలపై ఓవర్ యాక్షన్...
- చిరు వ్యాపారులపై దాడులు, జరిమానాలతో తీవ్ర భయాందోళనలో ప్రజలు..
- రాజకీయ విద్వేషాలకు దారి తీస్తున్న వెంకటాపురం తహశీల్దార్ నాగరాజు వ్యవహారశైలి..