Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02
ఈరోజు తాజా వార్తలు
- 2003 విద్యుత్ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడాన్ని సీపీఎం స్వాగతిస్తుంది..
- ఇదే తరహాలో 1995 నిత్యావసర సరుకుల రవాణా ఆర్డినెన్స్ ను ,జిఎస్టీ పై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని నిరసిస్తూ శాసనసభ లో తీర్మానం చేయాలి...
- రాష్ట్రాల హక్కులను కాపాడడానికి ముఖ్యమంత్రి చొరవ చేసి కలిసి వచ్చే రాష్ట్రాలతో కేంద్రం పై వత్తిడి తేవాలి...
సూర్యాపేట జిల్లా :
- సూర్యాపేట టీజేఎస్ కార్యాలయంలో ప్రయివేటు ఉపాద్యాయులతో కోదండరాం ముఖాముఖి..
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ప్రభుత్వం చెల్లించాలనే డిమాండ్లతో ఛలో అసెంబ్లీ..
- కరోనాతో బతుకుదెరువు కోల్పోయిన అన్ని రంగాల వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.
- 21న తల పెట్టిన ఛలో అసెంబ్లీకి బ్రతుకు దెరువు కోల్పోయిన ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి.
- 2018 చట్టం ప్రకారం లే అవుట్ నిబంధనలు విధించి వాటిని వెనుకకు తిప్పేలా కొత్త చట్టం అమలు చేస్తామనడం సమంజసం కాదు.
- ఎల్ ఆర్ ఎస్ స్కీం పేద ప్రజలకు ఉపయోగపడేలా మార్చకుంటే పేదవారికి సొంతింటి కల ఎండమావే అవుతుంది.
సునీల్ శర్మ, తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ
-రుట్లా వారీగా క్లారిటీ ఇస్తేనే మేము ముందుకు వెళ్తాం
-రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతాం
-ఏపీ వారు చెప్పిన దాన్ని బట్టి ముందుకు వెళతాం
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
-తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ కృష్ణ దాస్ కు కరోన పాజిటీవ్ రావడంతో హోమ్ ఐసోలాషన్ కి వెళ్లిన బండి.
-సోమవారం మొత్తం పార్టీ వ్యవహారాల కోసం ఇంచార్జ్ కృషదాస్ తో గడిపిన బండిసంజాయ్.
-హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు పార్లమెంటుకు సమాచారం అందించిన బండి సంజయ్.
టిఎస్ హైకోర్టు...
-చివరి సెమిస్టర్ కు ఎప్పటిలాగే రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన ప్రభుత్వం
-అటానమస్ కళాశాలలు వారికి అనుకూలమైన రీతిలో నిర్వహించుకోవచ్చునన్న ప్రభుత్వం
-పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
-ప్రభుత్వ విధానపరమైన జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
-సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్ గా పాసయినట్టు పరిగణిస్తామన్న ప్రభుత్వం
-సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించాలని కోరిన న్యాయవాది దామోదర్ రెడ్డి
-సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్న ఏజీ
-రెండు నెలల్లో నిర్వహిస్తామని తెలిపిన జే ఎన్ టీ యూ హెచ్
-పరీక్షలను కరోనా జాగ్రత్తలతో నిర్వహించాలని స్పష్టం చేసిన హైకోర్టు
-రేపు జేఎన్ టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
-రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల లో ఫీజు రీయింబర్స్ మెంట్, రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వం చెప్పడం దారుణం...
-ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమే అవుతుంది...
-ప్రభుత్వ తిరోగమన విధానంలో ప్రయాణిస్తుంది...
-ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ లకు అనుమతులు ఇవ్వడం విచారకరం...
ప్రైవేట్ యూనివర్సిటీ లలో కూడా రిజర్వేషన్లు, ఫీజ్ ఎంబర్స్ మెంట్ కల్పించి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలని సిపిఐ డిమాండ్ ...
ఆర్టీసీ అప్డేట్స్...
-సమావేశానికి తెలంగాణ నుండి ఎండీ సునీల్ శర్మ, ఈడీ ఆపరేషన్స్ పురుషోత్తం..ఈడీ ఈ వినోద్ ఈడీ వెంకటేశ్వర్లు
-ఏపీ నుండి ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు.. ఆపరేషన్ ఈడీ బ్రహ్మానంద్ రెడ్డి...
-అంతరాష్ట్ర సర్వీసుల పునరుద్దరణపై చర్చలు జరుపనున్న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు..
-ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అంతరాష్ట్ర సర్వీసులు..
అసెంబ్లీ..
-అసెంబ్లీ కమిటీ హాల్లో దలిత గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం
-దలిత, గిరిజనుల సమస్యలు పై చర్చ
-పోడు భూములు, అసెన్డ్ భూముల సమస్యల పై చర్చ..
-హాజరైన మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవకి రాథోడ్.
అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....
-మహీంద్ర స్కార్పియో హ్యుండియా అసెంట్ కార్లలో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నాం..
-వీళ్లంతా గుజరాత్ చెందినవారు...
-ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లో మహీంద్ర వెహికిల్స్ లో 3కోట్ల 75 లక్షల 30 వేలను , రెండు కార్లను స్వాధీనం చేసుకున్నాం....
-ఈ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు..
-ఇది ఎవరికి సంబంధించింది దానిపై ఇన్ కంటాక్స్ కు సమాచారం ఇచ్చాము...
-ఆ నలుగురు విచారణ జరుపుతున్నాము...
అసెంబ్లీ..
-రోజు 1200 మంది ఒకే చోట చేరడంతో కరోనా వ్యాప్తి చెందుతుంది
-ఇప్పటికే అసెంబ్లీ సిబ్బంది..పోలీసుల కు కరోనా
-నిన్న ఒక్క రోజే 14 మందికి కరోన నేపథ్యంలో సభ ను ముగించాలని ప్రభుత్వ ప్రతిపాదన