శబరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతి
తూర్పుగోదావరి: చింతూరు శబరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతి
చింతూరు వద్ద 37 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
రహదారిపై పొంగిపొర్లుతున్న వరద నీరు...
50 గ్రామాలకు నిలిచి పోయిన రాకపోకలు...
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో...విశాఖకు చేరుకున్న విజయసాయి రెడ్డి.
విశాఖ: నగరానికి చేరుకున్న విజయసాయిరెడ్డి అనారోగ్యరీత్యా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.
కొద్దిరోజుల క్రితం విజయసాయికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఉప్పాడ తీరంలో అల్లకల్లోలంగా మారిన కడలి..
తూర్పుగోదావరి : అలల ఉధృతికి బోల్తాపడిన ఫిషింగ్ బోటు.. తీరానికి చేరువలో బోల్తా పడడంతో సురక్షితంగా బయట పడిన మత్స్యకారులు.
అశోక్ గెహ్లాట్‌కు మరో పరీక్ష
జాతీయం: ప్రారంభమైన రాజస్థాన్ శాసనసభ సమావేశాలు
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న బిజెపి
శాసన సభ్యులకు విప్ జారీచేసిన కాంగ్రెస్, బిజెపి , బీఎస్పీ పార్టీలు
సొంతగానే విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
శాసన సభలో బలనిరూపణకు తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్న సీఎం అశోక్ గెహ్లాట్
ఇంకా లభ్యం కాని మత్స్యకారుల ఆచూకీ..
తూర్పుగోదావరి: యు కొత్తపల్లి మండలం, ఐ.పోలవరం మం. భైరవపాలెం సముద్రతీరంలో ఇంకా లభ్యం కాని మత్స్యకారుల ఆచూకీ..
ఈనెల 11న వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు..
నిన్న వెతకడానికి వెళ్ళిన 5 బోట్లపై 20 మంది మత్స్యకారులు..
ఎడతెరిపి లేని వర్షం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, తిరిగి వచ్చిన రెండు బోట్లు మత్స్యకారులు..
మరో బోటుతో గాలింపు చర్యల్లో ఉప్పాడకు చెందిన మత్స్యకారులు..
గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలో అధికార యంత్రాంగం..
ఆందోళనలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు..
తుంగభద్ర బోర్డ్ ముందస్తు హెచ్చరిక.
అనంతపురం: ప్రస్తుతం డ్యాం లో నీటి మట్టం 1630.63 అడుగులకు చేరింది.
పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు.
నీటి నిల్వ: 91.984 టీఎంసీలు.
పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 100 టీఎంసీలు.
రెండు మూడు రోజుల్లో డ్యాం నిండే అవకాశం ఉంది.
దిగువన నదీ పరివాహక ప్రాంతం లో ప్రజలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: టీబీ డ్యాం బోర్డ్.
మళ్ళీ టిటిడిపై రమణ దీక్షితులు విమర్శలు
టిటిడి అర్చకులను ఆదుకోవడంలో రక్షించడంలో విఫలమైందని ట్విట్టర్ వేదికగా విమర్శ
కోవిడ్ తో మృతి చెందిన అర్చకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి
శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వ హక్కుల కోసం పోరాడుతూ అదసువులు బాసిన సీనియర్ ప్రధాన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి, టిటిడి ఛైర్మన్ కు వినతి
ఆర్థిక సాయం చేయాలని కోరిన కోర్కెలు మణ దీక్షితులు
విజయవాడలో స్టేడియం బురదమయం
అమరావతి: విజయవాడలో స్టేడియం బురదమయం
రాత్రి నుండి కురుస్తున్న వర్షం తో చిత్తడిగా మారిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం.
రేపు స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వర్షం తో బురదమయంగా మారిన స్టేడియం
ఏర్పాట్లను పరిశీలించి న డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు
స్టేడియం ప్రాంగణం బురద గా మారడంతో ప్రత్యామ్నాయంగా పరేడ్ జరిగేందుకు చిప్స్ తో మరో రోడ్డు ఏర్పాటు
74వ పంద్రాగష్టు వేడుకలకు ముస్తాబవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం
విజయవాడ:
- 3 దఫాలుగా ఏర్పాట్లపై ట్రైల్ రన్
- ఏర్పాట్లను పర్యవేక్షించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర కార్పొరేషన్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, సీపీ బి.శ్రీనివాసులు,
- పంద్రాగష్టు వేడుకలలో పాల్గొననున్న ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు
- పంద్రాగష్టు వేడుకలలో వివిధ శాఖలకు సంబంధించిన పది శకటాలు
- 2వ బెటాలియన్ కర్నూలు, 3వ బెటాలియన్ కాకినాడ, 5వ బెటాలియన్ విజయనగరం, 9వ బెటాలియన్ వెంకటగిరి, 11వ బెటాలియన్ కడప, 16వ బెటాలియన్ విశాఖపట్నం
: తుంగభద్ర కు నిలకడగా వరద ప్రవాహం...
అనంతపురం:
- డ్యాం లో నీటి నిల్వ 91.984 టీఎంసీలు.
- డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 100.855 టిఎంసిలు.
- డ్యాంలో నీటిమట్టం 1630.63
- డ్యాం పూర్తీ స్థాయి నీటిమట్టం 1633 అడుగులు
- డ్యామ్ ఇన్ ఫ్లో: 49497 క్యూసెక్కులు.
- డ్యామ్ ఔట్ ఫ్లో: 9187 క్యూసెక్కులు.