Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-14 01:43 GMT
Live Updates - Page 6
2020-08-14 04:29 GMT

అనంతపురం నగరంలో క్రాంతి ఆసుపత్రి లో బాలింత మృతి

అనంతపురం:

- అలంక రాయుని పేట కి చెందిన

- అనుషా (21) కు నిన్న మధ్యాహ్నం నుంచి ఆసుపత్రిలో చికిత్స.

- కడుపు నొప్పి రావడం తో తీవ్ర రక్త స్రావం. గర్భ సంచి ఆపరేషన్ చేయడం తో ఆపరేషన్ వికటించి గర్భిణీ మృతి.

- ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్షమే మృతికి కారణం అంటున్న బంధువులు... ఆసుపత్రి వద్ద ఆందోళన.

2020-08-14 04:29 GMT

సాధినేని యామినిపై పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు

తిరుమల:

- టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాధినేని యామినిపై ఆరోపణ

- ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద యామినిపై కేసునమోదు

- రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని విమర్శలు

2020-08-14 04:28 GMT

నేడు రాజమండ్రిలో పర్యటించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

- నేడు రాజమండ్రిలో పర్యటించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

- శిరోముండనం బాధితుడు వరప్రసాద్, అత్యాచారానికి గురైన దళిత బాలికలను పరామర్శించనున్న రామకృష్ణ.

2020-08-14 04:27 GMT

చిలకలూరిపేట లో విజృపిస్తున్న కరోనా...

గుంటూరు:

- కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు నేటి నుంచి కఠినంగా అకాంక్షలు విధించిన అధికారులు...

- ఉదయం పదకొండు గంటలనుండి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు 144 సెక్షన్ అమలు....

- నిబంధనలు ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.....

2020-08-14 03:27 GMT

కృష్ణ జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ కామెంట్స్...

- వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది

- జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం

- టెలీ కాన్సెరెస్సీ ద్వారా అధికారు లకు, రెవిన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీ

- అన్ని డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు

- లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ యంత్రాంగాయానికి సహకరించాలి.

- కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు...

- బందరు కలెక్టరేట్ : 08672-252572

- విజయవాడలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805

- సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454

- సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు: 08656- 232717

- రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486

- రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697

2020-08-14 03:04 GMT

కోనసీమలో గోదావరి ఫ్లడ్ ఎఫెక్ట్..

తూర్పుగోదావరి :

- కోనసీమలో ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి ఉప నదులు గౌతమి.. వృద్ధగౌతమి.. వశిష్ట.. వైనతేయ..

- కోటిపల్లి - ముక్తేశ్వరం, సఖినేటిపల్లి - నరసాపురం రేవుల్లో పంటులపై రాకపోకలు నిలివేసిన అధికారులు..

- అయినవిల్లి మం. ముక్తేశ్వరం తొగరుపాయ పాత వంతెనను ముంచెత్తిన వరద నీరు..

- పి.గన్నవరం మండలం జి.పెదపూడి లంక గ్రామాల్లో పడవలపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు..

2020-08-14 02:25 GMT

తిరుమల నూతన పరకామణి భవన నిర్మాణానికి శంకుస్థాపన

తిరుమల

- నూతన పరకామణి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

- సుమారు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అధునాతన వసతులతో పరకామణి భవనం నిర్మాణం

- నిర్మాణ వ్యయాన్ని విరాళంగా అందిస్తున్న బెంగళూరుకు చెందిన భక్తుడు మురళి కృష్ణ

- శ్రీవారి కానుకలు లెక్కింపు భక్తులు చూసేలా నూతన భవనం నిర్మాణం

- ఆలయం లోపల జరిగే పరకామణి లెక్కింపు వల్లా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఆలయం వెలుపలకు మార్చాం.. ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

- భవన నిర్మాణం చేసే భాగ్యం స్వామివారు నాకు కల్పించడం పూర్వజన్మ సుకృతం..దాత మురళీ కృష్ణ

2020-08-14 02:20 GMT

అమరావతి

ఉదయం11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గౌడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ ల పై సీఎం జగన్ సమీక్ష.

12.30 కు నంద్యాల లోని ఉదయనంద హాస్పిటల్ ను క్యాంపు ఆఫీస్ నుండి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం.

2020-08-14 02:18 GMT

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

కర్నూలుజిల్లా

- ఇన్ ఫ్లో : 1,41,606 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు

- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

- ప్రస్తుతం : 865.50 అడుగులు

- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

- ప్రస్తుతం : 124.2268 టిఎంసీలు

- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-08-14 02:17 GMT

శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్దం!

కర్నూలు జిల్లా

- ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు శుక్రవారం నుండి పునః ప్రారంభం కానున్నాయి.

- దేవస్థానం ఈఓ కె.ఎస్.రామారావు ఆదేశాల మేరకు అధికారులు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తగిన జాగ్రత్తలతో పలు చర్యలు తీసుకుంటున్నారు.

- దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా భౌతిక దూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్కు ధరించాలని ఆదేశించారు.

- ఈరోజు  ఉదయం 6 గంటల నుండి స్థానికులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పించారు.

- ఆగస్టు15 వ తేదీ నుండి యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతి..

Tags:    

Similar News