Live Updates: ఈరోజు (సెప్టెంబర్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-13 02:32 GMT
Live Updates - Page 2
2020-09-13 05:59 GMT

Amaravati updates: రాష్ట్రంలోని పోలీసులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్....

అమరావతి..

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు సూచనలు చేయనున్న డీజీపీ గౌతమ్ సవాంగ్..

-రెండు రోజుల్లో దేవాలయాల జియో ప్యాకింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు..

-దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు పై సూచనలు..

-గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలి..

-దేవాలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు..

-మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలి..

-ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..

-ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్లు ఏర్పాటు చేయాలి..

-నిరంతరం దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పాయింట్ బుక్ ను స్థానిక పోలీస్ అధికారులు పర్యవేక్షించాలి..

-అగ్ని ప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు..

-రాష్ట్రంలోని ప్రతి ఒక్క దేవాలయాల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సిటీ ఎన్ఫోర్స్మెంట్ ఆక్ట్ 2013 నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలు     పాటిస్తూరక్షణ చర్యలు చేపట్టాలి..

2020-09-13 04:55 GMT

Chittoor updates: యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్నయువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు..

-యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లికి చెందిన యువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి (29)ని అరెస్టు చేసిన పోలీసులు

-తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపద చాలనే ఆశతో తొలుత కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సీసాలు తెచ్చి విక్రయిస్తూ నాటు సారా తయారీ

-తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీ పంలోని నివాసగృహాల్లో ఒక అద్దె గదిలో స్వయంగా సారా తయారు చేస్తున్న ఇంజనీరు

-ఇంజినీరింగ్ చదివాక కొంత కాలానికి ఐటీ రంగం వస్తువులను మలేషియాకు దిగుమతి దిగుమతులు చేస్తూ నష్టోవమడంతో త్వరగా డబ్బులు సంపాయించడం   కోసం ఈ దారిని ఎంచుకున్న వంశీకృష్ణారెడ్డి..

2020-09-13 04:48 GMT

Kalahastheeswara updates: కాళహస్తీశ్వరాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్ చేసిన దేవస్థానం అధికారులు..

చిత్తూరు..

-కాళహస్తీశ్వరాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు 8 కిలోల బరువున్న శివుడు, నందీశ్వరుని విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్     చేసిన దేవస్థానం అధికారులు

-భద్రత ఉన్నా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘటనపై సమగ్ర విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం

-పోలీసు లకు ఫిర్యాదు చేసిన ఈఓ..

2020-09-13 04:21 GMT

Amaravati updates: నేడు మెడికల్, డెంటల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్..

అమరావతి..

-రాష్ట్రంలో ఈ పరీక్షకు 61,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 151 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు

-మేలో జరగాల్సిన నీట్ పరీక్ష కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసిన అధికారులు

-మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్ష

-కరోనా నేపథ్యంలో విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

-గడువు ముగిస్తే పరీక్ష అనుమతించరు

-పరీక్ష ముగిసేవరకు విద్యార్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు

-పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టిఎ వెబ్ సైట్ నుంచి హాల్ డౌన్లోడ్ చేసుకోవాలి

-అడ్మిట్ కార్డులోని కోవిడ్ -19 సెల్స్ డిక్లరేషన్లో వివరాలు నమోదు చేసి వెంట తెచ్చుకోవాలి

-డ్రెస్ కోడ్ కంపల్సరీ..

2020-09-13 04:15 GMT

Antarvedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి స్వామివారికి కొత్త రథం తయారీకి రావులపాలెం అడవిలో నాణ్యమైన టేకు కలప ఎంపిక..

తూర్పుగోదావరి -రాజమండ్రి..

అంతర్వేది ఫాలోఆఫ్

-ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రథం పనులు ప్రారంభానికి దేవదాయశాఖ అధికారులు సన్నాహాలు

-రాష్ట్రంలో వివిధ దేవాలయాలకు 80 రథాలు తయారు చేసిన అనుభవం వున్న గణపతి ఆచార్యులకు ఈ రథం నిర్మాణ బాధ్యతలు

-అంతర్వేది రథం దగ్ధం ఘటన పై సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఆలయం మరింత కట్టుదిట్టం చేసిన బందోబస్తు

-రథం దగ్ధమైన షెడ్డు చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసిన పోలీసులు.

Tags:    

Similar News