Live Updates: ఈరోజు (సెప్టెంబర్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13ప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 13 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.10-53 వరకు తదుపరి ద్వాదశి | పునర్వసు నక్షత్రం మ.1-22వరకు తదుపరి పుష్యమి | అమృత ఘడియలు: ఉ.10-54 నుంచి 12-32 వరకు | వర్జ్యం: రా.9-21 నుంచి 10-57 వరకు | దుర్ముహూర్తం: సా.4-25 నుంచి 5-14 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజా వార్తలు
- రేపటి నుండి అక్టోబర్ 1 వరకు మొత్తం 18 రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.
- శని, ఆదివారాలు కూడా సెలవలు లేకుండా జరగనున్న పార్లమెంట్ సమావేశాలు. .
- 45 కీలక బిల్లులతో పాటు, 2 ఆర్ధిక పరమైన అంశాలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న కేంద్రం
- పార్లమెంట్ సమావేశం లో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 11 ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెట్టనున్న కేంద్రం
నెల్లూరు..
-- రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్..
-- పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ..
-- చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స ..
-- గత వారం రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి..
పశ్చిమగోదావరి జిల్లా..
-ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇరిగేషన్ డివిజన్.. ఏలూరు.
-నాగిరెడ్డి గూడెం పైన ఉన్న ఖమ్మం జిల్లా నుండి కూడా వరద వచ్చే అవకాశం
-నాగిరెడ్డి గూడెం తమ్మిలేరు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి ఉదయం 11.00 నుండి సుమారు 1500 క్యూసెక్స్ వదులకుంటు ఇంకా 10,000 వరకు పెంచే అవకాశం
-ఏలూరు దిగువ ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా తమ్మిలేరు ఆనుకుని గట్ల మీద నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారుల హెచ్చరిక
చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం తమ్మిలేరు రిజర్వాయర్ కి వరద నీరు రావడంతో 4500 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలిన అధికారులు తమ్మిలేరు పరిసర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అంటున్న అధికారులు.
పశ్చిమ గోదావరి జిల్లా..
-ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కరాటం జలాశయ నుంచి
- 2000 అవుట్ ఫ్లో నీరు నాలుగు గేట్ల ద్వారా విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ డిఈ తెలిపారు
-ప్రస్తుతానికి రాత్రి వచ్చిన భారీ వర్షానికి ప్రాజెక్టులోకి వరద 82,2:గా. నీరు చేరి ఉండటంతో ముందస్తు చర్యగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా..
-గొర్రె పందాలు స్థావరాలపై పోలీసులు దాడులు..
-చేబియంవలస, కెల్ల గ్రామాలకు చెందిన రెండు పందెం గొర్రెలు స్వాదీనం..
-పందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
-నిర్వాహకులపై కేసు నమెదు..
కడప :
తాళ్లపొద్దుటూరులొ టెన్షన్ టెన్షన్...
-గండికోట జలాశయానికి భారీగా చేరుకుంటున్న కృష్ణా జలాలు...
-భయం భయంగా గడుపుతున్న గ్రామస్తులు...
-మరొవైపు గండికోట జలశాయం నుంచి మైలవరం జలాశయానికి నీటి మళ్ళింపు పెంపు...
-మైలవరం జలాశయం నుంచి ఆరు గేట్లు ద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల..
-లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అదికారుల సూచన..
-గండికోట, కుందు నీటితొ పెన్నానదీ కి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు...
కడప :
-బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో కడప జిల్లా నుంచి ఇద్దరికి చోటు కల్పిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటన...
-రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి,
-రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులుగా మాజీ జిల్లా అద్యక్షుడు శశిభూషన్ రెడ్డి నియామకం...
తూర్పుగోదావరి జిల్లా
-ఏలేరు ప్రాజెక్టు నుంచి తొమ్మిది వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల
-ముంపునకు గురవుతున్న పిఠాపురం, గొల్లప్రోలు, మండలాల్లో పంటపొలాలు
-ప్రాజెక్టు లో పెరుగుతున్న ఇన్ ఫ్లోలు
-ఈరోజు సాయంత్రానికి ప్రాజెక్టు నుంచి 15వేల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేసే అవకాశం
-ఆందోళన లో దిగువ ప్రాంత వరి రైతాంగం
-గరిష్ట స్థాయిని దాటిన ఏలేరు ప్రాజెక్టు నీటిమట్టం..
విశాఖ..
-ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ కామెంట్స్..
-విశాఖ రైల్వే జోన్ రెండు ముక్కులు చేయడం అత్యంత దారుణం
-రాష్ట్రంలో అసమర్ధపాలన సాగుతుంది.
-వైసిపి ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదు?
-కాంగ్రెస్ పార్టీ మాట జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు.
-విశాఖలో పోర్టు స్కూల్ ను మూసివేస్తానంటున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తుంది.
-రాష్ట్రంలో వరసగా శిరోముండనం ఘటనలు జరగడం బాధకరం.
-శిరోముండన ఘటనలు వెనుక జగన్ ప్రభుత్వ పాత్ర ఉంది.
-రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది.
కర్నూలు జిల్లా..
-3 క్రస్ట్ గేట్ల తో దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-ఇన్ ఫ్లో: 63,070 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 1,53,033క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
-ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.