Live Updates: ఈరోజు (13 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 13 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి ఉ.09-59 వరకు తదుపరి ద్వాదశి | మఘ నక్షత్రం రా.07-59 వరకు తదుపరి పుబ్బ | వర్జ్యం: ఉ.08-22 నుంచి 09-56 వరకు | అమృత ఘడియలు సా.05-40 నుంచి 06-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి మ.10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: ఉ.03-30 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
అమరావతి..
-గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డిజి గా అర్ కే మీనా
-ఏసీబీ డైరెక్టర్ శంఖా బ్రత బాగ్చి బదిలీ, ఏపీఎస్పి బెటాలియన్ ఐజీ గా నియామకం
-గుంటూరు రేంజ్ డిఐజీ గా త్రివిక్రమ్ వర్మా
-ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ కుమార్ బదిలీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గా నియామకం
-విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి
పశ్చిమ గోదావరి జిల్లా....
-నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏలూరులో నీటమునిగిన ఆర్టీసీ డిపో
-ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కండక్టర్స్ రెస్ట్ రూమ్స్ లో చేరుకున్న వరద నీరు
-నగరంలో పలు రోడ్లు జలమయం
తూర్పుగోదావరి... కొత్తపేట..
-ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుపతి గా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రాత్రి వర్షానికి ఆఁలయ ప్రాంగణం మునక.
-ఈరోజు దర్శనాలు రద్దు
-మోటార్లతో నీటిని బయటకు
-పంపుతున్న సిబ్బంది
పశ్చిమ గోదావరి జిల్లా..
-నిడదవోలు లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే స్టేషన్ అంతా జలమయమైంది.
-రైల్వే ట్రాక్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆ ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైళ్లు, పాసింజర్ రైళ్లు, అధికారులు ఎంతో అప్రమత్తంగా నడుపుతున్నారు.
కర్నూలు...
-కర్నూలు పార్లమెంట్ టీ.డీ.పీ అధ్యక్షులు..
-సోమిశెట్టి వెంకటేశ్వర్లు..
-ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ తుంగభద్ర పుష్కరాలపై సమీక్ష కూడా నిర్వహించలేదు...
-మంత్రి జిల్లా కు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియడం లేదు...
-తుంగభద్ర పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..
కర్నూలు జిల్లా ....
-తలకు బలమైన గాయాలు తగలడంతో కోయిలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
కర్నూలు..
-మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాల పై సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు.. రౌండ్ టేబుల్ సమావేశం.
-ఇట్టినా ప్లాంటేషన్ ఈ కంపెనీ పేరుతో 2006లో ఆస్పరి చిన్న ఆహోతూరు పెద్ద హోతూరు గ్రామాలలో సేకరించిన 450 ఎకరాల భూములను రైతులకు మంత్రి తిరిగి అప్పగించాలి.
జాతీయం..
-హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
-విచారణ జరిపిన సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
-వెకేషన్ తర్వాత పిటిషన్ ను విచారిస్తామన్న సీజేఐ
-నవరాత్రి సెలవుల తర్వాత విచారణ జరుపుతామన్న ధర్మాసనం
గుంటూరు...
-పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు...
-అచ్చంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరదనీరు...
-అచ్చంపేట సినిమాహల్ సెంటర్‌లోప్రధాన రహదారిపై వరదనీరు...
-అచ్చంపేట కెనాల్ ఆఫీస్‌లోకి చేరిన వరద...
-పలు దుకాణాలలోకి చేరిన వరద...
కృష్ణాజిల్లా...
-గుడివాడ - మచిలీపట్నం విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రాంకృపాల్
-మోటర్ ట్రాలీ పై మచిలీపట్నం వరకు డబ్లింగ్ ట్రాక్ నిర్మాణాన్ని పరిశీలించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు
-రేపటి నుండి డబ్లింగ్ ట్రాక్ పై పట్టాలు ఎక్కనున్నా పలు రైళ్లు