Live Updates: ఈరోజు (13 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Narsipatnam updates: గన్నవరం మెట్ట వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న దొంగ గెడ్డ...
విశాఖ (నర్సీపట్నం)
-నర్సీపట్నం - తుని రహదారిలో గన్నవరం మెట్ట వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న దొంగ గెడ్డ...
-రోడ్డుపై నుండి నీరు ప్రవహించడంతో రెండు వైపుల నుంచి నిలిచిపోయిన వాహనాలు.
-తెల్లవారుజామున కారులో నర్సీపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన నలుగురు వ్యక్తుల తో గెడ్డ దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన కారు.
-అందులోని ముగ్గురు వ్యక్తులను స్థానికుల సాయంతో రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. కారులో చిక్కుకుపోయిన మరో మహిళ మృతి.
East godavari Rain updates: భారీవర్షాలతో అతలాకుతలం..
తూర్పుగోదావరి..
-భారీ వర్షం తో ఐ.పోలవరం మండలం మురమళ్ళలో ఆలయంలో ముంపునీరు.
-గుడిచుట్టూ చేరి గర్భగుడిలోకి వర్షం నీరు
-జలదిగ్భంధంలో రాజోలు మండలం శివకోడు శివాలయం
-ముంపుబారిన వేలాది ఎకరాల వరిపొలాలు...
-రోడ్లన్నీ జలమయం
-అమలాపురం పట్టణంలో పలు ప్రాంతాలు జలదిగ్భంధం
-ఇళ్లల్లోకి వర్షం నీరు రావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Cyclone updates: కొద్దిసేపట్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు..
హైదరాబాద్...
-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
-తీవ్ర వాయుగుండము ఇవాళ ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం నర్సాపూర్, విశాఖ మధ్య కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.
-తుపాను తీరం దాటే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పెనుగాలులతో పాటు కొన్నిచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి.
-తుపాను తీరం దాటే సమయంలో గంటకు 55కిలో మీటర్ల నుంచి 65 కిలో మీటర్ల ..గరిష్టంగా 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది
-మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
-బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బుధవారం ఏర్పడే అవకాశాలున్నాయి.
-దాని ప్రభావం ఎలా ఉంటుందనేది రెండురోజుల తరవాతే తెలుస్తుంది.
-వాతావరణ అధికారి రాజారావు@ హైదరాబాద్..
Srisailam Reservoir updates: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా....
-7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 2,47,032 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 2,31,150 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.80 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 214.8450 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Yeleru Reservoir updates: ఏలేరు జలాశయానికి క్రమేపీ పెరుగుతోన్న వరద ప్రవాహం..
తూర్పుగోదావరి :
-తూర్పు మన్యంలో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టు కు వచ్చి చేరుతోన్న వరద నీరు..
-10 వేల క్యుసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తోన్న అధికారులు..
Vijayawada weather updates: కోస్తా ప్రాంతంలో భారీ వర్షం...
విజయవాడ..
-బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షం
-కృష్ణాజిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచీ కుండపోతగా వాన
-విజయవాడలో దాదాపు అన్ని రోడ్లూ జలమయం
-లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు
East Godavari Weather updates: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు..
తూర్పుగోదావరి...
-ముంపుబారిన లోతట్టు గ్రామాలు, వరిపొలాలు
-గోదావరిని తలపిస్తున్న పలుచోట్ల రోడ్లు
-జిల్లా అంతటా విపరీతమైన ఈదురుగాలులు
Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
- విశాఖపట్నం కు దక్షిణంగా 130 కిలోమీటర్లు, కాకినాడ కు తూర్పు ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు, నర్సాపురం నకు తూర్పు దిశగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిన తీవ్ర వాయుగుండం..
- గంటకు 22 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర వాయుగుండం..
- విశాఖపట్నం, నర్సాపురం మధ్యలో కాకినాడ దగ్గరలో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం..
- తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..
-తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాల హెచ్చరిక..
- తీరం వెంబడి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..