Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-13 01:34 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-13 14:41 GMT

రాచకొండ కమిషనరేట్:

- మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్స్ కాలనీలో హత్య ప్రయత్నం..

- గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓమహిళపై కత్తితో దాడి చేసి పరార్..

- గాయాలతో బయటపడ్డ మహిళా సేఫ్..

- సంఘటన స్థలానికి చేరుకునీ ఆధారాలు సేకరిస్తున్న మల్కాజిగిరి పోలీసులు క్లూస్ టీం..

- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

2020-08-13 14:38 GMT

హైదరాబాద్:

- పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నా కరుడుగట్టిన నేరస్తుడు అబ్దుల్ హుసేను అరెస్ట్ చేసిన ఇంటర్ పోల్ అధికారులు.

- అబ్దుల్ హుస్సేన్ ఢిల్లీ మీదుగా ఫ్లైట్ లో అబుదాబి వెళ్తుండగా యూఏఈ ఎయిర్ పోర్టు లో అదుపులోకి తీసుకున్న ఇంటర్పోల్ పోలీసులు.

- అబ్దుల్ హుస్సేన్ పై హైదరాబాద్ లో పలు హత్య కేసులో మోస్ట్ వాంటెడ్.

- నేరస్తుడు అబ్దుల్ హుస్సేన్ పైనా గతంలో 4 నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్లో ఉన్నాయి..

- ఇతనిపై గతంలో రెడ్ నోటీసు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు..

- 2003 , 2006 , 2007 లో జరిగిన పలు హత్య కేసులో అబ్దుల్ హుస్సేన్ ప్రధాన నిందితుడు..

- అబ్దుల్ హుస్సేన్ ను చంచల్ గూడ జైలుకు రిమాండ్ తరలించిన అఫ్జల్గంజ్ పోలీసులు..

2020-08-13 13:51 GMT

కామారెడ్డి:

- నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టులో భార్య భర్తల అనుమానాస్పద మృతి

- మృత దేహాలను బయటకు తీసిన స్థానికులు

- మృతులు క్యాసంపల్లి కి చెందిన మహేందర్ -శిరీష లుగా గుర్తింపు

2020-08-13 12:28 GMT

అంజనీ కుమార్,సీపీ, హైదరాబాద్:-


ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ గేమింగ్ అనేది పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది


2014 తెలంగాణా స్టేట్ ఏర్పాటు అయిన తరువాత ఆన్ లైన్ గేమింగ్ ను ప్రభుత్వం నిషేధించింది


ఆన్ లైన్ గేమింగ్ తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి


టెక్స్ట్ , ఇమేజ్ బేస్, వీడియో బేస్ లు ద్వారా ఆన్ లైన్ గేమింగ్ నడుస్తున్నాయి


ఇండియా లోని


యూత్ ను టార్గెట్ గా చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్స్ మోసం చేస్తున్నారు


ఈ మధ్య కాలం లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రెండు ఫిర్యాదులు అందాయి


టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా రెఫరెన్స్ తోటి ఈ ఆన్ లైన్ గేమింగ్ లోకి ఎంటర్ చేస్తారు


ఈ చైనీస్ గేమింగ్ లో బెట్టింగ్ అనేది నడుస్తుంది


ఆ బెట్టింగ్ పెట్టి ఎంతో మంది మోస పోతున్నారు


డేటా స్టోరేజ్ అంత చైనా బేస్డ్ తో క్లాప్డ్ లో సేవ్ అయ్యేలా చూసుకుంటారు


1100 కోట్లు వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించాము


ఇండియా లో గేమింగ్ ఆడిన డబ్బు లు మొత్తం HHBC గుర్గాము కి వెళ్ళింది


30 కోట్లు HHBC బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేశాము


ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది


ఈ ఆన్ లైన్ గేమ్ లో మోసపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు


నలుగురు ను ఈ కేసులో అరెస్ట్ చేశాము , ఇందులో ఒక చైనీస్ కూడా ఉన్నారు..


పిల్లలు ఈ ఆన్ లైన్ గేమ్స్ ఆడకుండా జాగ్రత్త పడాలి


ఇప్పటికే ఐటీ శాఖ కు సమాచారం ఇచ్చాము , దర్యాప్తు చేస్తున్నాం...


2020-08-13 12:28 GMT

నిజామాబాద్ - మాక్లూర్ లో ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.

ఐసోలేషన్ సెంటర్ లో 24 గంటల పాటు ఆంబులెన్స్ అందుబాటులో ఉంచాలి, ఐసోలేషన్ కేంద్రంలో ఉండే పేషెంట్లకు ఉచిత బోజనం.

హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా వైద్యానికి అందించే మందులతో జిల్లా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నాం- కలెక్టర్ నారాయణరెడ్డి.

2020-08-13 12:25 GMT

ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా కేసులు..

ఒక్కరోజులో ముప్పై కేసులు నమోదు..

చికిత్స కోసం బాదితులను అసుపత్రి కి తరలింపు

2020-08-13 10:31 GMT

టీఎస్ హైకోర్టు.....

తెలంగాణ రాష్ట్రం లో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిటీషన్ దాఖలు...

పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర intuc ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్

పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య...

నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారన్న రంగయ్య..

గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని కోర్టుకు తెలిపిన రంగయ్య..

తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టును కోరిన రంగయ్య

పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న రంగయ్య..

పిటీషన్ పై సమయం కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది..

తదుపరి విచారణను సోమవారం వాయిదా వేసిన హైకోర్టు.

2020-08-13 10:30 GMT

పొన్నాల లక్ష్మయ్య. మాజి మంత్రి.

విద్యార్దుల భవిష్యత్ కోసం NSUI విద్యార్దులు పోరాడుతున్నారు.

ఎన్ని రకాల పోటీ పరీక్షలు రద్దుచేయాలని NSUI హైకోర్టులో పీటీషన్ వేసింది.

ఆ పీటీషన్ పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ప్రకటించడం సరికాదు.

NSUI విద్యార్దుల పక్షానా పోరాటం చేస్తుంది.

ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్దతిలో NSUI విద్యార్దులు నిరసన తెలిపారు.

విద్యార్దులను అరెస్టు చేసి జైలుకు పంపడం విచారకరం.

అరెస్టు చేసిన విద్యార్దులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలి, కేసులు ఉపసంహరించాలి.

అన్ని రకాల ఎంట్రెన్స్ పరీక్షలు రద్దు చేయాలి.

2020-08-13 10:30 GMT

టీఎస్ హైకోర్టు......


హైకోర్టు లో ముగిసిన కరోనా పిటిషన్ల విచారణ..


రెండు వారాల్లో కరోనా కు సంబంధించి ప్రభుత్వం కు ఇచ్చిన అదేశాలను పూర్తి చేయాలని హైకోర్టు అదేశం..


తెలంగాణ రాష్ట్రం లో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవలన్న హైకోర్టు...


ప్రయమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటెక్ట్ వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలన్న హైకోర్టు..


ప్రయివేటు హాస్పిటల్స్ పై ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులు తీసుకోవలన్న హైకోర్టు..


ప్రయివేటు హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత చట్ట రీత్య వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కు హైకోర్టు అదేశం..


ప్రయివేటు హాస్పిటల్స్ ప్రభుత్వ జీవో ను ఫాలో కావాలన్న హైకోర్టు...


ప్రయివేటు హాస్పిటల్స్ విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం..


ప్రతి ప్రయివేటు హాస్పిటల్స్ వద్ద కోవిడ్ రేట్లను డీస్ప్లే బోర్డ్ ల ద్వారా తెలపాలన్న హైకోర్టు..


ప్రభుత్వం కల్పించిన వసతులను వినియోగించుకున్న ప్రయివేటు హాస్పిటల్స్ ఎంత మందికి ఉచితంగా చికిత్స అందించారో తెలపాలన్న హైకోర్టు...


ఢిల్లీ ప్రభుత్వం ప్రయివేటు హాస్పిటల్స్ లో ఉన్న బెడ్స్ ను ఏవిధంగా కోవిడ్ పేషంట్స్ కోసం తీసుకున్నారో అదే తరహా లో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకోకూడదో తెలపాలన్న హైకోర్టు..


చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలను ఫిర్యాదులు తీసుకోవలన్న హైకోర్టు...


కొంత మంది ఎన్జీవోలు , సివిల్ సొసైటీ తో కలిపి ఇసలోషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రసూల్ పూర్ లోని హాకీ మైదానం ను పరీశీలించాలన్న హైకోర్టు..


తదుపరి విచారణకు వైద్య శాఖ అధికారులు హాజరు కావాలని హైకోర్టు అదేశం


తదుపరి విచారణను సెప్టెంబర్ 4 కు వాయిదా వేసిన హైకోర్టు...


2020-08-13 10:29 GMT

*పఠాన్ చేరువు

డిఎస్పిరాజేశ్వర్ రావు*

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాము..

ఈ కేసు విచారణ లో వుంది..

ప్రధాన నిందితుడు ఆశ్రమానికి దాతలుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి తో పాటు విజయను జయదేవ్ ను పూర్తిస్థాయిలో విచారించాము.

మైనర్ బాలికపై పలుమార్లు వేణు గోపాల్ రెడ్డి అత్యాచారం చేసినట్లు నిర్ధారించడం జరిగింది.

ఇతనికి వార్డెన్ విజయ ఆమె బ్రదర్ జయ దేవ్ సహకరించారు.

అమ్మాయి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

అంతకు ముందే మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.

బాలికకు జరిగిన అన్యాయం గురించి పూర్తిగా వివరించింది.

మైనర్ బాలికతో పాటు మరికొంత మంది చిన్నారుల స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.

లాక్ డౌన్ లో ఈ గతుకం జరిగింది..

మే నెలలో బాలిక బోయిన్ పల్లి లోని కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళింది..

అమ్మాయి ఒంటిపై గాయాలయ్యాయి.

ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాము..

ఒక కేసు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయి పై జరిగిన అత్యాచారం.

మరొక కేసు బాలికపై జరిగిన భౌతిక దాడి ఈ విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల ప్రకారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు..

అమ్మాయిపై బంధువులు భౌతిక దాడికి పాల్పడ్డార లేదా హాస్టల్ లో ఎవరైనా దాడికి పాల్పడ్డార అని విచారణ జరుగుతోంది.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది..

ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాము..

పూర్తిస్థాయిలో లో విచారణ చేపడుతున్నాము..

ఇప్పటికే నిందితులపై 2012 పోక్సో ఆక్ట్ ప్రకారం పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశాము..

Tags:    

Similar News