Live Updates: ఈరోజు (సెప్టెంబర్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-12 03:49 GMT
Live Updates - Page 2
2020-09-12 08:20 GMT

Botsa Satyanarayana: రాజధాని వివాదంపై మంత్రి బొత్సా

రఘురామకృష్ణంరాజుని రాజీనామా చెయ్యమని చెప్పండి రాజధానిపై నిర్ణయం ఏంటో తరువాత చెప్తాం.

రాజధానితో సంబందం లేకుండా రాజీనామా చెయ్యాలని ముందే చెప్పాము.

రాజధాని భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉంది.

ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములను చంద్రబాబు, లోకేష్ దోచేశారు.

సుజనా చౌదరి, నారాయణ, లింగమనేని రమేష్ బినామిలు ఎందుకు భూములు కొనుగోలు చేశారు.

వైసీపీ నేతలు ఎవరు ఎందుకు అమరావతిలో భూములు కొనలేదు.

రాజధానిలో క్విడ్ ప్రో కు పాల్పడింది నిజం కాదా ?.

చట్టం తన పని తాను చేసుకుంటుంది విచారణ అక్రమాలు జరిగినట్లు తెలిస్తే లోకేష్, చంద్రబాబు పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో పెడతారు.

రాజధాని గ్రామాల్లో కోవిడ్ వల్ల పనులు ప్రారంభించలేదు.

బాధ్యత గల మంత్రిగా చెప్తున్నా రాజధాని గ్రామాల్లో త్వరలో పనులు ప్రారంబించబోతున్నాం

2020-09-12 07:52 GMT

వాళ్ళు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి

అమరావతి: మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు 

అంతిర్వేది ఘటన విషయంలో బీజేపీ,టీడీపీ, జనసేన లు ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి..

పవన్ ఫామ్ హౌస్ లో, చంద్రబాబు జూమ్ లో కూర్చుని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు..

టీడీపీ అధికారంలో ఉండగా 2017 అక్టోబర్ 19 తేదీన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వేణుగోపాల స్వామి రథం దగ్ధం అయింది..

అప్పుడు బీజేపీ, జనసేన టీడీపీతో ఉన్నాయి.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

కేవలం కేసు నమోదు చేసి వదిలేశారు.. అప్పుడు సీబీఐ విచారణ ఎందుకు వెయ్యలేదు..?

ఇప్పుడు ఫామ్ హౌస్ లో దీపాలు వెలిగించే పవన్ దీనిపై సమాధానం చెప్పాలి..

చంద్రబాబుతో ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయించు..

ప్రమాదాలను రాజకీయాలు చేసే సంస్కృతి మాది కాదు..

దగ్ధం చెయ్యడం అంటే చంద్రబాబుకి సరదా.. తుని రైలు, అమరావతి పంటలు, దేవుడి రాధాల దగ్ధం వెనుక ఆయనే ఉన్నాడు..

ఇప్పుడు మేము సీబీఐకు అప్పగించాం.. వాస్తవాలు బయటకి వస్తాయి..

రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..

చంద్రబాబు ఎప్పుడు పూజలు చేసినా కాళ్ళకు బూట్లు కూడా తియ్యడు..

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద దెయ్యం చంద్రబాబు..

దేవాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదు..

భక్తులకు ఇబ్బంది కలిగించేలా కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..

బీజేపీ,టీడీపీ,జనసేన దేవాలయాలపై రాజకీయాలు చేయడం మానేయండి..

సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం దయచేసి స్వామీజీలు నమ్మొద్దు.. 

స్వామీజీలు మీ విలువైన సూచనలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి..

2020-09-12 06:26 GMT

Sailaja Nath: ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్

కోవిడ్ ను ఎదుర్కోవడం గురించి డాక్టర్ గంగాధర్ అవసరం ఏమిటో చెప్పారు

మాస్కుల గురించి మాట్లాడితే అరెస్టులు చేసారు

డాక్టర్ గంగాధర్ పై సీఐడీ విచారణ వేసారు

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు.  ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం ఉంది

కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల బాధ్యత కలిగిన పార్టీగా మాట్లాడాం

మధ్య యుగాలనాటి పాలన కాదు అని ప్రభుత్వం గ్రహించాలి

దయచేసి ఇటువంటి కేసులు మానివేయాలని కోరుతున్నాం

పీపీఈ కిట్లు అనంతపురంలో మా పట్టణ అధ్యక్షుడు ఇచ్చారు

డాక్టర్లు పీపీఈ కిట్లు డొనేట్ చేయమని అడిగారు

అరుస్తూ, కరుస్తూ కేసులు పెట్టడం అర్ధం లేని పని

ప్రభుత్వం కేసులు వెనక్కి తీసుకోవాలి

డాక్టర్ గంగాధర్ విషయంలో తక్షణమే స్పందించిన హైకోర్టుకు ధన్యవాదాలు

2020-09-12 06:20 GMT

Nutan Naidu Cheated: నూత‌న్ నాయుడుపై మ‌రో కేసు.. ఏకంగా రూ.12 కోట్ల టోక‌రా

విశాఖ: విశాఖ శిరోమండనం కేసులో ప్రదాన నిందితుడు పై మరో రెండు కేసులు

ఒక్కోకటి బయటకు వస్తున్న నూతన నాయుడు అక్రమాలు

బ్యాంకు లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా 12 కోట్లు దొచేసిన నూతన్ నాయుడు..

విశాఖ రావికమతం కు చెందిన నూకరాజు, అతని స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి ద్వారా పరిచయం పెంచుకున్న నూతన్ నాయుడు..బ్యాంక్ ఉద్యోగులు అంటూ మోసం చేసాడని బాదితులు పిర్యాధు..

మహరాణి పేట పీఎస్ లో కేసు నమోదు

2020-09-12 04:32 GMT

Amravati Updates: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించింది: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

అమరావతి

జీవో నెంబర్ 17 ను అడ్డం పెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడతారా అని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

సంక్షేమ నిధులు రు.450 కోట్లు దొడ్డిదారిన మళ్ళించడం దుర్మార్గం.

- వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించి 5 నెలలపాటు కార్మికులను వేధించారు.  

- కరోనా విపత్కర కాలంలో పలు రాష్ట్రాలు కార్మికులకు ఆర్థిక సహాయం అందించినప్పటికీ, ఏపీ ప్రభుత్వం నయా పైసా విదల్చ లేదు.

- వారి డబ్బు వారికి ఇవ్వకుండా భవన నిర్మాణ కార్మికులను వీధులపాలు చేస్తారా?

- రాష్ట్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.


2020-09-12 04:29 GMT

Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి

కర్నూలు జిల్లా:

- 6గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

- ఇన్ ఫ్లో: 1,69,704 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో: 2,35,000 క్యూసెక్కులు

- పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు

- ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులు

- పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు

- ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.4011 టీఎంసీలు

కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-09-12 04:07 GMT

Tungabadhra Dam Updates: తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం.

అనంతపురం: 

- డ్యామ్ ఇన్ ఫ్లో: 19496 క్యూసెక్కులు.

- ఔట్ ఫ్లో: 23750 క్యూసెక్కులు.

- డ్యామ్ నీటి నిల్వ: 100.239. టీఎంసీలు.

- పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.

- డ్యామ్ లో నీటి మట్టం: 1632.84 అడుగులు.

- పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు.

2020-09-12 04:05 GMT

Krishna District Updates: గుడివాడలో ఆర్ ఎస్ ఎస్, బీజేపీ శ్రేణులు ఆందోళన

కృష్ణా జిల్లా

- గుడివాడ బంట్టుమిల్లి రోడ్డు శ్రీనివాస్ సెంటర్లో ఉన్న పోతురాజు విగ్రహం ద్వసంచేసి హుండీ ఎత్తుకేల్లిన దుండగులు

- వింద్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై రసారోకో చేస్తున్న ఆర్ ఎస్ఎస్ .,బిజెపి ,పలు హిందుసంఘాలు.

2020-09-12 04:03 GMT

East Godavari Updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి వారికి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధం

తూర్పుగోదావరి:

- శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు ఏడు అంతస్తులుండేలా,ఆరు చక్రాలతో కొత్త రథం ఆకృతి

- కొత్త రథంతో పాటు షెడ్డు మరమ్మతులు, షెడ్డుకు ముందు ఇనుప షట్టర్ ఏర్పాటుకు కలిపి 95 లక్షల వ్యయమవుతుందని అంచనా

- వచ్చే 2021 మాఘమాసం ఫిబ్రవరి లో స్వామివారి కల్యాణోత్సవాలకు కొత్త రథం సిద్ధం చేయడానికి ప్రణాళిక

- అంతర్వేది ఆలయ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్, ఆలయ ఏసీ భద్రాజీలు చర్చించి రథం ఆకృతి పై ప్రభుత్వానికి నివేదిక

2020-09-12 04:02 GMT

Ration Door Delivery: బియ్యం డోర్ డెలివరీ వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి

అమరావతి

- మొత్తం 9260 వాహనాలు కొనుగోలుకు రూ 592.63 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు

- జుడీషియల్ ప్రివ్యూ నుండి కావల్సిన అనుమతులు తీసుకోవాలని ఆదేశం

- కేంద్ర ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా రివర్స్ బిడ్డింగ్ పద్దతిలో కొనుగోలుకు నిర్ణయం

Tags:    

Similar News