Live Updates: ఈరోజు (సెప్టెంబర్-12) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 12 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | దశమి (రా.11-18 వరకు) తదుపరి ఏకాదశి | ఆర్ద్ర నక్షత్రం (మ.12-53 వరకు) తదుపరి పునర్వసు | అమృత ఘడియలు: లేవు | వర్జ్యం: రా.1-07 నుంచి 2-45 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-50 నుంచి 7-27 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04
ఈరోజు తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం ఎల్ పీజీ గ్యాస్ ధర పెంచిందంటూ వస్తోన్న వార్తలపై స్పెషల్ సీఎస్, కమర్షియల్ ట్యా క్స్ రజత్ భార్గవ్ వివరణ ఇచ్చారు.
- గృహావసరాలకు వాడే గ్యాస్ ధర పెంచలేదని ప్రభుత్వం స్పష్టీకరణ
- ఎల్ పీజీ గ్యాస్ పై వ్యాట్ పెంచామన్నది అబద్ధం
- అసలు ఎల్ పీజీ గ్యాస్ పై ట్యాక్స్ జీఎస్టీ పరిధిలోనిది
- ఎల్ పీజీ పై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు-
- ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్ పై ట్యాక్స్ ను స్వల్పంగా పెంచింది
-అది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే గ్యాస్ మాత్రమే*
- వంట గ్యాస్ పై ట్యాక్స్ ఎక్కడా పెంచలేదు
అమరావతి
- వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మతం పేరుతో జరిగిన వరుస పరిణామాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రతిపాదనలు.
- అంతర్వేది ఘటనతో సహా గతంలో జరిగిన ఘటనల విచారణను సీబీఐకు అప్పజెప్పాలనే సూచనలు.
- తిరుమల బస్సులపై శిలువ బొమ్మలు, టీటీడీ వెబ్ సైట్, సప్తగిరి మాస పత్రికలో అన్యమత ప్రస్తావన వంటి వాటినీ సీబీఐ విచారణ పరిధిలోకి తేవాలని ప్రతిపాదన.
- పిఠాపురం, నెల్లూరు ఘటనలతోపాటు.. టీటీడీ ఛైర్మనుపై చేసిన దుష్ప్రచారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని యోచన.
- ఒకట్రోండు రోజుల్లో మతపరమైన అన్ని వివాదాల విచారణను సీబీఐకు అప్పగించే అంశంపై తుది నిర్ణయం..?
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా మతపరమైన విషయాల్లో కుట్ర జరుగుతోందని భావన.
- ఈ తరహా కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్న ప్రభుత్వం.
తూర్పుగోదావరి :
- నిన్నటి నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడ జీజీహెచ్ లో పరీక్షలు చేయించుకున్న ఎంపీ గీత..
- కోవిడ్ సోకినట్టు నిర్ధారించిన వైద్యులు.. హోం ఐసోలేషన్ కు వెళ్లనున్న ఎంపీ గీత..
- నిన్నటి వరకు పలు అభివృధ్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపి గీత.. ఆందోళనలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు..
కడప :
- పులివెందులకు మరోసారి చేరుకున్న సీబీఐ అదికారులు ..
- జులైలో మొదటిసారి విచారణ ప్రారంభించిన సీబీఐ బృందాలు..
- రెండు వారాలు ముమ్మర దర్యాప్తు చేసి సాక్షులు, అనుమానితులను విచారించిన సీబీఐ..
- నలబై రోజుల తర్వాత మళ్ళీ విచారణ చేపట్టేందుకు పులివెందులకు వచ్చిన సీబీఐ..
- పులివెందుల ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఇద్దరు సీబీఐ అధికారులు..
విజయవాడ
- పరిపాలనా అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం
- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం సాకారం
- విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 500 కోట్లు
- కడప జిల్లా పులివెందుల లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు
- గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు
- కృష్ణా జిల్లా మచిలీపట్నం లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 550 కోట్లు
- పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీల్లో చెరో 100 ఎంబీబీఎస్ సీట్లు
- మచిలీపట్నం మెడికల్ కాలేజీ లో 150 ఎంబీబీఎస్ సీట్లు
- అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో కాలేజీలకు 104.17 కోట్లతో స్థలాల కొనుగోలుకు పరిపాలనా అనుమతులు
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి
తూర్పుగోదావరి- పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు శాసనసభ్యులుచినరాజప్ప కామేంట్స్....
దేవాలయ పరిరక్షణకు, ధార్మికతకు, మత సామరస్యతకు పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో వరుసగా దేవాలయల పై దాడులు వలన హిందువుల మనోభావాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింటున్నాయి.
వైసిపి ప్రభుత్వ ఉదాసీన వైఖరికి రాష్ట్రంలో ప్రజల మధ్య మతసామరస్యం దెబ్బతిని, అశాంతి రాజుకొనే అవకాశం ఉంది. ఆ విధంగా జరిగితే రాష్ట్రాభివృద్ది తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
వైసిపి ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వుంది..
ఈ ప్రభుత్వ హిందు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం *పెద్దాపురం నియోజకవర్గం నందు వారం రోజుల పాటు రేపటి నుంఛి శనివారము వరకు అయా దేవయాల లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తము
తూర్పుగోదావరి -రాజమండ్రి: రాజమండ్రి రూరల్ లో హైవే డీమార్ట్ ఎదురుగా వెంకటగిరి మునసబుగారి వీధిలో ఇంటి ముందు వినాయకుడి విగ్రహానికి అపచారం
వినాయకుని విగ్రహానికి అర్ధరాత్రి మలాన్ని పూచిన గుర్తుతెలియని దుండగలు
ఘటన తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన బొమ్మూరు పోలీసులు
ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
స్థానికులు ఆందోళనతో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దిన బొమ్మూరు పోలీసులు
అక్కడ ఏ సమస్య లేకుండా చూడాలని అంతకు ముందే పోలీసు అధికారులను కోరిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి
విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్....
మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్
అంతర్వేది ఘటన నేపధ్యంలో దేవాలయాల్లో పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటాము. దేవాలయాలకు
సింహాచలం దేవస్థానంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశాము..
సింహగిరిపై నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం
అంతర్వేది ఘటనపై ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారు
దేవస్థానాల భూముల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము
ప్రభుత్వంపై బురదజల్లేందుకు దేవాలయాల అంశాన్ని విపక్షాలు రాజకీయాలకు వాడుకుంటున్నారు
అన్ని మతాలను గౌరవిస్తూనే హిందూ ధర్మం, దేవాలయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము
విశాఖ: పీఎం పాలెంలో ప్రభా క్రికెట్ అకాడమీ ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్
పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం
రాష్ట్రంలో ని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కనే ఈ అకాడమీ ప్రాభించడం సంతోషకరం
క్రీడలకు అవసరమైన స్ధలాలను పరిశీలిస్తున్నాం
అన్ని వసతులు కల్పించి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం రోజు ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదు ..
ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు..
కిలో మీటర్ బేసిస్ లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం ..
అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతుంటాయి..